=''/>

2, సెప్టెంబర్ 2013, సోమవారం

ఈ రోజు ఉదయం కురిసిన వానలో తడిసి ముద్దైన మా ఇంటి మందారాలు


ఈ రోజు ఉదయం లేచేటప్పటికే ,ఆకాశమంతా నల్లటి  మేఘాలతో నిండి ఎప్పుడెప్పుడు వర్షించేదా ?అన్నట్టుంది . పొద్దు పొద్దున్నే అలా ఉంటే చాలా బద్దకంగా మళ్ళీ  దుప్పటి  ముసుగెట్టేయాలనిపించింది..




కానీ తప్పదుగా!ఎలాగో బద్దకాన్ని వదిలించుకుని పనిలో పడ్డా ...  మధ్య మధ్యలో ఆ మబ్బుల్ని ,దబదబా పడే వర్షాన్ని చూస్తూ  ,కెమేరాతో పట్టేస్తూ ఎలాగో పని కానిచ్చేసా!









 నాపని ముగిసే సమయానికి వాన వెలియడం తో  ..  చినుకుల ఆబరణాలు ధరించి మిలమిలా మెరిసిపోతున్నమందారపూల  సోయగాలని  బంధించి మీముందుకు తెచ్చేసా!




































42 కామెంట్‌లు:

  1. అద్భుతం.ఈ ప్రకృతి మీ కళ్ళతో చూస్తే మరీ బాగుంటుందండీ.

    రిప్లయితొలగించండి
  2. :-) lucky you! its a gift to be able to see rain in such places around.
    and beautiful camera work!

    రిప్లయితొలగించండి
  3. మీరు హడావిడి పడుతుంటే ప్రకృతి ఏమీ పట్టనట్టు నింపాదిగా తానాలాడుతోంది. బావున్నాయి ఫోటోలు రాధిక గారు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుంది మీ ఫోటోగ్రఫీ,ఇంకా మీ తోట కూడానూ. మీరు వానఫోటోల స్పెషలిస్ట్ అండీ!

    రిప్లయితొలగించండి
  5. wow.. ఇప్పుడే నేను కూడా ​వర్షంలో తడిసినట్టుందండీ మీ ఫోటోలు చూశాక.. :-)​

    రిప్లయితొలగించండి
  6. వానలూ, వానలో తడిచిన వనాలూ....బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. ప్లేస్ అంటే మా ఊరా ? మా ఊరైతే ప.గో.జిల్లా రాజమండ్రి కి ఏలూరుకి మధ్యలో ..ధన్యవాదాలు

      తొలగించండి

  8. ఎన్ని రంగులున్నా ఎర్రమందారం ముగ్ధత్వమే వేరండీ! నాకు ఆ ఫోటోలు బాగా నచ్చాయి.
    చాలా బావున్నాయి మీ చినుకులన్నీ! :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి వాటిని రోజూ చూస్తున్నా కొత్తగా ,అందంగా కనిపిస్తూ ఉంటాయి ...నాచినుకుల్ని మెచ్చినందుకు ధన్యవాదాలు :)

      తొలగించండి

  9. మీరేమో మందార పువ్వులు ఎంత అందంగా ఉంటాయో చెప్పారు (నిజంగా చాలా అందమైన పువ్వులు). అటువంటి అందమైన వాటితో పచ్చడి చేసి చూపించిందొక వనితామణి ఈటీవి వారి "అభిరుచి" వంటల కార్యక్రమంలో. వెరైటీ వంటకం అనుకోవాలేమో !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను మొన్న యాడ్ చూసి అమ్మో!మందారపువ్వుతో పచ్చడా?ఇదెక్కడి వంటకం? పాపం టేస్ట్ చూసే వాళ్ళేమవుతారో అనుకున్నా:) ..నిన్న చూడలేదు ..ధన్యవాదాలు

      తొలగించండి

    2. పాపం పాపయ్య శాస్త్రి గారు (పుష్ప విలాపం). పువ్వులు కోస్తేనే బాధ పడ్డారు. ఇక పచ్చడి చెయ్యటం చూస్తే !!!!!

      తొలగించండి
    3. అవునండి పువ్వులు ఏ పూజకో ,మాలలకో కోస్తాము .పచ్చడి చేయాలన్న పిచ్చి ఆలోచన ఎలా వచ్చిందో అనిపింది అది చూస్తే ..

      తొలగించండి
  10. --"కానీ తప్పదుగా!ఎలాగో బద్దకాన్ని వదిలించుకుని పనిలో పడ్డా ... మధ్య మధ్యలో ఆ మబ్బుల్ని ,దబదబా పడే వర్షాన్ని చూస్తూ ,కెమేరాతో పట్టేస్తూ ఎలాగో పని కానిచ్చేసా!"..

    పొద్దున్నే కానిచ్చేసిన ఆ పని .. పొద్దున్నే అందరూ చేసే పనేనా.. ఇంకా పల్లెటుర్లు ఎదగ లేదన్న మాట.. తలెత్తుకుని ప్రశ్నించమని కొత్త పెళ్ళికూతురికి విద్యా బాలన్ చెప్పే టి.వీ ప్రకటన చూడండి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరూ చేసే పనే కానీ పట్నాల్లో వాళ్ళ కన్నా పల్లెటూర్ల లో పనులు కాస్త వేరుగాను,ఎక్కువగాను ఉంటాయి కదండీ ..ఓలేటి గారు ఎదగడం అంటే మనం రోజూ చేసే పనులు కూడా మానేసి కుర్చోవడమా మీరే ఉద్దేశం తో అన్నారో తెలియలేదు .పట్నాల్లో వాళ్ళు బాగా ఎదిగిపోయి ఎలా ఉన్నారో మేమూ చూస్తున్నాము .మా పల్లెటూర్లూ దేనికీ తీసిపోవు .ఐనా పల్లెటూర్లు ఎంత ఎదిగాయో నా బ్లాగ్ ద్వారా మీకు కనిపిస్తుంది కదా!! ఏ ప్రకటనా చూసి నేర్చుకోవాల్సిన పని మాకు లేదు ...నా బ్లాగ్లో మీ మొదటికామెంట్ కి ధన్యవాదాలు

      తొలగించండి
  11. మీ ఫోటోలు మీ కళా దృష్టికి అద్దం పడుతున్నాయి. 6, 9 వ ఫోటోలు నన్ను బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా 9 వ ఫోటో చాలా బాగా నచ్చిందండీ. మీరు ఉపయోగించే కెమేరా వివరాలు తెలుసుకోగోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనేమీ అంత పెద్ద కెమేరా వాడనండి .నికాన్ కూల్ పిక్స్ s4300 ...కానీ ఫోటో తీసేటప్పుడు కాస్త ఆలస్యమైనా బాగా వచ్చేవరకు తీస్తాను ...థాంక్స్ అండి .

      తొలగించండి
  12. పల్లెటూళ్ళో ఉంటేనేమండీ?
    నగరవాసులు మీ జీవనం చూసి అసూయ పడాలి.

    రిప్లయితొలగించండి
  13. మందారాల అందం మాటల్లో చెప్పలేనిది కానీ ఆ మొదటపెట్టిన కొబ్బరి చెట్లు, వర్షం ఫోటోలు చూస్తుంటే ఆ ఫ్రేంలోపలికి అలా నడిచి వెళ్ళిపోయి ఆ ఆహ్లాదమైన ఉదయాన్ని మారనివ్వకుండా అలాగే ఫ్రీజ్ చేసేయాలనిపిస్తుందండీ.
    చాలా బాగున్నాయ్ ఫోటోలు.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. Meee Blog Chaala Baaga vundandi... nature andaalani bhale capture chesaaru...chaala baagundi andi.

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదాలు వినయ్ చక్రవర్తి గారు ..

    రిప్లయితొలగించండి