=''/>

20, డిసెంబర్ 2010, సోమవారం

నా వందో టపా

సచినే కాదండోయ్ నేనూ కోట్టా" సెంచరీ" ఈ రోజు ... నా "వందో టపా" రాసి :))

పల్లెటూరు లో ఉండే" నేను " బ్లాగ్లోకం లోకి అడుగుపెట్టాను.నేనూ ఓ" బ్లాగ్" రాస్తున్నాను!! అదే నాకుపెద్ద తుత్తి.

కాకపొతే రాసి కన్నా వాసి ముఖ్యం కదా!కొందరు బలే రాస్తుంటారు .అవి చదువుతుంటే నేనూ అలా రాయలేనా ?అనిపిస్తుంటుంది. కానీ, ఏమన్నా కొత్తగా రాయడానికి ప్రయత్నిద్దామన్నాఏవిటో ఏమీ తోచి చావదు . " పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు"వాళ్లవి , వీళ్ళవి చూసి అలా రాయాలని అనుకోవడమెందుకు? అని ఏదో నాకెలా తోస్తే అలా ... నా బుర్రను ఎక్కువ కష్టపెట్టకుండా ఇలా వంద టపాలు పూర్తి చేసేసా :)).

నేన ఏమి రాసినా ఓపికగా చదివి ,కామెంట్స్ రాస్తూ నన్ను ప్రోత్సాహిస్తూ .. ఇంకా బాగా రాయాలనే ఆశక్తిని కలిగిస్తున్న నా బ్లాగ్ మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :).

38 కామెంట్‌లు:

  1. @ రాధిక,
    కంగ్రాట్స్. మీ బ్లాగ్ చదవటం నాకు చాలా ఇష్టం. మీరిలాగే సచిన్ లా 50 సెంచరీలు చేయాలని..

    రిప్లయితొలగించండి
  2. అభినందనలు..మరో వంద సెంచరీలు చేసెయ్యండి.

    రిప్లయితొలగించండి
  3. మీరు రాసే పల్లెటూరి విశేషాలన్నీ చాలా సరదాగానూ ఆహ్లాదంగానూ ఉంటాయి. మీరిలాగే రాస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి
  4. శత టపోత్సవ శుభ దినానికి శత శుభాభినందనాలు. క౦గ్రాట్యూలేషన్సు . ముబారక్. నాకు ఇంకే భాషలు రావు.సాదా సీదా పల్లెటూరి గృహిణి నని చెప్పుకుంటూ ఇంతమంది అభిమానులని సంపాదించుకొన్నారు. ఇల్లాగే మీరు మరిన్ని శత, సహస్ర టపాలు వ్రాయాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  5. అభినందనలు రాధిక గారు. మీ ఊరి చిత్రాలు, మీరు చెప్పే కమ్మని పల్లె కబుర్లు, మీ చిన్నారి కబుర్లు వెరసి మీ బ్లాగ్‍కి వస్తే సొంతఊరికి వెళ్ళినట్లు చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  6. రాధిక గారు! నాకు చాలా హ్యపీగా ఉంది.మరి సచినే కాదు....మా రాధికగారు కూడా సెంచ్యురీ కొట్టారు! మీ టపాలు తాజా గా ఉంటాయి....పల్లెటూరి అందాలను అంతో అందంగా వ్రాస్తారు.కాబట్టి శతటపోత్సవ సందర్భంగా మా అందరికీ మీ కొబ్బరితోటలో విందు ఏర్పాటు చేయాలన్నమాట! ఓకేనా??

    రిప్లయితొలగించండి
  7. రాధిక గారు ,
    మీరిలాగే మరిన్ని సెంచరీలు కొట్టాలని కోరుకుంటూ , అభినందనలండి .

    రిప్లయితొలగించండి
  8. అతి సహజమైన శైలి ఆకట్టుకున్నంతగా మరేది మనసును పట్టుకోదు.అటువంటి శైలి మీ స్వంతం. మరిన్ని చక్కటి పోస్టులు మీద్వారా రావాలని వంద వెయ్యిగా మారాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. రాధిక గారూ...

    మీ వందో పోస్ట్‌కీ, అది వ్రాసిన మీకు.. అభినందనలు. మీరు మరింకెన్నో పోస్టుల్తో ఇంకా బోలెడు మంది అభిమానాన్ని సంపాదించుకోవాలని నా హృదయపూర్వక కోరిక.

    ఒకే జిల్లాలో ఉండి ఇంత లేటుగా విష్ చేస్తున్నానా...! అలగమాకండేం..

    రిప్లయితొలగించండి
  10. రాధిక గారు... అభినంధనలు ...

    మీ ఫొటొలతొ, టపాలతొ ఎప్పుడూ ఇంటికితీసుకువెళుతూ ఉంటారు నన్ను.... అందుకే ఈ ఒక్క పొస్ట్ మిస్ అవను నేను...ముఖ్యంగా ఫొటొల బ్లాగ్ ...
    మీరు ఇలాగే మరిన్ని పొస్ట్లతొ మరింత ఎక్కువ మంది అభిమానాన్ని సంపాదించాలని...మీకు కరెంట్ కొత తక్కువుండాలని (అప్పుడే కదా మాకు ఎక్కువ పొస్ట్లు) మనస్పూర్తిగా కొరుకుంటూ

    మంచు

    రిప్లయితొలగించండి
  11. పల్లెను,పల్లెప్రేమను మీ బ్లాగు ద్వారా బతికిస్తున్నారు.
    సంతొషం మీరు వంద పొస్టులు పూర్తి చేసినందుకు

    రిప్లయితొలగించండి
  12. @లత ,ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ ,చాలా చాలా థాంక్స్ మీ అభిమానానికి:-)..
    @సిరిసిరిమువ్వ,ధన్యవాదాలు.
    @నీకోసమేనా అన్వేషణ ,ధన్యవాదాలు తమ్ముడు.అలాగే గుర్తుపెట్టుకుంటున్నాను.
    @శిశిర,ధన్యవాదాలు.
    @సౌమ్య ,ధన్యవాదాలండి:).

    రిప్లయితొలగించండి
  13. @బులుసు సుబ్రహ్మణ్యం,ధన్యవాదాలండి.
    @pureti,@రాజి,@తృష్ణ ,ధన్యవాదాలు.
    @వేణుశ్రీకాంత్ ,చాలా చాలా థాంక్స్ :))
    డబుల్ ఓకే ఇందు :))మీరంతా వస్తానంటే ...నే కాదంటానా?మా కొబ్బరితోటలో విందుకి అన్ని ఏర్పాట్లు చేసేయనా? చక చకా!:))
    @మాలా కుమార్ ,ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @ఉమాదేవి ,ధన్యవాదాలండి.
    @గీతిక ,ధన్యవాదాలు.
    @మధురవాణి,ధన్యవాదాలు.
    @చాలా..చాలా థాంక్స్ మంచు గారు.వర్షాలు ఎక్కువగా పడటం వలన మాకిప్పుడు కరెంటు కోత పెద్దగా ఉండటంలేదండి :))
    @ksm,ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  15. కోనసీమలో గోదారొడ్డుకి షికారెళ్ళినట్టుగా ఉంటుంది మీ బ్లాగుకి రావడం.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. రాధిక గారు స్పెషల్ కంగ్రాట్స్.ఇన్నాళ్ళు మీ ఊళ్ళో దర్జాగా విహరించాగా మరి.

    రిప్లయితొలగించండి
  17. @శ్రీ, ధన్యవాదాలు.
    కొత్తపాళీ గారు చాలా ..చాలా థాంక్స్ అండి .
    @జయ,ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  18. రాధికగారు మీ టపా శతకానికి సుభాబినందనలు .ఇలాంటి శతకాలు ఇంకా మీ బ్లాగు నుంచి అనేకం రావాలని ,ఇంకా ఎక్కువ మంచి వాఖ్యలు అందరినుంచి పొందాలని ఆసిస్తున్నానండి.నేను మీ పోస్టులు ఎప్పతికప్పుడు చూస్తానండి .చాల బాగుంటాయి

    రిప్లయితొలగించండి
  19. http://ennela-ennela.blogspot.com/2010/12/blog-post_23.html?showComment=1293343789311#c6680448716927050514

    రాధిక గారు ఈ కామెంట్స్ చూడండి... ఆ బొంబాయి మిఠాయి ని మనవైపు ఎమంటారు ఐడియా ఉందా... నాకు పీచు మిఠాయ్ అని గుర్తు ఉంది. పీచు మిఠాయ్ అంటే కాటన్ కాండీ కదా... దీన్ని కూడా పీచుమిఠాయ్ అనే పిలుస్తామా ??

    రిప్లయితొలగించండి
  20. మంచు గారు ఎన్నెలగారు అన్న బొంబాయిమిఠాయిని మనవైపు పీచుమిఠాయ్ అనే అంటామండి.పుల్ల బర్ఫిని మేము పుల్లైస్ అంటాము.

    రిప్లయితొలగించండి
  21. కొద్దిగా ఆలస్యంగా శుభాకాంక్షలు రాధిక :)
    పీచు మిఠాయి అంటే గులాబిరంగులో ఇలా పీచు పీచుగా ఉండి..ఒక పుల్ల చుట్టూ పెద్ద ఉండలా త్రిప్పి ఇస్తాడు కదా..మంచు గారు మీరు చెప్పింది వాచ్ లు,గడియారాలు,బొమ్మలు చేసే జీడిపాకం లాంటి మిఠాయి కదా .. మరి దాన్నేం అంటారబ్బా?? దాన్ని కూడా పీచు మిఠాయే అనుకుంటా అంటారు :)

    రిప్లయితొలగించండి
  22. Manchu garu, radhika gaaru and nestam gaaru, meekandarikee krutajnatalu....radhika gaari teeyani'sata tapa' peechu mitaayi lo naa peechu mitaayi pettinananduku..nenu cheppina bombaayi mittaayi ,, peechu mitaayi okati kaadanukutanandee..meeru cheputunnadi cotton candee anipistondi......deenni pedda baboo stick ki payina chuttukuni vachchevaadu bhujam meeda pettukuni..pharvaa ledu..naaku mee blog lo pullayisu to paatu tegalu kuda dorikesaayi....pachci chintakaayalu kuda tinesaanu...pullahaa......mee kaburlu tiyyahaa unnayi....nenu kammahaa vinesaanu(chadivesaanu)..
    maa ammamma gaarokaru ila antaarannamaata...tiyyaha..pullaha ani...hahaha)

    రిప్లయితొలగించండి
  23. wish cheyyadam marichipoyya..abhinandanalandee...sahasraadhika comment siddhi rastu....

    రిప్లయితొలగించండి
  24. @నేస్తం,ధన్యవాదాలు.
    @మల్రెడ్డిపల్లి,ధన్యవాదాలు.
    ఎన్నెలగారు నా తియ్యని ,పుల్లని కబుర్లు నచ్చినందుకు,మీ ఆశీర్వాదంకూ ధన్యవాదాలండి.
    పుల్లహ..తియ్యహ :)) హహ్హహ్హ :))బాగుందండి.

    రిప్లయితొలగించండి
  25. ఎన్నెల గారు ... మేము కాటన్ కాండీ ని , బొంబాయ్ మిఠాయి ని కూడా పీచు మిఠాయ్ అనే అంటాం.... నేస్తం గారు కాస్త కంఫ్యూజ్ అయ్యారు అంతే :-)

    రిప్లయితొలగించండి
  26. ఆలస్యంగా అభినందనలండీ.. మన బ్లాగు మన డైరీ కదండీ..మనకి నచ్చినవన్నీ రాసుకోవచ్చు..

    రిప్లయితొలగించండి
  27. మీ బ్లాగ్ చాలా బావుంటోందండీ..
    ఇలాగే రాస్తూ ఉండండి.
    ఈ కాంక్రీట్ అరణ్యాల్లో బ్రతికే నాలాంటి వాళ్ళకు మీరు రాసే మాటలు చాలా నచ్చుతున్నాయి.
    -ఒక అభిమాన సోదరుడు.

    రిప్లయితొలగించండి