=''/>

10, జూన్ 2010, గురువారం

ఏరువాక ఆరంభం


ఏరువాక సాగాలోరన్నో రైతన్నా..

నీ కష్టమంతా తీరునురోరన్నో రైతన్న...

అని గ్రీష్మఋతువు తరువాత ప్రారంభించే ఏరువాక పురస్కరించుకుని ఒక సినీకవి రాసినపాట ఇది.

జనరంజకమైన ఈపాట గ్రామీణ వ్యవసాయానికి ఏరువాక ప్రాధాన్యతను తెలుపుతుంది .

మంగళవారం నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె వ్యవసాయ పనులకు ప్రారంభసూచిక .నాడు నాగళ్ళతో పనులు ప్రారంభిస్తే నేడు యాంత్రీకరణ ఏరువాక రూపు మార్చివేస్తుంది






మృగశిర కార్తె మంగళవారం నుండి ప్రారంభమైంది .రోళ్లను పగలగొట్టే రోహిణీకార్తె (మే నెల మధ్యనుండి) తరువాత వచ్చే ఈ కార్తె కి వ్యవసాయ రంగం లో ఎంతో ప్రాముఖ్యతుంది.
ఖరీఫ్ పనులు ఈకార్తె లోనే ప్రారంభమవుతాయి. ఈశైన్య ౠతుపవనాలు తొందరగా కరుణిస్తే తొలకరి జల్లులతోడ్పాటుతో రైతులు తమ పనులకు శ్రీకారం చుడతారు .

ఏరువాక పేరుతో నాటి రైతులైతే ,నాగళ్ళు బుజాన వేసుకుని కాడెద్దులతో దుక్కిదున్ని భూమాత ,గంగమ్మతల్లికి,వరుణదేవుడికి పూజలు చేసి పనులు ప్రారంభించేవారని మాతాతగారు అంటారు.

రొజులుమారాయికదా ప్రస్తుతం నాగళ్ళకు బదులు ట్రాక్టర్ లతో ఏరువాక పనులు ప్రారంభమవుతున్నాయి.

డెల్టా ప్రాంతాలలో ఈకార్తెలో నే గోదావరి జలాలను వదులుతారు .పనులుకూడా ఇప్పుడే మొదలుపెడతారు . పదకొండురోజుల పాటు ఈకార్తె ఉంటుంది .


3 కామెంట్‌లు:

  1. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించి అందరు రైతన్నలకూ అధిక దిగుబడి రావాలని నేను కోరుకుంటున్నా!

    రిప్లయితొలగించండి
  2. ఏరువాక పున్నమికి రైతన్నలకి నా వందనం! [కాస్త వెనగ్గా చెప్పాను] పోయినేడు రాసుకున్న కవిత ఇది. http://maruvam.blogspot.com/2009/06/blog-post_07.html - పల్లెల్లో నేను గడిపిన సమయమెంత అన్నది కాక, అక్కడి గ్రామీణవాతావరణం మీద అవగాహనకి నాన్నగారు, అప్పటి కాలమానపరిస్థితులు కారణం. ఏరువాక చూసి పాతెకేళ్ళకి పైగా అయినా ఆ జ్ఞాపకాలు పోవు.

    రిప్లయితొలగించండి
  3. చాలా ధన్యవాదాలు ఉషగారు నా బ్లాగ్ చూసి కామెంట్ రాసినందుకు.మీలాంటి సీనియర్ బ్లాగర్లు మాలాంటి జూనియర్ల బ్లాగ్లు చదివి కామెంట్స్ రాస్తే మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది.
    @ మదురవాణీ దన్యవాదాలు

    రిప్లయితొలగించండి