మా ఇంటి పక్కనే పొలముంటుంది .ఏమి తోచనప్పుడల్లా ఆ పొలంలో కూలీల పని పాటలు చూస్తుంటా.
చాలా సార్లు ఆ పొలంలో ట్రాక్టర్ దున్నుతుంటే, కాకులు,కొంగలే కాకుండా ,గోరింకలు ,పిచుకలు వంటి చిన్న
చిన్న పక్షులు కూడా ట్రాక్టర్ వెనకాలే ఎగురుతూ వెళ్ళడం చూస్తుండే దానిని .అవి అలా ఎగురుతూ కిందవాలి
,మళ్ళా ఎగురుతూ ఉంటాయి .ఇవేమిటి ? ట్రాక్టర్ వెనకాల ఇలా ఎగుతున్నాయి ?అనుకునేదానిని .
మాకు ఇప్పుడు పుగతోటలు వేసే రోజులు.అందరూ దుక్కులు దున్ని తోటలు వేసే పనిలో ఉన్నారు.పక్క పొలం
రైతు కూడా ట్రాక్టర్ తో దున్నిస్తున్నాడు .నిన్న దున్నుతుంటే గమనిస్తున్నాను ....మళ్ళీ అలాగే పక్షులు ఎగురుతూ ట్రాక్టర్ తో పాటు వెళుతున్నాయి...
అలా దున్నడాన్ని బాగా గమనిస్తే నాకు అసలు విషయం తెలిసిపోయింది. ట్రాక్టర్ దున్నేటప్పుడు భూమి లోపలి చిన్న చిన్న పురుగులు పైకి వస్తాయి కదా! వాటిని తినడానికే అవి అలా ట్రాక్టర్ వెనకాలే ఎగురుతూ వస్తున్నాయని.

ఈ ఫొటోలు తీస్తున్నపుడే సన్నగా వర్షం తుంపర మొదలైంది .
Very beautiful
రిప్లయితొలగించండిkastephale గారు,ధన్యవాదాలండి.
తొలగించండిమంచి అబ్జర్వేషన్!
రిప్లయితొలగించండిyou have a great camera view !
రిప్లయితొలగించండిthanks ajnata garu.
తొలగించండిWow, very good observation & a great photography. ఫొటో లు ఎంత బాగున్నాయో. వర్షానికి ముందూ....వర్షం లో కూడా భలే వచ్చాయి ఫొటోలు.
రిప్లయితొలగించండిచాలా ..చాలా థాంక్స్ జయ గారు.
తొలగించండిఫొటో లు చాలా బాగున్నాయండి .
రిప్లయితొలగించండిthanksandi
తొలగించండిభలే కనిపెట్టేసారే.. :))
రిప్లయితొలగించండిమీ ఊరు చాలా అందంగా ఉందండీ.. :)
ధన్యవాదాలు.మీరు నా బ్లాగ్ వైపు వచ్చి చాలా రోజులైంది స్వాగతం మధురవాణి గారు.ఈ పొస్ట్ కూడా చూడండి http://saisatyapriya.blogspot.in/2012/10/blog-post_3.htm
తొలగించండిపొగ చెట్లు పెరిగాక ఫోటోలు పెట్టరూ చూసి చాలా రోజులైంది. తోట చాలా అందంగా ఉంటుంది.
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారు నా బ్లాగ్ కి స్వాగతమండి. పుగాకు తోటలు ఇప్పుడే వేస్తున్నారండి , పెరిగేక తప్పకుండా పెడతానండి .ధన్యవాదాలండి
రిప్లయితొలగించండిఅయ్యబాబోయ్ మీరు మా పగోజిల్లావారండి
రిప్లయితొలగించండి