అప్పుడే మాకు వడియాలు పెట్టుకోవడం ఐపోయింది.ఎప్పుడూ" స్లో అండ్ స్టడీ "టైప్ లో ఉళ్ళో అందరూ పెట్టుకోవడం ఐపోతుండగా అప్పుడు పెడదామనే అత్తయ్యకు, ఈ సారి వడియాలు తొందరగా పెట్టేసుకోవాలనే మూడ్ వచ్చేసింది.
వడియాలు పెట్టుకోవడమేనా?ఇంకా చాలా చాలా పనులతో ...ఈ నాలుగు నెలలూ మేము(మా ఉళ్ళో వాళ్ళు కూడా) బిజీ బిజీ గా ఉంటాము.
డిసెంబర్ నుండి సంక్రాంతి పండుగ అయ్యేవరకు పండుగ పనులతో సరిపోతుంది.
ఇక అక్కడి నుండి ఇంకా బిజీ ఐపోతామంతా...
సాదారణంగా పల్లెల్లో సంవత్సరానికి సరిపోయేలా పప్పులూ అవీ జాగర్త చేసుకుంటారు కదా! దానికి ఇదే సంమయం.
మా వైపు పెద్దగా అపరాలు పండించరు . ఇంటిఅవసరాలకు సరిపడా వేద్దా మన్నా, కొన్న వాటికన్నా పండిస్తే ఎక్కువ ఖర్చని చాలా మంది వాటిని పండించడానికి ఇష్ట పడరు.
మినుములూ,పెసలు,బొబ్బర్లు,కందులు కొని కూలి మనిషితో బాగు చేయించి , ఇసిరించి (తిరగలి లో పోసి తిప్పడం) వాటిని శుబ్రం చేసి నిల్వ చేసుకుంటాము..
పిబ్రవరి నెల వచ్చేటప్పటికి కాస్త ఎండ పెరుగుతుంది కదా! వడియాల హడావిడి మొదలవుతుంది . పిండి వడియాలు ,పెసరొడియాలు ,గుమ్మడి వడియాలు పెడతాము
వడియాలు ఎండలో ఉండి పెట్టాలి కదా ,మార్చొస్తే ఎండలు పెరుగుతాయని పిబ్రవరి నెల అయ్యేటప్పటికి వడియాల పెట్టడం పుర్తైపోతుంది.
సంవత్సరానికి సరిపడా చింతపండు ఈ రోజుల్లోనే జాగర్త చేసుకుంటాం . చింతకాయలుంటే కోయించి వాటి పెంకు,గింజ తీయడం పెద్దపని .ఒకవేళ కాయలు లేకపోతె ఉళ్ళోకి అమ్మొచ్చే చింతపండు కొని బాగుచేసుకోవడమే.
ఇక అక్కడి నుండి పచ్చళ్ళకు అవసరమైన సరుకుల సేకరింపు పనిలో పడతాము. కారం కోసం మిరప కాయలకు గాలింపు మొదలుపెడతాము. ఎక్కడ బాగున్నాయో కనుక్కుని ,వాటిని కొని కారం దంచడం పెద్దపని .మా అత్తయ్య లాంటి కొందరు ఇంకా చాదస్తంగా రోట్లోనే కొట్టిస్తున్నారు కాని, ఇప్పుడు చాలా మంది రోట్లో కొట్టించలేక కారం ఆడే మరకు పంపేస్తున్నారు .
మర్చిపోయా!నువ్వులు కొని వాటిని కడిగి నూనె ఆడించే పనొకటి ఉంది.అమ్మో! ఇదింకా పెద్ద పని .రోజంతా ఇద్దరి కి పని సరిపోతుంది.
పచ్చళ్ళకు సరుకులు రెడీగా ఉన్నాయి కదా!పైగా ఏప్రిల్ నెల వచ్చింది ...మామిడికాయలు వచ్చే రోజులు .ఇక పచ్చడి మామిడి కాయలకు ఉరుకులు పరుగులు...కాయలు తెప్పించి, పచ్చళ్ళు పెట్టి వాటిని జాడీ ల్లో బద్రపర్చడంతో ఈ పనుల హడావిడి కి బ్రేక పడుతుంది..
ఇలా ....డిసెంబర్ నెలాఖరు నుండి ఏప్రిల్ నెలాఖరు వరకూ ఇంచుమించుమేమే కాకుండా ,చాలాపల్లెల్లోనూ అంతా పనులతో బిజీ బిజీ గా ఉంటారేమో..
బావుందండీ మీ హడావుడి,
రిప్లయితొలగించండివడియాలు మా అమ్మ పంపిస్తుంది కానీ పప్పులు మాత్రం కొని ఎండపెట్టుకుని దాచుకోవాలి నేను.ఒక్కసారే కొనుక్కుంటే చేతి నిండా ఉన్నట్టు ఉంటాయి కదూ
నువ్వులనూనె కూడా అంటే,బాబోయ్ ఎందుకండీ అంత కష్టపడటం.
Very interesting.
రిప్లయితొలగించండిఇప్పటికింకా మీ వూరిలాంటి కొన్ని చోట్లైనా ఈ పనులు ఇంకా మిగిలి ఉన్నాయన్న మాట!
రాజి, సాయి, తిరగలి - so cute.
ఈరోజుల్లో కూడా ఇంత కష్ట పడేవారిని చూస్తూన్నాం ఎందుకండీ అంత రిస్క్
రిప్లయితొలగించండితీసుకుంటున్నారు బాగానేవుంది మీ హడావుడి
అజ్జిబాబోయ్, నువ్వుల నూనె కూడానా!కలా నిజమా...ఇంకా ఇవన్నీ చేస్తారా? మీ ఊరికి ఇన్వయిట్ చెయ్యకూడదూ...ప్లీస్...
రిప్లయితొలగించండిపిల్లలిద్దరూ....భలే ముద్దుగా....దిస్టి తీయండి మరి...
చాలా బాగుంది. ఫ్రోజెన్ కూరగాయల ముక్కలు, సూపర్ మార్కెట్ లోంచి వస్తువులు మెకానికల్ గా తెచ్చుకుని ఆదరా బాదరా గా ఏది పడితే అది వండుకుంటూనో కొనుక్కునో తినే మేము ఈ నాణానికి మరో వైపు.. :-(
రిప్లయితొలగించండి@లత , పచ్చళ్ళ కినువ్వులనూనె వాడతామండి.వాటిలోకి కావాలికద..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికొత్తపాళీ గారు ,ధన్యవాదాలండి.
@సుమలత ,మాకు ఇలా చేసుకోవడం ఎప్పుడూ అలవాటు కావడం వలన పెద్ద రిస్కు అనిపించదండి .ఐనా కొన్ని రోజులు కష్టపడి చేసుకుంటే తరువాత పెద్దగా పని ఉండదుకదండి.
@ఎన్నెల,నువ్వులనూనె రొజూ వాడము.పచ్చళ్ళకి,స్పెషల్ వంటలకి మాత్రమేనండి. .ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ,ధన్యవాదాలు.
నా చిన్నప్పుడు సిటీలో కూడా ఈ పనులన్నీ చేసాము. ఐదేళ్ల క్రిందవరకు కూడా నేను ఏడాది సరుకులు శుభ్రం చేసుకోవడం. ఎండాకాలంలో వడియాలు, అప్పడాలు పెట్టుకోవడం, ఊరినుంఢి వచ్చే చింతపండు శుభ్రం చేసి ఎండబెట్టి డబ్బాలో గాలి చొరకుండా పెట్టుకోవడం.. అన్నీ చేసాను. ఏంటో..ఇప్పుడు ఓపిక, శక్తి తగ్గిపోయి ఆవకాయ తప్ప అన్నీ నెలనెలా కొనుక్కోవడం..
రిప్లయితొలగించండిఅబ్బా, ఈ కబుర్లు వింటేనే కడుపునిండి పోతోంది. చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరికెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తోంది.
రిప్లయితొలగించండిమీ ఇంటి ముందు కారు పెట్టుకొని, ఇంట్లో ఇంకా తిరగలి, రోకలి ఉపయోగిస్తున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది.:):) నాల్గురోజుల క్రితం ఏలూరు దగ్గర ఒక పల్లెటూళ్ళో ఉన్నాను. సాయంకాలం వాకింగ్ కి వెళ్లినప్పుడు, ఇక్కడ పిండి ఆడబడును, మర పట్టించబడును అన్న బోర్డులు చూశాను. జనం బాగానే ఉన్నారు ఆ షాపుల్లో.
రిప్లయితొలగించండినువ్వుల నూనె, తెలక పిండి వాడకం మానేశాము మేము. ఆవకాయ కొనుక్కోవడమే. ఎప్పుడో మీ ఇంటికి దొంగతనానికి వచ్చేస్తాను ఆవకాయకి, వడియాలికీ. ఫోటోలు పెట్టి ఊరించేస్తున్నారు మరి.
@జ్యోతి,జయ ,ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి@బులుసు సుబ్రహ్మణ్యం,మా ఉళ్ళో కూడా పిండిమర ఉందండి.అప్పుడప్పుడు అక్కడ ఆడిస్తుంటాం.అప్పుడప్పుడు రోట్లో కొట్టిస్తాము.ధన్యవాదాలండి.
రాధిక గారు మీ టపా చదువుతుంటే మా ఇంట్లో సందడి కళ్లముందు కనపడిందండి. మా అమ్మ వాళ్లు కూడా ఈ మూడు నాలుగు నెలలు ఈ పనులతో బిజీ! కారాలు..పచ్చళ్లు..అప్పడాలు, అప్పడపు పూత, వడియాలు..ఒకటే పని. ప్రస్తుతానికి మాకూ రోట్లో పిండి..తిరగలిలో పప్పులే..మరి ముందు ముందు ఎలా ఉంటుందో!
రిప్లయితొలగించండిమీ టపాలు చదువుతుంటే నాకు మా ఊర్లో ఉన్నట్టే ఉంటుంది.
అందరు చెప్పినట్లు ఈ రోజుల్లోకూడా మీరు అంత కష్టపడి అన్ని తయారు చేసుకుంటున్నారు . అంత కష్టపడి చింతకాయలూ తెచ్చి మరి చింతపండు తయారు చేసుకుంటున్నారంటే గ్రేట్ . అమ్మ వాళింట్లో చేసేవారు ,ఇప్పుడు అంత ఓపిక లేక చెయ్యట్లేదు .కానీ తిరగలు,రుబ్బురోలు, రోకళ్ళు లాంటివి ఇంకా ఉన్నాయి .ఎప్పుడయినా పండగలకి ఉపయోగిస్తుంది .సున్నుండలు పిండి తిరగలు లో విసిరితే ,గారెలకి గ్రైండర్ కాకుండా రోటిలో లో రుబ్బితేనే రుచిగా ఉంటాయి అంటుంది .అది అక్షరాల నిజం ,చాల బాగుంటాయి .
రిప్లయితొలగించండిమీ ఊరు చాల బాగుంది ,కానీ పేరు బాగోలేదు .గాంధీ నగరం అంటే ప్రతి సిటీలో ఉంటుంది,ఇంకేదయినా పేరయితే బాగుంటుంది. మీ ఊరు ప.గో .జిల్లలో ఏమండలం, ఎక్కడ ఉంటుంది .
ధన్యవాదాలు సిరిసిరిమువ్వగారు
రిప్లయితొలగించండిanagha గారు,నాబ్లాగ్లో మీ మొదటి కామెంట్:).మా ఊరు గాంధీనగరం దేవరపల్లి మండలంలోనండి.మా ఊరు స్వాతంత్ర సంగ్రామం జరిగే రోజులలో ఏర్పడిందంట.అందుకే గాంధీనగరం అనిపెట్టారటండి.
www.telugupustakalu.com
రిప్లయితొలగించండిరాధికగారూ మాదీ పల్లెతూరేనండి .కాని మేము పెసలు,మినుములు ,కందులు లాంటి అపరాలు కొనుక్కొని పప్పులు చేసుకున్దామన్నా బాగుచేయడానికి,విసరడానికి కాదుకదా కనీసం ఊరిలో మినుములు మిల్లులో పప్పు చేస్తే వాటిని చేరగడానికి కూడా మనుషులు దొరకరండి .అందుకని మా మా అమ్మమ్మలు [అంటే మా అత్తగార్లె లెండి]పప్పులు కొనుక్కోవదానికే ప్రాదాన్యం ఇస్తున్నారండి .ఎక్కడైనా మీ ఊరి లాంటి ఊళ్లలో అలా చేయించుకోడానికి మనుషులు దొరకడం మీ లక్ .మీరు అప్పుడే వడియాలు పెట్టేసుకున్నారా ,మేం కూడా వడియాలు పెట్టుకోవాలన్దిబాబూ ;ఇప్పుడే భయం వేస్తుంది ఆ వడియాలు పెట్ట్టే దృశ్యం గుర్తువస్తే .చెప్పానుకదండి పప్పులగురించి .దీనికి కూడా అదే మనుష్ల ఇబ్బంది .మాది కొంచం పెద్ద ప్రాజేక్టండి .ఎందుకనంటే మాది ఉమ్మడి కుటుంబం .ఐనా వడియాలు పెట్టుకోవడానికి కొంచం కష్టమనిపించినా మేమే పెట్టేసుకున్తాంలెండి .మల్లి కలుస్తానండి తరువాత పొస్టులో.మరి మేము కూడా వడియాలు పెట్టుకోడానికి సిద్దమవుతాం
రిప్లయితొలగించండిరాధిక గారు మీ టపా చదువుతుంటే మా ఇంట్లో సందడి కళ్లముందు కనపడిందండి. నా బాల్యం గుర్తోస్తుందండి. ఎంత చక్కటి వర్ణన ..మంచి ఫోటోలు కూడా తీసారు. ఎప్పుడు పల్లెకు వెళ్దామా అనిపిస్తుంది.
రిప్లయితొలగించండికళాసాగర్
మంచిలి
పశ్చిమగోదావరిజిల్లా
mee Tapalu anni eroju chaduvutunna,mee TAPA chala bavunnadandi.But chinna comment matram undakapothe inka bavundehi....(Maa Attaya Lanti chadastapu....Koncham kastamina Rotilo kodithe Bavuntadandi))
రిప్లయితొలగించండిధన్యవాదాలు నవీన్ గారు.
రిప్లయితొలగించండిరోట్లో కారం కొట్టించడానికి పనివాళ్ళుకి కుదరనప్పుడు అది కాస్త చాదస్తం అనిపిస్తుంది కానీ కొట్టేవాల్లుంటే పిండైనా ,కారమైనా రోట్లోనే బాగుంటుంది .