=''/>

9, మే 2013, గురువారం

రాజమండ్రి గోదావరి వద్ద సూర్యాస్తమయ చిత్రాలు నేనూ తీసా...

రాజమండ్రి  గోదావరి సూర్యాస్తమయ చిత్రాలు చూసినప్పుడల్లా  నేనూ   ఇలా ఫొటోలు తీస్తే బాగుండును అనిపించేది .

నిన్న అనుకోకుండా  నాకు ఆ బాగ్యం దక్కింది .

మా అమ్మాయి కూడా పండగ చేసుకో అమ్మా నువ్వు కోరుకున్నట్టే ఉంది ఇక్కడ అని ఎంకరేజ్ చేసింది. .

ఫోటోలు తీస్తుంటే ..ఏమిటీ ఇవిడ చాలా ఓయే చేస్తుంది అనుకుంటారేమో ,  అందరూ నన్నే చూస్తున్నారేమో అన్న ఫీలింగ్  కాసేపు కలిగింది కానీ ఫోటోలు బాగా తీయాలన్నా కోరిక దాన్ని జయించింది. (ఎప్పుడూ ఇంట్లోనే ఫోటోలు తీసుకునే నాకు  బయట ఫోటోలు తీయాలంటే  అలాగే అనిపిస్తుంది .కానీ ఎలాగో తీసేస్తుంటా ...)





















                                     



4, మే 2013, శనివారం

హ్మ్ ...ఎలాగో నూట ఏభై అయ్యాయి !!

ఇప్పటికి నూట యాబై టపాలు రాసి  ఓ రౌండ్ ఫిగర్ కి వచ్చాను :))

2009 ఆగస్ట్ లో సరదాగా బ్లాగ్ మొదలు పెట్టాను.ఐతే మొదలెట్టాకానీ ,ఏమి రాయాలో  ..ఎలా రాయాలో తెలియక మొదటి రెండు నెలలు ఏదేదో రాస్తుండేదానిని.ఆ సంవత్సరం డిసెంబర్ లో పన్నెండు పోస్ట్లు రాసాను .అవే నా బ్లాగ్ లో ఒక నెలలో ఎక్కువ పోస్ట్లు.

2010 డిసెంబర్ కి వంద టపాలయ్యాయి.ఈ వంద  టపాల్లో (ఇప్పటికీ)నా  రాఖీ పోస్ట్  గురించి  పేపర్ లో వచ్చింది అదే కాస్త గుర్తింపు. నేను బ్లాగ్ రాస్తానని మా చుట్టాల్లో ఎవరికీ తెలియదు.ఆ పేపర్ చూపించి బ్లాగ్ అంటే ఏమిటో చెప్పి మరీ చూపెట్టి ఆనందించాను.


బ్లాగ్ మొదలుపెట్టడం నా ఇంట్రస్టే కానీ ,టైపింగ్ అలవాటు లేని నాకు అన్నీ చెప్పి  నాకు బోల్డంత సాయం చేసి ,ఎంకరేజ్ చేసింది  మాత్రం మా వారు . టైపింగ్ అలవాటు లేక  ఒక్కో పోస్ట్  రాయడానికి గంటలు పట్టేది .రాసిన దాంట్లో  చాలా తప్పులు....నెమ్మిది నెమ్మిదిగా తన సహాయం తో  అలవాటు చేసుకున్నా . ఓ దశలో బ్లాగ్ రాయడం మానేస్తానేమో అనుకున్నా కానీ  మళ్ళి రాయడం మొదలుపెట్టి  లైన్లో పడ్డాను.

నా పోస్ట్ ల్లో   ..మా ఉళ్ళోసంక్రాంతి పండుగ హడావిడిఈ నాలుగు నెలలు ,మా పొలంలో వన భోజనాలు ,ఇలా ఓ పది పోస్ట్లు ...నాక్కూడా ఈ బ్లాగ్  ప్రపంచంలో  కాస్త చోటు కల్పించాయనుకుంటున్నాను .

మొదటి పోస్టుకు  అందులో ఏమీ లేకపోయినా ఎవరో అజ్ఞాత ఏకంగా మీ బ్లాగ్ చాలా బాగుందని కామెంట్ రాసారు.నా పోస్ట్ కి మొదటి  కామెంట్ రాసి కామెంట్ రుచి చూపించిన ఆయనకి  చాలా చాలా ధన్యవాదాలు . .

అలాగే  నా పోస్ట్లకు ఎక్కువగా కామెంట్స్  రాసిన   జయ గారు,వేణు శ్రీకాంత్ గారు,మధురవాణి గారు, ఇందు గారు ,కృష్ణ ప్రియ గారు ,తృష్ణ గారు,మాలా కుమార్ గారు,జ్యోతి గారు ఇలా చాలా మంది ...

నన్ను ప్రోత్సాహించిన   ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.