=''/>

23, ఫిబ్రవరి 2011, బుధవారం

అప్పుడే...పవర్ కట్ కట్!

మాకు సంవత్సరం లో ఆరు నెలలే రోజంతా కరెంట్ ఉంటుంది.మిగిలిన ఆరునెలలూ పగలు ఒంటి పూట కరెంటే.

ఈ ఏడు వర్షాలు బాగా పడ్డాయి కదా! ఇంచుమించు జులై నుండి ఫుల్ కరెంటు ఉంది.


ఎండలు బాగా పెరిగేక ఏప్రియల్ నుండి పవర్ కట్ ఉంటుంది అనుకున్నాము కానీ, అప్పుడే కరెంట్ తీయడం మెదలేట్టేసారు.


రోజంతా కరెంట్ కి బాగా అలవాటు పడిపోయామేమో ఇంకా ఒంటిపూట కరెంట్ కి అలవాటుపడలేదు.


ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు వరకూ ఒక షిఫ్ట్ .పదకొండు నుండి సాయంత్రం ఆరు వరకూ ఒక షిఫ్ట్ .ఒక వారం ఉదయం షిఫ్ట్ ,ఒకవారం మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది.ఉదయం కరెంటు ,మద్యాహ్నం కరెంట్ అంటాము.


ఉదయం షిఫ్ట్ వస్తే ,కరెంట్ సహాయంతో చేసే ఏపనైనా ఆ టైం లోనే చేసేయాలి. లేకపోతె అంతే! సాయంత్రం వరకూ కరెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. టివికి,సిస్టం కి సాయంత్రం వరకూ రెస్టే.. పిల్లలు సెలవల్లో ఇంటి వద్దఉంటే(ముఖ్యంగా ప్రియ)ఆరు ఎప్పుడవుతుందా అనుకుంటూ ....మధ్యలో కరెంట్ కట్ చేస్తున్న వాడిని తిట్టుకుంటూ ఉంటారు.


మద్యాహ్నం షిఫ్ట్ ఐతే ఒక రకంగా ఉంటుంది .ఉదయం టిఫిన్ కి చెట్నీ ముందు రోజు సాయంత్రమే చేసేసుకోవాలి. పచ్చళ్ళు ఏవి చేయాలన్నా పదకొండింటికి కరెంట్ వచ్చేక చేయాల్సిందే . ఒక్కోసారి పొలంలో పనులు ఎక్కువగా ఉంటే కారియర్ తీసుకెళతారు.అటువంటప్పుడు మద్యాహ్నం కరెంట్ ఐతే ఆ వారం లో పచ్చళ్ళు ఏవీ చేయడం కుదరదు.పండగలొస్తే పిండి వంటలు చేయడానికి ఇంకా ఇబ్బంది. గ్రైండర్ లో పప్పు ముందు రోజన్నాలేకపోతే ఉదయం ఆరు లోపు అన్నా రుబ్బుకోవాలి.మా ప్రియ హాస్టల్ నుండి ఇంటికొచ్చినప్పుడు మధ్యాహ్న కరెంట్ ఐతే తనకి పండగే ! టివీ,సిస్టం రెండింటికీ రెస్టుండదు....


అసలే వరల్డ్ కప్ క్రికెట్ మన దేశంలో జరుగుతుంది. నాకూ క్రికెట్ అంటే కాసింత ఇష్టమే.వరల్డ్ కప్ క్రికెట్ లో మన వాళ్ళు ఆడే మాచ్లన్నీ మాకు మద్యాహ్న కరెంట్ ఉండగా జరిగితే బాగుండును.....


మా కరెంట్ కట కట కట్టాల వలన ఇటువంటివి చాలా మిస్సవుతూ ఉంటాము:((...

19 కామెంట్‌లు:

  1. మీరో చిన్న ఇన్వర్టర్ కొనుక్కొవాలండీ... మిక్సీలకి అదీ కుదరకపొయినా కనీసం ఫ్యాన్స్ , లైట్లకి

    రిప్లయితొలగించండి
  2. యేటా ఇదే పరిస్థితి.ఈ కరెంటు కష్టాలు ఎప్పుడు తీరతాయో

    రిప్లయితొలగించండి
  3. మంచు గారు,ఇన్వర్టర్ ఉందండి.అమ్మో !అదికూడా లేకపోతే ఇంకేమైనా ఉందా? అది ఉండబట్టే ఒంటిపూట కరెంట్ అయినా ఉండగలుగుతున్నాము:)ధన్యవాదాలు.
    @లత ,మీకింకా పరవాలేదండి..మాకు మే లో ఐతే రోజులో పగలు నాలుగు గంటలేకరెంట్ ఉంటుంది.ఒక వైపు ఎండలు ,కరెంట్ కోతలు వేసవికాలంభరించడం చాలా కష్టమండిబాబు ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. అవునండి మాకు మహా అయితే ఒక రెండు మూడుగంటలు ఉంటుంది పవర్ కట్
    పల్లెల్లోనే మరీ దారుణం

    రిప్లయితొలగించండి
  5. మా పల్లెల్లో ఎప్పుడూ పగలు ఒంటి పూట కరెంటే.

    రిప్లయితొలగించండి
  6. అవును ఎండాకాలంలో ఈ కరెంటు కట్టులతో ఊరు వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది..కానీ వెళతాం. మా పిల్లలు ఇక్కడ ఓ రెండు నిమిషాలు కరెంటు పోయినా లబలబలాడిపోతారు..అదే ఊర్లో మాత్రం కరెంటు ఉన్నా లేకపోయినా ఆ విషయమే పట్టనంతగా ఎంజాయ్ చేస్తారు ఆటలతో.

    రిప్లయితొలగించండి
  7. హ్మ్.. నిజమే.. మా ఊళ్ళో నూ అలాగే ఉంటుంది... On the other hand, బెంగుళూరు లో ఈ మధ్య.. కరెంట్ పోగానే inverter తో పని సాగుతూ ఉండటం తో మాకు అది కూడా పాడయిన రోజున పండగ లా ఉంటోంది.. టీవీ, ఇంటర్నెట్, లైట్లు, ఫాన్లు లేకపోతే కాసేపు బయట రోడ్డు మీద కూర్చుంటే అదే హాయిగా అనిపిస్తోంది. :)

    రిప్లయితొలగించండి
  8. హాయిగా సోలార్ పవర్ ప్యానెల్స్ పెట్టిన్చేసుకోండి (అఫ్కోర్స్ కుసింత ఖర్చే కానీ కరెంటు బిల్లు ఆదా, కరెంటు వాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం కంటే ఇది బెటరేనేమో)

    రిప్లయితొలగించండి
  9. క్రిష్ణప్రియ గారు చెప్పినటువంటి చక్కటి కుటుంబ సమయం కోసం నేను ఇక్కడ పవర్ కట్ కోసం చకోరంలా ఎదురుచూస్తుంటాను. సగటున ఏడాదికి ఒక్కసారి గట్టి తుఫాన్లు వచ్చినప్పుడు ఆ ఆదృష్టం మాకు లభిస్తుంది/లాభిస్తుంది.

    రిప్లయితొలగించండి
  10. ఓహ్ వావ్..ఇంటర్నెట్ లేని సమయం/స్థలం అనుభవం లోకి తెచ్చుకోవచ్చన్నమాట. దీని కోసమయినా నేను పల్లెల్లోకొచ్చేస్తా ఎప్పుడో ఒకప్పుడు :-). సీరియస్లీ :-)

    రిప్లయితొలగించండి
  11. ఏలూరు దగ్గర ఒక పల్లెటూరుకి మకాం మార్చేస్తున్నాను ఏప్రిల్ లో. మీరు కరెంటు కట్ అంటూ భయ పెట్టేస్తున్నారు. 4-5 గంటలు అంటే భరించవచ్చు. అంతకన్నా ఎక్కువైతే కష్టమే. మా ఊరు మా గాలి అని పాడుకోవడం కూడా కష్టమైపోతుందా?:):)

    రిప్లయితొలగించండి
  12. రాధికగారు...ఎన్ని కష్టాలు మీకు?? నాకు కరెంటు పోతే భలే ఇష్టం :) మా వీధిలో పిల్లలందరు పొలోమంటూ ఆడుకోడానికి వచ్చేస్తారు :) చిన్నప్పుడు నేను తెగ ఆడేదాన్నిలే! కానీ ఇప్పటికి నాకు కరెంట్ పోయిన సాయంత్రాలు చాలా ఇష్టం.ఎంచక్క మా అమ్మతో డాబా మీద టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు! కరెంటు తొందరగా వచ్చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది.కాని ఇది సాయంత్రాలు ఐతే పర్లెదు.రాత్రుళ్ళు తీసేస్తే బాబోయ్ అస్సలు ఉండలేము! ఇక వేసవి మధ్యహ్నాలు....కరెంటు కోత...అదొక నరకం :( హ్మ్!

    రిప్లయితొలగించండి
  13. చిలమకూరు విజయమోహన్ గారుమీ వైపుపల్లెల్లో ఎప్పుడూ ఒంటిపూట కరెంటేనా?ఐతే మీకన్నా మేము కాస్త పరవాలేదనమాట! ..ధన్యవాదాలు..
    @సిరిసిరిమువ్వ ,మా చెల్లి పిల్లలూ అంతేనండి. మా ఊరువచ్చేక ఒకటి రెండు రోజులు కరెంట్ కొతలుతో కాస్త కొత్తగా ఉన్నా తారువాత వాళ్ళే ఆటల్లో పడి మర్చిపోతారు...ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ,అవునండి అది ఓ మంచి అనుబవమేనండి.నిరుడు వేసవికాలం గాలి తుఫాను వచ్చి నాలుగు రోజులు కరెంట్ లేకపోతె పిల్లలందరూ ఆరుబయిట మంచాలు వేసుకుని చల్ల గాలిలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయేవారు ...రోజు ఎసి ,టివి,ఇంటర్నెట్ లేనిదే గడపని వాళ్ళు ఆ రెండు రోజులు కొత్త అనుబవాన్ని పొందారు .

    రిప్లయితొలగించండి
  14. @SHANKAR.S ,ధన్యవాదాలు.
    @శరత్ 'కాలమ్',హహ్హహ్హ మీరు కరెంట్ పోవాలని ఎదురుచూస్తారు .మేము రావాలని ఎదురుచుస్తాము.ధన్యవాదాలు.
    @మాలా కుమార్,అవునండీ అప్పుడే కరెంట్ కోతలు మొదలైపోయాయి.ధన్యవాదాలు.
    KumarNగారుసీరియస్లీ వచ్చేయండి పల్లెల్లోకి :))..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. బులుసు సుబ్రహ్మణ్యంగారు ఏలూరు దగ్గర ఏ ఊరు అది ?మరి పల్లెటూరు లో ఉండాలంటే కరెంట్ కోతలకి సిద్దమయ్యే రావాలండ:)). .ధన్యవాదాలు.
    @ఇందు,అప్పుడప్పుడూ కరెంట్ పొతే మీరన్నట్టు చేయొచ్చు మరి రోజు ఉండదు కదా!అందుకే ఈ పాట్లు..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  16. రాధిక గారు..అల్లక్కడ ఒడియాల పోస్టు తరవాత, చందమామ తొంగి చూడ్డం దగ్గర నుండీ...ఇల్లిక్కడ పవర్ కట్టు వొరకూ అన్నీ సదివీసినానండీ...సానా బాగున్నాయండీ...ఆయ్..

    రిప్లయితొలగించండి
  17. ఎన్నెలగారు అన్ని సదివేసి నచ్చేసినాయన్నందుకు సానా థాంక్స్ అండి.

    రిప్లయితొలగించండి
  18. పల్లెలో కరెంటు కోత గురించి ఎంత చెప్పిన తక్కువే ...
    ఎందుకంటె మా వూరిలో కూడ అంతే మరి....

    రిప్లయితొలగించండి