18, సెప్టెంబర్ 2014, గురువారం
11, సెప్టెంబర్ 2014, గురువారం
కొన్ని సూర్యోదయాల ...సూర్యాస్తమయాల ఫోటోలు
బాపూ గారి ముత్యాల ముగ్గు సినిమా లో డైలాగ్ గుర్తుందిగా ... "సెగెట్రీ ,ఆకాశం లో ఎవరో మర్డర్ చేసినట్టు లేదూ .. మనిసన్నా క కాతంత కళా పోషణ ఉండాలోయ్ "
అలా ఆకాశం ఎర్రబడ్డట్టు కనిపిస్తే చాలు నా చెయ్యి నా ప్రమేయం లేకుండానే కెమెరా మీదకు పోతుంది . ఎంత పనిలో ఉన్నా సరే ఆ కాసేపు అంటే ఓ ఐదు ,పది నిముషాలు ఆ పని పక్క కి జరిపి ఈ పనిలో పడతా నన్నమాట!
అది ఉదయమైనా సాయంత్రమైనా సరే ..
ఇలా ఉదయాలూ,సూర్యాస్తమయాలూ చూస్తున్నా ,తీస్తున్నా చాలా సార్లు బాపూ గారూ,ముత్యాల ముగ్గు డైలాగ్ గుర్తొస్తుంటుంది . ఇప్పుడాయన అక్కడికెళ్ళిపోయారుగా అందుకే ఆయన్ని నా ఫొటో ద్వారా అక్కడున్నట్టు ఏదో చిన్ని ప్రయత్నం !

ఎలా వున్నాయి మరి మా ఊరి సూర్యో దయాలు ,అస్తమయాలు ..
మరి మీరు కాస్త చెప్తే నేను బోల్డు సంతోషిస్తాన్నమాట :)
లేబుళ్లు:
చిత్రాలు
9, సెప్టెంబర్ 2014, మంగళవారం
6, సెప్టెంబర్ 2014, శనివారం
మా ఊరి గణేషుడి ఉత్సవం
మా ఊళ్ళో విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవాలు ఎటువంటి విఘ్నాలూ లేకుండా జయప్రదంగా జరిగాయి.
ఆరవ రోజున నిమజ్జన కార్యక్రమం జరిగింది.
ఉదయం పదింటికి .. ఉల్లాసంగా ఉత్సాహంగా మొదలైన స్వామి వారి ఊరేగింపు ,నిమజ్జన కార్యక్రమం రాత్రి పది గంటలకు జయప్రదంగా ముగిసింది .

అబ్బో మా గణేషుడు లడ్డూ ఈ సంవత్సరం వేలం లో ఇరవై వేల రూపాయలు పలికి రికార్డు సృష్టించింది.

నా చేతిలో తయారైన గణేషులవారు .. మరి మీరేమంటారో కానీ ఈయన ఆయనే అని నా అభిప్రాయం :)
లేబుళ్లు:
మా ఊరి విషయాలు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)