=''/>

7, మార్చి 2013, గురువారం

విద్యుత్ కోతలు ...నా ఫొటోలు

ఈ ఏడు  కురిసిన అంతంత మాత్రపు వర్షాలకు కరెంట్  ఉత్పత్తి తక్కువగా ఉందని అనధికారికంగా  కోతలు మాకు   అక్టోబర్ నుండే  మొదలైపోయాయి.

  ఒక వారం.. ఉదయం ఆరు గంటలకు తీసి  పదకొండు గంటలకు కరెంట్ ఇస్తారు . ఒక వారం  పదకొండు గంటలకు తీసి సాయంత్రం ఆరు గంటలకు ఇస్తారు.ఇది  మా పల్లెల్లో  ఎప్పుడూ ఉండేదే .


ఇప్పుడు  పల్లెలకు పూటంతా కరెంట్  కోత అంటున్నారు. పల్లెల్లో ఉన్న వాళ్ళు  ఏం పాపం చేసుకున్నారో !


  మాకు పొలాలకు, ఊళ్ళకు ఒకటే   లైన్లు ఉండటం వల్ల  పగలు ఏదో  రెండు గంటలుంటుంది లెండి . పొలాలకి   కరెంటు ఇచ్చినప్పుడు  మాకూ ఇస్తారు . ఈనెలా పోతే ఎండలు ఇంకా పెరుగుతాయి  ...కోతలు ఇంకా పెరుగుతాయి.అప్పుడు రాత్రుళ్ళు కూడా నాలుగైదు గంటలు తీసేస్తుంటాడు .  ఏం చేస్తాం !కాసేపు తిట్టుకుని  అలా ఉండటానికి అలవాటు పడిపోతాము .


కరెంట్ ఎప్పుడిస్తాడా అని ఎదురుచూస్తూ , ఏదోక కాలక్షేపం చేస్తూ  మధ్య మధ్య లో ఇలా కెమెరా కి పని కల్పిస్తుంటా !



పాపం గోరింక ! దాని కాళ్ళకున్న వెంట్రుకలు చూసారా ?అస్తమాను వాటిని నోటితో  లాక్కుంటూ ,కుంటుకుంటూ తిరుగుతుంటుంది .









 కాకి ఒకటి నీళ్ళకు కావు కావు మనుచు!
















మా  వీధికుక్కపిల్లలు .పిలిస్తే వచ్చేస్తాయి. సాయంత్రం కాసేపు  వాటితో కాలక్షేపం .

13 కామెంట్‌లు:

  1. very nice
    కాకి ఫోటో కెవ్వు భలేగా పోజిచ్చింది

    రిప్లయితొలగించండి
  2. So true!

    its not even 40/50 years that our villages got power lines, and we already started going back in time :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండి అలాగేఉంది పరిస్తితి చూస్తుంటే ..ధన్యవాదాలండి

      తొలగించండి
  3. మీ ఊరిలో ఉండటం ఎంత అదృష్టమో మీకు తెల్సిందేగా? చిన్నప్పుడు మా తాత గారి ఊర్లో ఇలాగే ఉండేది. అద్భుతం ఫోటోలన్నీ. ఎప్పుడూ మీ ఊరు విడిచి వెళ్ళకండి. ఒక్కసారి అన్నీ వదులుకుని మీ ఊరు వచ్చేద్దాం అనిపిస్తోందంటే నమ్మండి, అంత అద్భుతం గా ఉంది మీ ఊరు. కరెంట్ దేమి ఉంది. మన ఆంధ్రా లో అంతే గత నలభై ఏళ్ళుగా! మీరు చాలా అదృష్టవంతులు.

    చివరితోక: ఎవరైనా సిటీ లైఫ్ బావుంటుంది అని చెప్తే నమ్మకండి. అందులో ఆవగింజంత నిజం కూడా లేదు. మీకు ఒక్క పిచుక గానీ గోరింక కానీ కనిపించదు - ఎడతెగని వాహనాలూ, మనుషుల రొద తప్ప. పొరపాట్న ఎక్కడైనా ఒక పక్షి కనిపిస్తే మర్నాదు దాన్ని చంపేసి తినడానికి ఒక వెయ్య మంది సిద్ధంగా ఉంటారు.

    రిప్లయితొలగించండి
  4. కరెంట్ నే తలచుకుంటూ కూర్చోకుండా ఎంచక్కా కాకులతోటీ, బుజ్జి కుక్కపిల్లల తోటీ, సీతాకోక చిలుకలతోటి కాలక్షేపం చేస్తున్నారన్నమాట. బావుందండీ.

    రిప్లయితొలగించండి
  5. రాధిక గారు మీకూ, మీ కామెరా కు మంచి జతే కుదిరింది. ఫోటోలు తీయించుకునేవి కూడా భలే ఫోజులిస్తున్నాయి. కరెంటు పోతేనేం, మా కంటికి మాత్రం మంచి విందు చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి