=''/>

14, మార్చి 2011, సోమవారం

టమాటా,మిరపమొక్కలు.


టమాటాలను మనం ఇంచుమించు అన్నికూరలలోనూ వాడతాము.ఒక్కో సీజన్లో వాటి రేట్లుకూడా మండిపోతుంటాయి...కొద్దిగా శ్రద్ద పెడితే విత్తనాలు ,నారు కొనకుండానే పెరట్లోనో ,పూల కుండీలలోనో టమాటా మొక్కలును అన్ని సీజన్ల లోను పెంచుకోవచ్చు,టమాటాలు పండించవచ్చు..

ఈ కాయలు ఇలా గింజలు తీసి జల్లితే లేచిన మొక్కవే !


టమటాలను ముక్కలు కోసేటప్పుడు...వాటిలో గింజలను ,ఒకనీళ్ళగిన్నె లోకి తీసుకోవాలి.ఆనీళ్ళను పూల కుండీలో పోస్తే మూడునాలుగు రోజులలో చిన్నచిన్న మొలకలు వస్తాయి .వాటిని జానెడు పొడవు అయ్యే వరకూ ఆకుండీలోనే వుంచి తరువాత వేరే దానిలో వేసుకొంటే రెండునెలలో కాయలు కాస్తాయి .మనము సొంతముగా పండిచిన కూరగాయలతో వండుకొంటే ఎంత తుత్తి గా ఉంటుందండి

అలాగే మిరపమొక్కలు కూడాపెంచవచ్చు. ఎండుమిరపకాయలు ఐపోయాక డబ్బాలో అడుగున గింజలు ఉంటాయి కదా!వాటిని పాడేయకుండా పూలకుండీలో జల్లితే ,ఒక వారానికి మిరప నారు రెడీ .వాటిని కొద్దిగా పెరిగాక వేరే కుండీలోవేస్తే అవికూడా రెండు ,మూడునెలలోనే కాపుకొస్తాయి.

దోస ,గుమ్మడి కూడా అలానే వేసుకోవచ్చు.మంచి కాయలైతే గింజలు పాడేయకుండా నీళ్ళలోకి తీసుకుని జల్లుకుంటే మొక్కలు చక్కగా లేస్తాయి.

చేసి చూస్తారుగా! కాస్త శ్రద్ద పెడితే చాలు ... టమాటా,మిరప కైతే పూలకుండీలుంటే చాలు.

7 కామెంట్‌లు:

  1. మిరప మొక్కలు కూడా ఫోటో పెట్టల్సింది కదండీ. నేనూ కుండిలో బోలెడు పచ్చి మిరపకాయలు కాయించాను. ఒక్క మొక్క ఉంటే చాలు బోలెడు మిర్చి..:)

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుదు టమాటా ఐదు రూపాయలు కిలో!

    యాభై రూపాయలు కిలో ఉన్నప్పుడు కాసింటే ఎంత బాగుండు!

    రిప్లయితొలగించండి
  3. బాగుంది.. బీర తీగలు.. పైదాకా వెళ్లి.. చాలా అందం గా వ్యాపించి, చిన్న కాయలన్నీ ఎండిపోతున్నాయి మా ఇంట్లో... ఎందుకంటారు?

    రిప్లయితొలగించండి
  4. ఇలా అన్నీ పెంచడం నాకు చాలా ఇష్టం కానీ ఇంతవరకూ నా కోరిక తీరలేదు
    నిజంగా మనం పెంచిన మొక్క పూలు పూసి పిందెలు వస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది

    రిప్లయితొలగించండి
  5. చక్కటి గైడ్ లైన్స్ చెప్పారండీ. తప్పకుండా ట్రై చేస్తాను.

    రిప్లయితొలగించండి
  6. మీ తోటలన్నీ చాలా బాగుంటాయండి. మంచి కబుర్లు చెప్తారు మీరు.

    రిప్లయితొలగించండి