=''/>

1, డిసెంబర్ 2010, బుధవారం

మా పొలంలో వన బోజనాలు













"పాపికొండలు"వెళ్ళాలనిఅనుకుంటున్నాము... అన్నాను కదా! కానీ ,ఎక్కడో నాకు అనుమానం గానే ఉంది.. అది జరిగేలా లేదని :((( .నేననుకున్నట్లే అయింది.

ఇరవై నాలుగున మా ఆడబడుచు వాళ్ళమ్మాయికీ " ఓణిఫంక్షన్ " అయింది.ఆ మరునాడు పాపి కొండలు వెళదాము....అందరూ ఉంటారు! అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన వెళ్ళ లేకపోయాము.

పాపికొండలు వెల్లట్లేదని చెప్పగానే మా" పిల్లలు" ఏడుపులు మొదలెట్టేశారు. మా అమ్మాయైతే చెప్పక్కర్లేదు....హాస్టల్ లో అందరికీ చెప్పేసేను వెళ్తున్నామని, మీరెప్పుడు ఇంతే...ఎక్కడికి తీసుకెళ్ళారూ..... అంటూ నిష్టూరాలు....


పిల్లలు ముగ్గురూకలిసి (మా ఆడబడుచు కూతురు ,మా పిల్లలు)"మనం రేపు ఎక్కడికైనా వెళ్లాల్సిందే" ... అంటూ ఓ ఆర్డర్ పాడేసి మేమంతా ఒప్పుకుంటేనే కానీ ఊరుకోలేదు.










వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి??మా వారు ,వాళ్ళు ఇప్పుడు పుగతోట ( మార్చి నెల వరకూ పుగాకు తోట పనులుంటాయి)పనులతో
చాలా బిజీ గా ఉంటారు..వాళ్ళ వల్ల ఏమీ పని జరగదు... ఎలాగా ?అనుకుంటూ "పొలం "వెళ్దామా?? "కార్తిక మాసం" కదా "వనభోజనాలు" పెట్టుకున్నట్టు ఉంటుంది. సరదాగా పొలంలో తిరిగి ,పుగాకు తోట ,కొబ్బరితోట అన్నీ చూసినట్టు ఉంటుంది...అన్నాను.

పిల్లలు ఏమంటారో?? అని ఎదురుచూస్తూ....

వీళ్ళు ఒప్పుకోక పోతే ఏంచేయాలి???ఏమంటారో ...అనుకున్నాను కానీ ,ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఊపు మీదున్నారేమో...వెంటనే ఒప్పేసుకున్నారు....

మీరు ఉదయమే తొందరగా లేచి మీ పనులన్నీ చేసుకుని మాకు సాయం చేస్తే ,పదింటికల్లా పొలం వెళ్ళగలుగుతాం....అంటే ,పాపం అలాగే కనపడని సాయం చాలా చేసారు...

అనుకున్నట్లే ...అన్నం ,కూరలు,స్నాక్స్ ,మంచినీళ్ళుతో సహా అన్నీ సర్దుకుని ట్రాక్టర్లో ... పదిగంటలకి పొలం వెళ్లేము.

ప్రియ చూసారా? ఎలా ఎక్కిందో ? ఎక్కింది కానీ దిగడం రాలేదు .అందరం కష్టపడి ఎలాగో దింపాం లెండి..

వెళ్ళగానే ఆట ,పాటలు మొదలెట్టేశారు.వాళ్ళతో కలిసి మేమూ ... హౌసి, రాముడు-సీత ,కళ్ళ గంతలు ఇలా రకరకాల ఆటలన్నీ ఆడేము.వంగిపోయిన కొబ్బరిచెట్టు ఎక్కేపోటీ పెట్టేము..అందరూ ఎక్కడానికి ట్రై చేసారు కానీ, , ప్రియ బాగా పైకేక్కింది.దానికి అందరూ కలిసి మూడు కొబ్బరి బొండాల నీళ్ళు పట్టించేసేరు.(ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి ) .

అమృతకి(ఆడబడుచు కూతురు ) హౌసి లో ఫస్ట్ వచ్చిందని.....

ఆటల్లో నెగ్గినవాళ్ళకి గిఫ్ట్లు ఏంటా?? అనుకుంటున్నారా?? రెండు కొబ్బరి బొండా లు తాగడం , నాలుగు జామ కాయలు,బురగుంజు తినడం:)))) ఇలా ....(మా పిల్లలు ఆరోజే మొదటి సారి బురగుంజు చూడటం ,తినటం)
కాసేపుకోతుల్లా...జామ చెట్లు,మామిడి చెట్లు ఎక్కి ,దిగి ,ఉయ్యాలలూగేరు. మాపొలమంతా తిరిగేక,పక్క పొలం లో కోకో తోటలోకి పిల్లల్ని తీసుకెళ్ళి ,కోకో కాయలు, మొక్కలు చుపించేము.


కోకోకాయలు

పిల్లల ఆనందానికి అంతేలేదు.మా ఆడబడుచు కూతురు అత్తా "మేం వచ్చినప్పుడల్లా పొలం ఇలాగే వెళదాం" అంది.దానికి అంత నచ్చేసింది. . మాపిల్లలూ అప్పుడప్పుడూ... పొలం వెళ్తుంటారు కానీ,కాసేపు అలా తిరిగి వచ్చేస్తారు.ఇలా ఎప్పుడూ వెళ్లక కొత్తగా ఉండి వాళ్ళకీ బాగానచ్చేసింది.

అలా ..సాయంత్రం వరకూసరదాగా... ఆనందంగా ...గడిపేసేమంతా...

మా పిల్లల గొడవ వలన "కార్తిక వనబోజనాలు"కూడా చేసినట్లైంది.
.


బుజ్జి కుక్కపిల్లలు బలే ముద్దొస్తున్నాయికదా! పొలంలో ఉన్నాయి .మాపిల్లలు వాటిని తెచ్చి,అవి తినక పోయినా ..బలవంతంగా వాటికి పులిహార పెట్టేసి వాటిని బెదిరించేసేరు.

21 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయి మీ వనభోజనాలు, ఆటలు, అల్లర్లు...

    రిప్లయితొలగించండి
  2. బాగున్నాయండీ మీ పొలంలో విహార యాత్ర విశేషాలు! cute puppies!:)

    రిప్లయితొలగించండి
  3. మీ పెరటిలో చెట్టులు అన్ని బాగునాయీ వాటికి వున్నా మీ అబిరుచి నేను వస్తున మీ వనబోజనలకి రెడీ మీ పొలంలో మా హోనేమూన్ ట్రిప్ వేయమంటారా

    రిప్లయితొలగించండి
  4. కన్నుల పండువుగా ఉన్నదండీ. మీ పొలానికి దిష్టితీయించండి.

    రిప్లయితొలగించండి
  5. చూడచక్కగా ఉన్నాయి మీ వన భోజనాలు. మన దగ్గిర కోకోకాయలు పండిస్తున్నారా? ఏం చేస్తారండీ వాటిని? అంటే....మార్కెట్ ఉందా అని....ఎన్నాళ్ళనుండి పండిస్తున్నారు?

    రిప్లయితొలగించండి
  6. చాలా బావున్నాయండి మీ వనభోజనాలు.. ఎన్ని డిస్నీలాండ్ లు ఈ విహారయాత్రకి సాటి వస్తాయి చెప్పండి!! కుళ్ళుకోవడం తప్ప వేరేమీ చేయలేను..

    'ఇది కూడా తెలీదా!' అని కోపంగా చూడనంటే ఒక ప్రశ్న.. 'బురగుంజు ' అంటే?

    రిప్లయితొలగించండి
  7. @గీతిక,ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ,:)))ధన్యవాదాలు.
    @మధురవాణి ,ధన్యవాదాలు.
    @సుమలత ,తప్పకుండా వచ్చేయండి:))ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @కొత్తపాళీ,ధన్యవాదాలండి.
    @బుడుగు ,కోకో మావైపు ఐదారేల్లనుండి పెంచుతున్నారు.ఇది పామాయిల్ తోటలో ,కొబ్బరి తోటల్లోనూ అంతరపంటలా పెంచుతున్నారు.మాకు వేసి ఓ సంవత్సరం అయింది.ఫోటో ఉన్నది ఐదేళ్ల తోట లో ఉన్న మొక్క.కాడ్బరిస్ సంస్థ వాళ్ళు కేజీ 160రూ. కి కొంటున్నారు.కాయలు బాగా తయారవ్వాలి..ధన్యవాదాలు.
    @నిషిగంధ ,బాగాకుళ్ళు కోండి:)))) కానీ, మేము మీ డిస్నీ ల్యాండ్ లూ అవి చూడలేము కదా..
    బురగుంజుతెలిదా???:((((బురగుంజు అంటే.. తాటి టెంకల్ని తేగలు కోసం భూమిలో పాతర (కప్పెట్టడం)వేస్తారు. మొలకలు వచ్చేముందు ఆ టెంకలు బాగా ఊరి ఉంటాయి .ఆ టైం లో వాటిని తీసి మధ్యకి నరికితే తెల్లగా ఉంటుంది .దానిని తీసి తింటారు.బాగా తయారైతే తియ్యగా బాగుంటుంది.అవి ఈ టైమ్లోనే ఉంటాయి..
    మీకు అర్ధమైందో లేదో కానీ , ఇంకా ఎలా చెప్పాలోనాకు తెలియడం లేదు:(((...ధన్యవాదాలు. . .
    . ,

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగుంది రాధిక గారూ. మమ్మల్ని కూడా మీ తోటంతా తిప్పేసారు. నాక్కూడా బురగుంజు అంటే తెలియదు:)

    రిప్లయితొలగించండి
  10. ఐతే మీకు బురగుంజు అంటేఏమిటో నేను చెప్పిందిఏమైనా అర్ధమైందా?..థాంక్స్ జయగారు.

    రిప్లయితొలగించండి
  11. రాధికగారు....నేను ఆ ఫొటోలవంకే చూస్తు కూర్చున్నా కాసేపు..అంత బాగున్నాయి ఆ పొలాలు...కాయలు...ఆ బుజ్జి కుక్కపిల్లలు :) భలే ఉంది. నాకు బురగుంజ అంటే ఏమిటో అర్ధమయింది అండీ...మీరు చాలా వివరంగా చెప్పారు అలాగే కోకో గురించి వివరాలు కూడా చక్కగా చెప్పారు :)నాకు మా అమ్మ చెబుతుంది బురగుంజ గురించి.కానీ నేను ఎప్పుడూ తినలేదు :( మీ ప్రియా లాగే నేను చెట్లు ఎక్కేస్తా...దిగేటప్పుడు ఎక్కడ కిందపడతానో అని గోలగోల చేసి దిగుతా :))ఆ గ్నాపకాలని గుర్తుకొచ్చాయి మీ టపా చదివితే.చాలా బాగుంది మీ టపా...

    రిప్లయితొలగించండి
  12. బావున్నాయండీ,విలేజెస్ లొ ఉంటే ఇలాంటి అనుభూతులు సొంతం చేసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  13. థాంక్స్ రాధిక గారు, బురగుంజు గురించి వివరంగా చెప్పినందుకు.. పట్టణాల్లో పెరిగిన మేము కళ్ళజూసేది ఫైనల్ ప్రోడక్ట్సేనండి..
    తేగలు తెలుసు, అవి ఎలా తయారవుతాయో కొంచెంకొంచెం తెలుసు.. ఆ ప్రోసెస్ లో ఇలాంటి exotic పదార్ధాలని మిస్ అవుతున్నామని ఇప్పటివరకూ తెలీదు :(

    రిప్లయితొలగించండి
  14. @ఇందు,ఐతే ప్రియాలా మీరూ తోకలేని కోతే అనమాట:))ధన్యవాదాలు.
    @లత,ధన్యవాదాలు.
    @వేణుశ్రీకాంత్ ,ధన్యవాదాలు.
    @నిషిగంధ,నేను చెప్పింది అర్ధమైందా?:) ..

    రిప్లయితొలగించండి
  15. పాపికొండల కన్నా మీ పొలమే బాగుందండి .
    'బురగుంజు ' మొదటిసారిగా విన్నాను . మీరు చెప్పింది అర్ధమైందండి .

    రిప్లయితొలగించండి
  16. chala baga chepparu vana bhojanla gurinchi. mi polam chala bagundi, vachheyalanipistundi :)

    రిప్లయితొలగించండి
  17. @మాలా కుమార్,దన్యవాదాలండి ..మాపొలం నచ్చినందుకు.బురగుంజు గురించి నేను చెప్పింది అర్ధం చేసుకున్నారా?? :-)
    @స్వప్న ,ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. అహా....భలే ఉంది .... కుక్కపిల్లలు బావున్నయ్ ముద్దుగా
    బురగుంజు గుర్తుచేసారా....తెల్లగా ప్లఫ్ఫిగా తియ్యగా...
    ఆహా అది తినడం కోసం నాగుల చవితి కోసం ఎదురుచూసే వాళ్ళం. (మా ఇంట్లొ నాగుల చవితి కి పుట్టలొ వెసేకా గానీ తేగలు, బురగుంజు తినకూడదని రూలు) ...

    ఫొటొ పెట్టాల్సిందండీ ......... రాలిన తాటికాయల ఏరడం... తేగలపాతర.. తేగలు తియ్యడం...బురగుంజు కొసం టెంక పగలకొట్టడం, తేగలు కుండలొ కాల్చడం...తేగలు వలిచి చందమామ తియ్యడం... వీలుంటే ఇవి ఫొటొలు పెట్టండి .. మాకొసం

    రిప్లయితొలగించండి
  19. మంచు గారు నాకు చాలా ఆనందంగా ఉంది . . నా బ్లాగ్ లోకి వచ్చారు, ఇదే మీమొదటి కామెంట్.చాలా థాంక్స్ అండి.బురగుంజు కాదుకానీ,తెగలు పెడతా మీ కోసం :). .

    రిప్లయితొలగించండి