మన సంప్రదాయంలో ముగ్గులు వేయడం వెనక జీవ కారుణ్య సూత్రం దాగి ఉంది.
ఒకప్పుడు వాకిలంతా పెద్ద పెద్ద ముగ్గులు బియ్యం పిండితో వెసేవారు. ముగ్గు వేయడానికి బియ్యం పిండి నే వాడేవారు.అది ఇంటి ముంగిలికి అందాన్నే కాదు,చీమ లకు ,పిచుకలకు ఆహారంగా కూడా ఉండేది.
చీమలు ఆహారం కోసం ఇంట్లోకి బారలు తీరకుండా ఒకే చొట వాటికి ఆహారం అందించే యుక్తి ఇదన్నమాట. అంత ఆహారం దొరికితే ఇంట్లోకి ఎందుకు దాడి చేస్తాయి?
అన్నిట్ట్లోనూ మార్పు వచ్చినట్లే దీనిలోనూ మార్పొచ్చింది. పల్లెల్లో కూడా ఇప్పుడు వాకిళ్లన్ని చాలా వరకూ సిమెంట్ గచ్చులే ముగ్గు సున్నం పిండి,రాతి పిండి తోనే.. అప్పుడప్పుడు బియ్యం పిండితో పెడున్నాము.
రోజూ ఇలా బియ్యం పిండి తో ముగ్గు పెడితే ....
ధాన్యపు గదిలో వడ్లు ఉన్నన్ని రోజులూ గది వద్దకు పిచుకలు సందడిగా వస్తూనే ఉంటాయి..
ఎండిన మొక్కజొన్నలు ఉడుతల కోసం దాచి పెడుతుంటా...పిల్లలు సరదాగా నేనంటే నేనని
పెడుతుంటారు.కాకులు రాకుండా కాపలాకాసి ఉడుతలకే పెడతారు.
అమ్మో! ఉడుతలను ఫోటో తీయాలంటే చాలా కష్టం. ఏ కాస్త సడై నా వెళ్ళిపోతాయి.ఈ ఫొటోలు తీయడానికి అరగంట కదలకుండా కూర్చున్నాను.ప్చ్ .. అంత కష్టపడినా ఫోటోలు బాగా రాలేదు .
దాన్యపు గదికి ఉండే తలుపు సందుల్లో నుండి బయటకి వచ్చే వడ్లు చాలు వాటి బుల్లి బొజ్జలకి .
మా ఇంటి చుట్టూ ఉండే కాకులు,పిచుకలు,ఉడుతలు,గోరింకలు మంచినీళ్ళ కి ఇలా వస్తుంటాయి.కానీ కెమెరాకి ఇదే చిక్కింది.
మన హైదరాబాదు లో జీవ వైవిధ్య సదస్సు జరుగుతుంది కదా .. రోజూ పేపర్,టీవీల్లో చదువుతూ ,చూస్తూ మా ఇంట్లో ని జీవ వైవిధ్యం గురించి చెప్పాలనుకన్నాఅంతే ...