=''/>

30, నవంబర్ 2012, శుక్రవారం

చుక్కల కోయిల ఫోటోలు (అస్సలు నచ్చలేదు )


 శ్రీగంధం చెట్టు   సంవత్సరానికి  రెండు సార్లు  కాస్తుంది. కాయలు  నల్లగా చిన్నగా ఉంటాయి.పళ్ళు  తయారైయ్యాక రాలిపొతాయి .విత్తనాలకు ఉంటాయని అవి ఏరి ఎండబెడతాము.  

ఎలా అలవాటు పడిందో ఈ మధ్య ఓ పక్షి రోజూ వచ్చి మా  శ్రీగంధం చెట్టు పళ్ళు మొత్తం తినేస్తుంది. సరిగ్గా  ఉదయం ఆరు గంటలకి  మళ్ళీ  సాయంత్రం ఆరుగంటలకి  వచ్చేస్తుంది. రాగానే   నేనొచ్చేసేనొహో!  అని చేప్పడానికేమో  చెట్టు మీదనుండి  అరుస్తా ఉంటాది .అది అరిసినట్లే కూస్తాది.దాని పిలుపు విని  ఇదప్పుడే వచ్చెసింది టైం ఆరైందా?అనుకోవాలి .నిజంగా  ఐదు పదినిముషాలు  అటూఇటూగా  వస్తుంది.చెట్టుకి ఒక్క పండు కూడా  లేకుండా మొత్తం కానిచ్చేసింది .కింద ఒక్క పండు పడలేదు.

 ఒకరోజు  భరత్ (మా పాలేరు)దానిని చూసి  చుక్కల కోయిల  ఇక్కడకి కూడా వచ్చిందండీ ? ఇవి ఎక్కువగా పొలాల్లోనే కనిపిస్తాయంటే , అప్పుడు తెల్సింది!  దానిని చుక్కల కోయిల అంటారని .

నాకు ఈ చుక్కల కోయిల అస్సలు నచ్చలేదు. కాకినే   చూడటానికి  బాగోదనుకుంటాము  కానీ, నాకైతే  దీని కన్నా కాకే  కాస్త  బెటరేమో  అనిపించింది. 






   
  ఎలా ఉంది ?ఆ నల్ల రంగు మీద  తెల్ల చుక్కలు ,ఎర్ర నోరు  ...



  





























  

12 కామెంట్‌లు:

  1. ఇదే ప్రథమం.. ఈ చుక్కల కోకిల ని చూడటం. నాకు బాగానే నచ్చింది ..

    రిప్లయితొలగించండి
  2. చుక్కలకోయిల నాకు బాగా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  3. చుక్కల కోయిల ఎప్పుడూ వినలేదు. ఇంకో పేరుతో ఏమైనా పిలుస్తారా? పక్షిని చూసినట్టే అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  4. ఈ పక్షిని ఐతే చాలా సార్లు చూసా! దొండపండ్లు కూడా తినేది మా ఇంటిపక్కన ఉన్న స్థలంలో చాలాసార్ల్ చూసా ఈ చుక్కలకోయిల ని. కానీ దీన్ని ఇలా అంటారని తెలీదు.

    రిప్లయితొలగించండి
  5. ఇది తరచుగా కనిపించే పక్షే..(సిటీల్లో కాదు లెండి, పల్లెల్లో). నా చిన్నప్పుడు మా ఇంటి పక్క ఖాళీ స్థలంలో ఉన్న వేప చెట్టు మీద కనిపించేది.దీని పేరు మా వూర్లో కౌజు పిట్ట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది కౌజు పిట్ట కాదు. కౌజుపిట్ట ఇంత పెద్దగా వుండదు.

      తొలగించండి
  6. నేను ఎప్పుడూ చూడలేదండి ఈ చుక్కల కోయిలని . కోయిల కూత లాగే ఉంటుందా దీని కూత కూడా ?
    - విజయ జ్యోతి.

    రిప్లయితొలగించండి
  7. ఇది చుక్కల కోయిల కాదు ఆడ కోయిల. మగవి నల్లగానూ,ఆడవి ఇలా చుక్కలతోనూ ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  8. ma inti daggara regular ga choosta kani peru teliyadu.... intaki Srigandham chettu antey enti ?

    రిప్లయితొలగించండి