నిన్న నాగులచవితి కదా ! పొలం వెళ్లి పుట్టలోపాలు పోసి వచ్చాం .
చిన్నప్పుడైతే అందరం కలిసి ట్రాకర్ లో పొలం వెళ్ళేవాళ్ళం .వెళ్తూ ఇంటి వద్దవంట చేసుకుని వెంట తీసుకెళ్ళే వాళ్ళం పుట్టలో పాలు పోయడం అయ్యాక, భోజనం కూడా అక్కడే చేసి సాయంత్రం వరకూ పొలాలన్నీ తిరిగి వచ్చేవాళ్ళం . ఆరోజు అత్తెసరన్నం,పచ్చిపులుసు తో భోజనం .పనిలో పనిలోపనిగా వన భోజనాలు కూడా అయిపోయినట్టే .పిల్లలందరం మామిడి చెట్ల కొమ్మలెక్కి ఉయ్యాలలూగుతూ బోల్డన్ని ఆటలు ఆడేవాళ్ళం .
ఇప్పుడు పొలం వెళ్ళినా పుట్టలో పాలు పోయడమవగానే అలా పొలమంతా ఓ సారి తిరిగి వచ్చేయడమే !
గుర్రపు డెక్క పువ్వులు భలే ఉన్నాయి కదా !! పొలం వెళ్ళే దారిలో చెరువు మొత్తం దానితో నిండిపోయింది .
పామాయిల్ తోటలో అంతరపంట గా కోకో ..
కోకో కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి .
పొలం లో చెరువు . అందరి పొలాల్లోనూ చెరువులుంటాయి .త్రీ ఫేస్ కరెంట్ ఉన్నప్పుడంతా మోటర్ తిరుగుతానే ఉంటుంది.ఆ నీళ్ళే పొలానికి వాడతారు .
చాలా బాగుందండీ
రిప్లయితొలగించండిధన్యవాదాలండి
తొలగించండిచాలా బాగున్నాయండీ ఫోటోలు..
రిప్లయితొలగించండిథాంక్సండి
తొలగించండిమీ కళ్ళలో, మీ మనసులో, మొత్తం ప్రకృతే
రిప్లయితొలగించండిథాంక్సండి :)
తొలగించండిBeautiful pictures.. Radhikaa!
రిప్లయితొలగించండిగుర్రపు డెక్కాకుకి పువ్వులు పూస్తాయని, అవి ఇంత అందంగా ఉంటాయని నాకిప్పటి దాకా తెలీదు. మొత్తం చెరువంతా విరగబూసి నీలి రంగులో భలే అందంగా ఉంది.
కోకో పంట మంచి లాభదాయకం అనుకుంటాను. మనవాళ్ళు కూడా పండిస్తున్నారన్నమాట. Nice to hear it.
థాంక్స్ మధుర :))
తొలగించండినేను కూడా ఇంత దగ్గరగా ,ఇలా చూడటం ఇదే మొదటిసారి .చూడగానే చాలా నచ్చేసింది.
కోకో కి మా వైపు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు .ఆదాయం సంగతి అంటే ఇంకా తెలీదు...
రెండో ఫొటోలో పాల చుక్కలేనా? దండలా..
రిప్లయితొలగించండిపాలేనండి .పోస్తున్నప్పుడు తీసింది ..
తొలగించండినాగుల చవితి, వనభోజనం, పొలం లో తిరగడం అన్నీ వేటికవే! అప్పట్లా కలలో కాకుండా ఈ సారి నిజంగా మీ ఊరు వచ్చెయ్యాలి.
రిప్లయితొలగించండిరావాలి మరి :)) థాంక్స్ ఎన్నెల గారు చాలా రోజులకి వచ్చారు
తొలగించండిఆ గుర్రపు డెక్క పూల ఫొటో భలేగా ఉందండి. గుర్రపు డెక్క నీటిపై అల్లుకుపోవడం చూశాను కానీ, అది పూవులు విరబూయడం చూట్టం మాత్రం మీ ఫొటోలోనే. గ్రామీణ సౌందర్యాన్ని కళ్ల ముందుంచారు. మీకు ఎలాగూ ఫొటోగ్రఫీ ఇష్టం కాబట్టి, తెలుగు వెలుగు మేగజైన్ వాళ్లు మంచి చిత్రాన్ని ప్రచురిస్తామని ఫొటోలను ఆహ్వానిస్తున్నారు. మీరూ పంపండి. మరింత ఎక్కువమందికి ఆహ్లాదాన్ని పంచినట్టుంటుంది.
రిప్లయితొలగించండిమీ సూచనకి థాంక్సండి .తెలుగువెలుగు .org కి మైల్ చేస్తే సరిపోతుందాండి?
తొలగించండితెలుగు సంస్కృతికి దర్పణం పట్టే ఫొటోలు పంపాలన్నది వాళ్ల కండీషన్ లా ఉంది. లక్కీగా మీరు క్లిక్ చేసే ఫొటోలన్నీ అలాంటివే ఉన్నట్టున్నాయి. ఫొటో డీటైల్స్, అదెక్కడా పబ్లిష్ అవలేదనే (మీ బ్లాగులో కూడా అనుకుంటా) వివరాలు పంపాలట. మెయిల్స్ రెండున్నట్టున్నాయి: teluguvelugu@ramojifoundation.org (OR) teluguvelugu@eenadu.net
తొలగించండిథాంక్సండి .ట్రై చేస్తా :)
తొలగించండిఆహా, చాలా బాగున్నాయి ఫొటోస్ :)
రిప్లయితొలగించండిphotoes chala baaga theesaaru
రిప్లయితొలగించండి