ఇప్పుడిప్పుడే (నాలుగేళ్ల నుండి )మా వాళ్ళు సేంద్రీయ పద్దతిలో గోమయం తో , ఎటువంటి ఎరువులూ ,పురుగుమందులూ వాడకుండా వరి వ్యవసాయం చేయడం అలవాటు చేసుకుంటున్నారు.

మొదట్లో వర్మికంపోస్ట్ ట్రై చేసారు అది కుదరలేదు .సుభాష్ పాలేకర్ ఉపన్యాసాలు,పుస్తకాలు చూసి ఎలాగూ ఆవులు ఉన్నాయి కదా గోమయంతో చేద్దామనుకుని మొదలు పెట్టారు . ఆవు మూత్రం ,పేడ ,కొద్దిగా బెల్లం ,ఇసుక అన్నీ ఒక డ్రం లో కలిపి వారం రోజులు మురగ బెట్టి చేలో నీటితో పాటు వదిలేస్తున్నారట. కొత్తలో ఇలా చేయడం కాస్త కష్టంగా అనిపించింది కానీ ఇప్పుడు పరవాలేదు .
అలాగని మొత్తం వరి చేనంతా కాదు.మాకు తినడానికి సరిపడా చేస్తున్నారు.మిగిలింది మాములుగానే .అంతా అలానే చేయొచ్చుగా అంటే , ఈ పద్దతికి బాగా అలవాటుపడ్డాక మొత్తం సంగతి చూద్దాం అంటారు.
సేంద్రియ పద్దితిలో పండించినా ,ఎన్నో ఏళ్ల నుండి ఎరువులు వాడటం వలన వాటితాలుకు ప్రభావం మెదటి రెండేళ్ళు వచ్చిన ధాన్యంపై ఉంటుంది . తరువాతనుండి ఎటువంటి రసాయనాలు తగలకుండా స్వచ్చంగా పొందుతున్నాం ..

పై పొట్టు మాత్రమే ఒలిపించిన ముడిబియ్యం
ఇప్పుడు చాలా మంది ఆరోగ్యానికి మంచిదని ముడిబియ్యాన్ని వాడుతున్నారు.
అసలు మా అందరికీ ముడిబియ్యాన్ని అలవాటు చేసింది మా మావయ్య (అమ్మ తమ్ముడు ) .తను ముందు మొదలు పెట్టాడు.బియ్యం మిల్లుకు వెళ్లి ఎలా ఆడాలో దగ్గరుండి వాళ్లకు వివరంగా చెప్పి చేయించుకున్నాడు.మిల్లులో మొదట వడ్లు వేయగానే పైపొర మాత్రమే పోతుందట .అప్పుడే ఆపేస్తే ఇలా అచ్చంగా ముడి బియ్యం వస్తుంది.
మామూలు బియ్యాన్ని చూసిన కళ్ళతో ముడిబియ్యాన్ని చూస్తే ముతక బియ్యం లా అనిపిస్తుంది. ఈ బియ్యంతో అన్నం వండటానికి (తినటానికి)తలక్రిందులు పడేవాళ్ళము కొత్తల్లో .. . తెల్ల బియ్యం కన్నా ఎక్కువ నీళ్ళు పడతాయి .ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది.మామూలు కుక్కర్ల కన్నా కరెంట్ రైస్ కుక్కర్లు బాగుంటాయి ముడిబియ్యం వండటానికి.
ఈ అన్నం తినడానికి పెద్దవాళ్ళం తొందరగానే అలవాటు పడ్డాము కానీ మా సాయి మాత్రం మంచి కూరలు వండినప్పుడు కూడా ఈ అన్నమేనా అని సణుక్కుంటూ తింటాడు .(మంచి కూరలంటే తెలుసుగా :) )వాడు హాస్టల్ నుండి వచ్చినప్పుడు వాడికి మాత్రమే ఎప్పుడన్నా తెల్లన్నం వండుతాము .ఎప్పుడూ ముడిబియ్యమే వాడతాము.దీనికి అలవాటు పడ్డాక తెల్లన్నం రుచీ పచీ లేనట్టు అనిపిస్తుంది.