30, మార్చి 2013, శనివారం
7, మార్చి 2013, గురువారం
విద్యుత్ కోతలు ...నా ఫొటోలు
ఈ ఏడు కురిసిన అంతంత మాత్రపు వర్షాలకు కరెంట్ ఉత్పత్తి తక్కువగా ఉందని అనధికారికంగా కోతలు మాకు అక్టోబర్ నుండే మొదలైపోయాయి.
ఒక వారం.. ఉదయం ఆరు గంటలకు తీసి పదకొండు గంటలకు కరెంట్ ఇస్తారు . ఒక వారం పదకొండు గంటలకు తీసి సాయంత్రం ఆరు గంటలకు ఇస్తారు.ఇది మా పల్లెల్లో ఎప్పుడూ ఉండేదే .
ఇప్పుడు పల్లెలకు పూటంతా కరెంట్ కోత అంటున్నారు. పల్లెల్లో ఉన్న వాళ్ళు ఏం పాపం చేసుకున్నారో !
మాకు పొలాలకు, ఊళ్ళకు ఒకటే లైన్లు ఉండటం వల్ల పగలు ఏదో రెండు గంటలుంటుంది లెండి . పొలాలకి కరెంటు ఇచ్చినప్పుడు మాకూ ఇస్తారు . ఈనెలా పోతే ఎండలు ఇంకా పెరుగుతాయి ...కోతలు ఇంకా పెరుగుతాయి.అప్పుడు రాత్రుళ్ళు కూడా నాలుగైదు గంటలు తీసేస్తుంటాడు . ఏం చేస్తాం !కాసేపు తిట్టుకుని అలా ఉండటానికి అలవాటు పడిపోతాము .
కరెంట్ ఎప్పుడిస్తాడా అని ఎదురుచూస్తూ , ఏదోక కాలక్షేపం చేస్తూ మధ్య మధ్య లో ఇలా కెమెరా కి పని కల్పిస్తుంటా !
పాపం గోరింక ! దాని కాళ్ళకున్న వెంట్రుకలు చూసారా ?అస్తమాను వాటిని నోటితో లాక్కుంటూ ,కుంటుకుంటూ తిరుగుతుంటుంది .
కాకి ఒకటి నీళ్ళకు కావు కావు మనుచు!

మా వీధికుక్కపిల్లలు .పిలిస్తే వచ్చేస్తాయి. సాయంత్రం కాసేపు వాటితో కాలక్షేపం .

లేబుళ్లు:
చిత్రాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)