=''/>

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

పున్నమి చంద్రుని అందాలు

పౌర్ణమిరోజు చందమామని చూస్తుంటే .... ఎంత సేపైనా అలా చూస్తూనే ఉండి పోవాలనిపిస్తుంది.

ఓ " పౌర్ణమి "రోజు వెండి వెలుగుల్ని విరజిమ్ముతూ మన "అందాలమామ! చందమామ",మా దొడ్లో ద్రాక్ష పాదు ఆకుల్లోనుండి నుండి తొంగి తొంగి చూస్తూ నన్ను పలకరిస్తుంటే....

చిన్నప్పుడు వెన్నెల్లో చంటి (చెల్లి),నేనూ ,కజిన్స్ మేమంతా కలసి , అమ్మ వచ్చి నిద్రపోండి అని పిలిచే వరకు ఎన్నెన్నో ఆటలు ఆడుతూనే ఉండేవాళ్ళము. అవన్నీకాసేపు రింగులు తిరిగాయి . వెన్నెల్లో కూర్చుని కాసేపు సరదాగా ఐనా గడపట్లేదని నిట్టూర్చి మా దొడ్లో కొచ్చిన చందమామని ఇలా బందీచేసేసే. ...
.



తొంగి తొంగి చుడమాకు చందమామా....














11 కామెంట్‌లు:

  1. అబ్బా ....ప్రాణం లెగిసి వచ్చిందండీ...

    రిప్లయితొలగించండి
  2. కెవ్వ్.. మీ ఇంట్లొ ద్రాక్ష తొట ఉందా...అది గుత్తులుగా కాసి మరీ... నేను మనవైపు ద్రాక్ష పెరగవు అనుకుంటున్నా....బావున్నాయి

    రిప్లయితొలగించండి
  3. మీ ద్రాక్షపాదు(గుత్తి) బాగుంది
    సిటీల్లో మాకెటూ నిట్టూర్పులు తప్పడం లేదు.ఛాన్స్ ఉండి(తోటా,వెన్నెలా) మీరు కూడా. ప్చ్

    రిప్లయితొలగించండి
  4. పున్నమి చంద్రుడిని తీగల చాటు నించీ, కొమ్మల మీదనించీ, గుత్తుల పక్కనించీ భలే బంధించారండి! ఫోటోలు చాలా బావున్నాయి :-)

    రిప్లయితొలగించండి
  5. చందమామ , ద్రాక్ష తీగ చాలా బాగున్నాయి . ఒకప్పుడు పెరడు లోనూ ద్రాక్ష వుండేది . పిల్ల లు పండనిచ్చేవారు కాదు , పచ్చివే గుత్తులు తెంపి తినేసేవారు .

    రిప్లయితొలగించండి
  6. మేడం గారూ! అందాల చందమామ మేనకోడలి ఇంట్లో ఇంత అందంగా వెల్లి విరుస్తాడని ఊహించ లేదు సుమండీ?పైగా ద్రాక్ష తోట గుండా,గూండాలా తొంగి తొంగి మరీ చూస్తున్నాడు.కాదు మరీ! చాలా చాలా అందంగా ఉన్నాయండీ! మీ శ్రమకు నా జోహార్లు.చూసినందుకు కాదండీ బాబూ!చందా మామమయ్యని పుటోబులు తీసినందుకు! హాట్స్ ఆఫ్!

    రిప్లయితొలగించండి
  7. వావ్! అదరగొట్టేసారు రాధికగారూ!! మీకేంటండీ తీరిక చుసుకోవాలేకానీ చల్లని గాలి...పుచ్చపువ్వులా వెన్నెలా.....ద్రాక్ష తోట...ఆహా! నేనే అక్కడుంటేనా....అలా చూస్తూ ఆరుబైటే ఉండిపోనూ! ఇంతకీ మా శ్రీ గంధం మొక్కగారు ఎలా ఉన్నారు? అలాగే దాల్చిన చెక్కగారిని అడిగానని చెప్పండీ :)

    రిప్లయితొలగించండి
  8. @ప్రవీణ,కృష్ణప్రియ ,ధన్యవాదాలు.
    @మంచు ,ద్రాక్ష తోట కాదండి ?ద్రాక్ష పాదండి.మన కడియం నర్సరీ నుండే తెచ్చాము.ధన్యవాదాలు.
    @లత ,అవునండి! చన్సుండి నేనూఅంతే... ప్చ్ ప్చ్ ప్చ్ :))ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @నిషిగంధ,ధన్యవాదాలు.
    @మాలాకుమార్,ధన్యవాదాలు.
    @సోమార్క,నాబ్లాగ్ లో మీ మొదటి కామెంట్! నాపుటోబులు నచ్చినందుకు ధన్యవాదాలండి .
    @ఇందు , అలాగే శ్రీ గంధం మొక్కగారిని ,దాల్చిన చెక్కగారినిఆడినట్లు చెబుతా :)).ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. నిండుపున్నమి చందమామ, ఎక్కడ చూసినా ఆ అందమే అందం. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. ఫుటొవుల్లో చంద్రుడు బాగున్నాడు. పున్నమి చంద్రుడిని చూస్తే నాకు ‘రావోయి చందమామ’ పాట గుర్తుకొస్తుంది. ఆ తరవాత ‘చల్లని రాజా ఓ చందమామ’ ‘ఓ చందమామ అందాల భామ’ నల్లని మబ్బులు కమ్మెసినప్పుడు ‘చందమామ ఎక్కడున్నావు’ అని కూడా పాడుకుంటాను. అంటే నేను పాడుకుంటున్నాను అనుకుంటాను కానీ వినేవాళ్లు మరోలా అనుకుంటారు. తెలుగు సినిమాల్లో ఇంకా బోల్డు చందమామ పాటలు ఉన్నాయి. మీకేమైనా గుర్తు ఉన్నాయా?

    రిప్లయితొలగించండి