=''/>

1, నవంబర్ 2012, గురువారం

ఈ రోజు అట్లతద్ది


                                                           
                                                                 అట్లతద్దోయ్ !  ఆరట్లోయ్ !
         
                                                              ముద్దపప్పోయ్ !మూడట్లోయ్ !
                                                         
                                                                 చప్పట్లోయ్ ! తాళాలోయ్ !
               
                                                                 దేవుడి గుళ్ళో  మేళాలోయ్ !
             
                                                                పప్పూ బెల్లం  దేవుడికోయ్ !
                                                             
                                                                పాలూ నెయ్యీ నీకూ నాకోయ్!
                                 
                       

  ఆశ్వీయుజ  పౌర్ణిమ వెళ్ళిన మూడోరోజు వచ్చే  తదియే అట్లతద్ది !

ఇప్పుడు అట్లతద్ది అంటే అట్లు వేసుకుని తినడమే... . మా చిన్నప్పుడు అమ్మావాళ్ళు పూజలు చేసుకుని వాయినాలు ఇచ్చుకోవడం తెలుసు . కానీ మేమూ .. అట్లతద్ది రోజు ప్రతేకంగా ఏమీ పూజకూడా చేయట్లేదు.మా గోదావరి జిల్లాల వైపు పెళ్ళైన వారం లోపులో తద్ది పూజ చేయిచేయించి , ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు. తరువాత నాలుగైదేళ్ళు తద్ది ఉపవాసం ఉండి .... అట్లతద్ది జరుపుకుంటాము .తరువాత అదీ ఉండదు.కాకపొతే అట్లతద్ది రోజు అట్లేసి , బెల్లంచారు కాసి పాలేళ్ళకి,కూలీలకి,చాకలి,మంగలి ఇలా అందరికీ పెడతాము. అదేమాకు అట్లతద్ది పండుగ. ఓపిక గా చేయాలి అనుకునే వాళ్ళు ఇలా అన్నా చేస్తున్నారు . .

ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది

పట్నాల సంగతెలా ఉన్నా ,పల్లెల్లో కుడా ఇటువంటి కొన్ని పండుగలు అలా ..అలా ... మరుగున పడిపోతాయేమో!

4 కామెంట్‌లు:

  1. అట్లతద్దిని గుర్తు చేసినందుకు చాలా సంతోషం.

    ఆధినిక నాగరికత పేరుతో పాశ్చాత్యసంస్కృతి పట్ల వ్యామోహం పెరిగిపోతున్న రోజులివి.
    నిన్న రాత్రి మా కాలింగ్ బెల్ పదే పదే మ్రోగింది.
    కాంప్లెక్స్ లోని పిల్లల హలోవీన్ సందడి కారణం!

    మీకు హలోవీన్ సెలిబ్రేట్ చేసుకోవాలని ఉంటే అమెరికా పొండి. ఇది భారతదేశం అని చెప్పి పంపాను అందరినీ.

    ఈ రోజు ఇక్కడ నిశ్చయంగా అట్లతద్ది సంరంభం యేమీ‌ ఉండదని చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  2. అబ్బా నోరూరిపోతోందండి:( మేమైతే ఉయ్యాల కూడా ఊగే వాళ్ళం. వద్దండి. మీరు మాత్రం ఇవేవి మరుగున పడేయకండి. ఇంత మంచి అనుభవాలు మాకెప్పుడూ పంచుతూనే ఉండాలి.

    రిప్లయితొలగించండి
  3. ఈ అట్లతద్ది రోజు చేసిన అట్లే అంత రుచిగా ఎందుకుంటాయో గానండీ నాకైతే భలే ఇష్టం. ఇంటి దగ్గరుంటే ఉయ్యాలైనా ఊగేదాన్ని:(

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం gaaru thanks andi.జయgaaru,సుభ gaaru thanks andi.

    రిప్లయితొలగించండి