=''/>

26, ఏప్రిల్ 2010, సోమవారం

ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్న చీర


ఇప్పుడు ఎక్కువగా చీరలపై పాచ్ వర్క్ చేస్తున్నారు . బెనారస్ ,కలంకారీ,జూట్ ఇలా ఏ రకమైన క్లాతనైనా తీసుకుని చీర అంచు కుట్టి,పువ్వులు అప్లిక్ వర్క్ చేస్తారు. దానినే పాచ్ వర్క్ అనికూడా అంటారు .


కలంకారీ క్లాత్ తో అంచు, పువ్వులు,బ్లౌజ్ పీస్ విడిగానే షాప్స్ లో సెట్స్ ఉంటున్నాయి .అవి తీసుకుని చీర పై పాచ్ వర్క్ చేస్తున్నాను. ఇది కాటన్ చీర .కలంకారీ క్లాత్ తో వర్కుకి ,సూపర్ నెట్ కానీ కాటన్ కానీ బాగుంటుంది .

ఇలా పాచ్ వర్క్ చీరలు షాప్స్ లో ఉంటాయి కానీ ఒక్కో సారి మనకు నచ్చిన రంగు దొరకదు అటువంటప్పుడు ,ఇలా కలంకారీ సెట్స్ ,మనకు నచ్చిన రంగు చీర తీసుకుని వర్కు లు చేసే వారికిచ్చి చేయించుకోవచ్చు. బెనారస్ తో పాచస్ ,బోర్డర్ ఐతే క్రేప్ కానీ పట్టు కానీ బాగుంటాయి . ఇవైనా అంతే మనకు నచ్చిన బెనారస్ క్లాత్ ,మాచింగ్ చీర తీసుకొని చేయించుకో వచ్చు . కలంకారీ , బెనారస్,వేరే క్లాత్ లేవైనా కానీప్రింటెడ్ చీరలకు కూడా బోర్డర్ లాగా వేయించుకోవచ్చు . మనము ఒకటి రెండు సార్లు కట్టిన చీరలకైనా ఇలా బోర్డర్ లా వేయించుకుంటే చీరలకు కొత్త లుక్ వస్తుందికదా . అందుకే ఎప్పుడైనా బోర్ కొడుతుంటే కాలక్షేపం కోసమైన ఇలా చీరలకు ఏవో ఒక మెరుగులు దిద్దుతూ వుంటాను.



నేను ఈ పాచ్ వర్క్ చేయడం ఎక్కడా నేర్చు కోలేదు కానీ ,చూసి చేయడం మొదలు పెట్టాను . నేను ఇదివరకే ఈవర్క్ చేసుకున్నాను. ఇది మాచిన్నక్క చీర. ఎలా ఉందో చెప్పండేమరి .

11 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి, చీరకి సరిగ్గా నప్పింది. పాచ్ వర్క్ ఎలా చేయాలో కూడా రాయండి.నేనూ ప్రయత్నించి గురుదక్షిణగా ఆ ఫోటో పంపిస్తా :)

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందండి వర్క్. కలర్ కాంబినేషన్ కూడా బాగా కుదిరింది.

    రిప్లయితొలగించండి
  3. @సుభద్ర,అవును మంగళగిరి కాటనేనండి. ధన్యవాదాలండి . @మదురవాణీ,@లక్ష్మి ధన్యవాదాలు.
    @ మాలాకుమార్,@సుజ్జి,@జయ,ధన్యవాదాలండి.
    రమ్య గారు, మీరు నేర్చుకుంటానంటే తప్పకుండా నేర్పుతాను .

    రిప్లయితొలగించండి
  4. mee blog nenu ippude chusanu. chala bagundandi. Naku kuda patch work ela cheyyalo nerputara pls..

    Padmini.

    రిప్లయితొలగించండి
  5. kalankari cloth puvvulu, anchu sets ekkada e shop lo dorukutunnayo koncham cheptara, please

    రిప్లయితొలగించండి