ఈ రోజు రథసప్తమి.
లోకసాక్షి ఐన ఆసూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే మాఘ సుద్ధ సప్తమి .అదే ఆయన జన్మతిధి ..రధసప్తమి .
సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .
నాచిన్నప్పుడు మా జేజమ్మ రథసప్తమినాడు ,తను తెల్లవారుజామున లేచి తలస్నానం చెసి మమ్మల్ని కూడా లేపి స్నానాలు చేయమని, కూర్చో బెట్టి పూజ చేయించి మాతో చిక్కుడాకులు అవీ కోయించి ,ఆవుపిడకల పై పొంగలి వండి అందరికీ ప్రసాదాలు పెట్టేది .ఇప్పటికీ రథసప్తమి అంటే అదే జ్ఞాపకమొస్తుంది .

రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు తులసికోట వద్ద
సూర్యునికి ఎదురుగా ముగ్గు వేసి ,ఆవుపిడకలపై ఆవుపాలతో పరవాన్నం చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పరవాన్నముంచి ఆయనకు నివేదన ఇవ్వాలి .
నాచిన్నప్పుడు మా జేజమ్మ రథసప్తమినాడు ,తను తెల్లవారుజామున లేచి తలస్నానం చెసి మమ్మల్ని కూడా లేపి స్నానాలు చేయమని, కూర్చో బెట్టి పూజ చేయించి మాతో చిక్కుడాకులు అవీ కోయించి ,ఆవుపిడకల పై పొంగలి వండి అందరికీ ప్రసాదాలు పెట్టేది .ఇప్పటికీ రథసప్తమి అంటే అదే జ్ఞాపకమొస్తుంది .
4 వ్యాఖ్యలు:
రాధిక గారు..రథసప్తమి పొ౦గలి రుచే వేరు కదా..ఇత్తడి గిన్నెలో గరిటెకి బదులు చెరకు తో కలియతిప్పుతూ చేస్తారు..
మేమైతే జల్లెడలో జిల్లేడు ఆకు, రేగుప౦డు పెట్టి పైను౦డి నీళ్ళు పోస్తూ..తలస్నాన౦ ముగి౦చేవార౦...
టపా బావు౦ది..జ్ఞాపక౦ ఇ౦కా బావు౦ది..
ఆ సూర్యభగవానుడు ఆయురారోగ్యాలను ప్రసాది౦చాలని కోరుకు౦టూ...
శ్రీ.వి.అది పొంగలి కాదు క్షీరాన్నమని (పరవాన్నం) గుర్తు కాకపోతే అవుపాలతోనే చేస్తారు.
శ్రీ.వి గారు,దన్యవాదాలండి.
మానససంచర గారు,మా జేజమ్మపొంగలి వండేక పరవన్నముకూడా చేసేదండి. ఆవుపాలతోనే చేస్తారు.మాఘమాసం అంటే తులసి కోట , పిడకలమీద పొంగించిన పాల పాయసము చిక్కుడాకులలో తినటము అన్నీ జ్ఞాపకాలే . ఇప్పుడు పిడకలు దొరకక , దొరికినా పొంగిచే స్తలము లేక , అంతా గాస్ స్టవ్ మీదే .
బాలభానుని బంగారు కిరణాలు మంగళతోరణాలు
రిప్లయితొలగించండిప్రక్రుతికి అలంకరణాలు
విశ్వసుందరికి ఆభరణాలు
సకల కల్మష హరణాలు