=''/>

13, డిసెంబర్ 2014, శనివారం

అయ్యో నా బ్లాగ్ !

బ్లాగ్  లో పొస్ట్ రాసి సుమారు రెండు నెలలు అయింది .పోనీ అలా అని ఈ రెండు నెలల్లోనూ బిజీ బిజీ గా చేసిన ఘనకార్యమేమన్నా ఉందా అంటే అదీ లేదు .
మరెందుకబ్బా  రెండు నెలలనుండి  బ్లాగ్ లో ఏమీ రాయలేదు అంటే..  ఏమో నాకే తెలియట్లేదు .
 అయ్యో నా బ్లాగ్ !పాపం దాని ఆలనా పాలనా పట్టించుకోకుండా  అనాధ లా వదిలేసానే అని అప్పుడప్పుడూ  కాసేపు చింతిస్తూ వుంటాను కూడా .  అయ్యో ఓ పోస్ట్ అన్నా రాయాలి ! అని ఎప్పటికప్పుడు   అనుకోవడంతోనే  అలా అలా  రోజులు జరిగిపోయి నెలలూ గడిచిపోయాయి .
బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో  ఏం చేసినా ?ఏం చూసినా బ్లాగ్ లో  టపాకి పనికొస్తుందా అన్నట్టు చూస్తుండేదాన్ని :)
ఇది కూడా రాసేస్తావా నీ బ్లాగ్ లో   అంటూ   మా పిల్లలు  అడుగుతుండే వాళ్ళు .
 అలాంటిది ఇప్పుడేమో  ఈ  బ్లాగ్ ప్రపంచం లో నాకంటూ చిన్ని గుర్తింపు నిచ్చిన  నా బ్లాగ్ నే మర్చి పోయానేమో అనిపిస్తుంది  .
 ఇంతసేపూ  ఈ డబ్బా ఎందుకంటే ఇకనుండి  నెలకి కనీసమంటే కనీసంగా  ఓ రెండు మూడు పోస్ట్ లన్నా రాయాలని కంకణం కట్టుకున్నా..
   మరి  కట్టుకున్న కంకణాన్ని  విప్పేస్తానో  ?ఇంకా బిగించి కట్టుకుంటానో ? 
9 కామెంట్‌లు:

 1. విప్పడానికి వీలు లేకుండా కట్టేసుకోండి రాధికగారు. నెలకి రెండు, మూడన్నా టపాలు రాలుస్తామన్నారు చాలా సంతోషం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అదే అనుకుంటున్నానండీ ఎంతవరకూ జరుగుతుందో చూడాలి థాంక్స్ చౌదరి గారు

   తొలగించండి
 2. మీరు కచ్చితంగా రాయండి . మీ బ్లాగ్ మిగతా వాటికన్నా వేరు గా ఉంటుంది .
  మీరు అప్పుడప్పుడు పెట్టె ఫోటో లు బాగుంటాయి . మీరు రాసే పోస్ట్ లు మమ్మల్ని మా ఊరు తీసుకునివెళ్తాయి .
  ఇంకా ఎక్కువ గా , చుట్టూ పక్కల జరిగే విషయాలు, పిండి వంటలు , వగైరా వగైరా ఎమన్నా ఉంటె అన్ని రాయమని కోరుతున్నాను .


  రిప్లయితొలగించండి
 3. కిరణ్ కుమార్ కే14 డిసెంబర్, 2014 4:34 AMకి

  మీ సరికొత్త టపాల కోసం ఎదురు చూస్తాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కిరణ్ గారు నా బ్లాగ్ లో మీ మొదటి కామెంట్ సంతోషమండి :) సరికొత్తగా ఏమీ కాదండీ ఎప్పుడూ రాసినట్టే రాయగలను ..థాంక్స్ :)

   తొలగించండి
 4. రిప్లయిలు
  1. ఊడిపోకుండా బిగించేనండీ చూద్దాం ఏమవుతుందో :) థాంక్స్ అండి

   తొలగించండి
 5. హలో రాధిక గారు, రోజు మీరు ఏమన్నా పెట్టారా అని చూడడం లేదని డిసప్పాయింట్ అవ్వడం, హమ్మయ్య ఇకనుండి అయిన మీ బ్లాగ్ లో రెగ్యులర్ గా మీరు రాయడానికి ప్రయత్నిస్తాను అన్నారు. సంతోషం. ఆల్ ది బెస్ట్ :)

  రిప్లయితొలగించండి