=''/>

23, నవంబర్ 2013, శనివారం

ఈ రోజు సూర్యోదయం

మాకు హెలెన్ తుఫాన్ ప్రభావం అంతలేదు .కానీ ,వాతావరణం  నాలుగు రోజుల నుండీ మబ్బు ,గాలీ వానతో ఉంది .

ఈ రోజు  అక్కడక్కడా ఉన్న మబ్బుల మధ్యనుండి సూర్యోదయం ఇలా కనిపించింది .


 


14, నవంబర్ 2013, గురువారం

ఈ పువ్వులు నిజంగా దేవకాంతలే !!


 శరద్కాలం లో చెట్టునిండా విరబూస్తాయి ఈ దేవకాంత పువ్వులు.ఈ పువ్వులు  నా దృష్టిలో నిజంగా దేవకాంతలే !! అంతందం వాటిది !

దారిన పోయే ప్రతీఒక్కరి కన్నూ ఆ చెట్టు పైనే ఉంటుంది.ఇక నేనైతే పువ్వులున్నన్ని  రోజులూ కాసేపైనా  దాని చుట్టూ తిరుగుతూ ,చూస్తూ ఉంటా...ఉదయం చెట్టు చుట్టూ రేకలు రాలి పడుంటే  చుట్టానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి !

అందుకే మూడో కన్నుతో కూడా చూస్తా! అప్పుడప్పుడూ :)) 

మీరు కూడా చూస్తారా? మా దేవకాంతల్ని ...


8, నవంబర్ 2013, శుక్రవారం

నిన్నటి నాగులచవితి పొలంలో ...నిన్న నాగులచవితి కదా !  పొలం వెళ్లి పుట్టలోపాలు పోసి వచ్చాం .

చిన్నప్పుడైతే అందరం కలిసి ట్రాకర్ లో  పొలం వెళ్ళేవాళ్ళం .వెళ్తూ ఇంటి వద్దవంట చేసుకుని వెంట తీసుకెళ్ళే వాళ్ళం  పుట్టలో పాలు పోయడం అయ్యాక, భోజనం  కూడా అక్కడే చేసి సాయంత్రం వరకూ పొలాలన్నీ తిరిగి  వచ్చేవాళ్ళం .  ఆరోజు  అత్తెసరన్నం,పచ్చిపులుసు తో భోజనం .పనిలో పనిలోపనిగా వన  భోజనాలు   కూడా అయిపోయినట్టే .పిల్లలందరం మామిడి చెట్ల కొమ్మలెక్కి ఉయ్యాలలూగుతూ బోల్డన్ని ఆటలు ఆడేవాళ్ళం .

ఇప్పుడు పొలం వెళ్ళినా  పుట్టలో పాలు పోయడమవగానే అలా పొలమంతా   ఓ సారి తిరిగి వచ్చేయడమే !
 
 

గుర్రపు డెక్క పువ్వులు భలే ఉన్నాయి కదా !! పొలం వెళ్ళే దారిలో చెరువు మొత్తం దానితో నిండిపోయింది .


పామాయిల్ తోటలో అంతరపంట గా కోకో ..కోకో కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి .


పొలం లో చెరువు . అందరి పొలాల్లోనూ  చెరువులుంటాయి .త్రీ ఫేస్ కరెంట్ ఉన్నప్పుడంతా మోటర్ తిరుగుతానే ఉంటుంది.ఆ నీళ్ళే పొలానికి వాడతారు .