=''/>

5, నవంబర్ 2012, సోమవారం

ఈ నీలం మమ్మల్ని వదిలేటట్టు లేదు!



నీలం ఎఫెక్ట్ మనకుండదులే! తమిళనాడు వైపు ఉంది అనుకున్నారు . వార్తల్లో తీరం దాటి పోయిందన్న వార్త చూసి   పరవాలేదు గండం గడిచింది   అన్నారు .

తీరం దాటిన తరువాత దాని ప్రభావమంతా మన రాష్త్రం మీద పడింది.ఉత్తర ,దక్షిణ  కొస్తా అంతా అతలాకుతల మైపోయింది.

 చాలా చోట్ల వరద నీరంతా ఊళ్లను,పొలాలనూ ముంచెత్తింది.తినడానికి, ఉండడానికి లేక జనమంతా చాలా కష్టాలు పడుతున్నారు.

మా  వరిచేలు పది పదిహేను రోజుల్లో కోతకు సిద్దమవుతాయి. పుగతోటలు (నాట్లు)వేయడం మొదలు పెట్టారు.ఇంకో వారం ఐతే  పూర్తయ్యే  దశలో ఉన్నాయి. ఈ టైం లో  పడిన వర్షాలు ,వరదల వలన మా వరిచేనంతా  వరద నీటిలో మునిగి పోయింది .ఎప్పుడు బయట పడుతుందో తెలియదు. మా   చుట్టూ పక్కల  చాలా మంది పొలాలు కూడా  ఇలాగే  వరదనీటిలో  నానుతున్నాయి..వేసిన పుగతోట ల్లో   మొక్కలు కుళ్ళిపోయాయి.మళ్లీ  తోటలు వెయ్యాల్సిందే .

 పాపం చిన్న రైతులకి ,కౌలు రైతులకి  ఎంత  కష్టం? వాళ్ళతో పోలిస్తే మేము కాస్త పరవాలేదు. కాని,ఇంచుమించు ప్రతీ సంవత్సరమూ కోతల టైము లోనే ఇలా జరుగుతుంది.      
   
 రాత్రంతా పడలేదు తగ్గింది అనుకున్నాము.ఈ రోజు  మళ్లీ  వర్షం పడటం మొదలైంది.ఎప్పుడు  వదులుతుందో ?ఈ నీలం ?




                                                                     మా ఊరి  చెరువు





 





                                   చేతికందాల్సిన  పంట  నీటిపాలు :(

                           
                      చెరువు ని తలపిస్తున్న    మా పొలం వెళ్ళే దారి     

11 కామెంట్‌లు:

  1. హ్మ్ ఏం చెప్పాలో తెలీట్లేదండీ :( జాగ్రత్తగా ఉండండి.

    రిప్లయితొలగించండి
  2. చాలా దారుణంగా ఉంది పరిస్థితి.మేము ఇరవై రోజుల క్రితం శనగ పైరు వేసాం.వర్షం ఎక్కువైతే మొలకలు చచ్చిపోతాయి.రెండు సంవత్సరాల క్రితం అలా మూడు సార్లు విత్తాల్సి వచ్చింది.ఆ పరిస్థితి పునరావృతమవుతుందేమోనని భయంగా ఉంది.ప్రస్తుతం ఇబ్బంది లేదు.వర్షం తగ్గకపోతేనే సమస్య.మీ ప్రాంత పరిస్థితి చూస్తే కన్నీళ్ళాగడం లేదు.

    రిప్లయితొలగించండి
  3. మీ కబుర్లు విని ఎప్పుడూ సంతోష పడే దాన్ని. ఇప్పుడు ఇలా చూడాల్సొస్తుందనుకోలేదు. ఇంక ఎటువంటి సమస్య లేకుండా ఎప్పటిలా కళ కళ లాడుతూ ఉండాలని, అది చూసి మేము సంతోషించాలనికోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. నీలం తుఫాను మీ ఊరికి తెచ్చిన నష్టం నుంచి
    త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ

    రిప్లయితొలగించండి
  5. I am feeling very disturbed and sad :-(
    Sorry for your loss.

    రిప్లయితొలగించండి