తేగలు వచ్చేసాయండి. సితాకాలము వస్తే మా ఏరియాలో బస్సులు ఆగేచోట,రోడ్లమీద తేగలు అమ్మేవారి సందడి ఎక్కువగా వుంటుంది .
పొలాలలోను, రోడ్లపక్కన తాటిచెట్లవద్ద తాటిటెంకలు అన్నీ సేకరించి వాటినిపాతర వేస్తారు .అంటే పెద్ద గొయ్యి తవ్వి దానిలోకప్పెడతారు .అవి సితాకాలము వచ్చేటప్పటికి మొలకెత్త డానికి తయారవుతాయి . వాటిని తీసి కుండలో పెట్టి కింద మంట పెట్టి కాలుస్తారు .

తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది .ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .
ఇదివరకు ఎవరిపొలాలలో వాళ్లు తాటిటెంకలను ఏరించి పాతరలు వేసేవారు .
ఇప్పుడు రైతులు కూడా కొనుక్కోవడానికి అలవాటుపడిపోయారు .
ఇదివరకు ఎవరిపొలాలలో వాళ్లు తాటిటెంకలను ఏరించి పాతరలు వేసేవారు .
ఇప్పుడు రైతులు కూడా కొనుక్కోవడానికి అలవాటుపడిపోయారు .
"తేగతెచ్చిన తంటా "టపా రాసినప్పుడు ఒక బ్లాగర్ తేగల ఫోటో పెట్టమని అడిగారు కాని అప్పుడు నేను పెట్టలేకపోయాను .మీ పోస్ట్ చూడగానే అదంతా గుర్తుకొచ్చింది .సిటీకి వచ్చాక తేగలు , కొబ్బరిబొండాలు , మామిడిపళ్ళు వంటివి కొనుక్కోక తప్పటం లేదు.
రిప్లయితొలగించండిhttp://anu-parimalam.blogspot.com/2009/01/blog-post_09.html
ఇలా ఏకంగా ఫొటోనే పెట్టి నూరూరిస్తే ఎలాగండి. ఇక్కడ ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా మా ఊరి వాటి రుచి రాదు.
రిప్లయితొలగించండిపరిమళగారు,సిటీలలోనే కాదండి మాపల్లెటూర్లలోకూడా చాలామంది అన్నీ కొనుక్కోవడానికి అలవాటు పడిపోయారు.
రిప్లయితొలగించండిఅవునండి సిరిసిరిమువ్వగారు కొన్నావాటికి రుచేమి ఉంటుంది .