టీవీ లోను , పేపర్ లోను పుష్కరాలకి వస్తున్న జనాన్ని చూస్తూ దురదుష్ట వశాత్తూ మొదటి రోజే జరిగిన పెద్ద దుర్ఘటన కొంచెం భయాన్ని పెంచింది . ఈ సారి పుష్కర స్నానం చెయ్యగలమా?ఘాట్స్ దగ్గర ఎలా వుంటుందో ? పైగా పుష్కరాలు దగ్గరకు వచ్చేవరకూ పనులు చేస్తూనే వున్నారు.ఇలా సవాలక్ష అనుమానాలతో ఉదయం ఆరు గంటల లోపు అయితే పెద్దగా జనం వుండరు అని మాకు దగ్గర ,మేము ఎప్పుడు వెళ్ళే గోవుపాదాల రేవుకి వెళ్లి పుష్కర స్నానం చేసాం .
వెళ్ళే జనం వెళ్తూ వచ్చే జనం వస్తూ సందడి సందడిగా కనుల పండగలా వుంది అక్కడకి వెళ్లేసరికి .
క్రితం పుష్కరాలకి ఏర్పాట్లు ఎలా చేసారో గుర్తులేదు కానీ ,ఈ సారి మాత్రం ఏర్పాట్లన్నీ చాలా బాగానే చేసారు .నా వరకు అయితే చాలా బాగానే నచ్చింది .
కొన్ని అనుకోని దుర్ఘటనలు జరగడంతో అంత జరిగాక ఆ మాత్రం చెయ్యరా అనుకోవచ్చు కానీ ఏర్పాట్లన్నీ ఒక్కరోజులో అనుకుని చెయ్యరు కదా .. ఎవరయినా బాగా చెయ్యాలి.ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనే అనుకుంటారు .
మా జిల్లా కలెక్టర్ గారూ,వారి క్రింది అధికారులు ఎన్ని నెలలనుండి కష్టపడి చేసుంటారో ..
లేడిస్ బట్టలు మార్చు కోవడానికి కంటైనర్ లు పెట్టారు తీగలతో సహా ..ఎవరికొచ్చిందో కానీ మంచి ఆలోచన అనిపించింది . అసలు నది స్నానానికి వెళ్లి లేడిస్ ఎవరయినా ఇబ్బంది పడేది అక్కడే .. కొవ్వూరు లో ఒక రేవులోనే అలా పదో పదిహేనో పెట్టారు .
పట్టిసీమ ,తాళ్ళపూడి ఇలా చిన్న వూళ్ళలో రేవుల్లో కూడా ఇలానే వున్నాయి అని వెళ్ళొచ్చిన వాళ్ళు మాట.
నదిలో వేసే పూలు ,కొందరు మూర్ఖం గా ఎక్కువ పుణ్యం వచ్చేయాలని గోదాట్లో వేసే కొబ్బరికాయలు,అరటి పళ్ళు,జాకిట్టుముక్కలు తో సహా ఇంకా ఏవేవో పెద్ద పెద్ద నెట్ల తో ఎప్పటికప్పుడు బోట్లలో చుట్టూ తిరుగుతూ తీస్తూనే వున్నారు.
కొన్నిలక్షల మంది వస్తే వాళ్ళు ఎంత చేస్తే ఏం సరిపోతుంది .అయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే వున్నారు పోద్దస్తమాను.
ఘాట్స్ పైన కూడా ఎక్కడ కాగితం కానీ ప్లాస్టిక్ సంచులు కానీ ఏవున్నా పాపం అలా తీస్తూనే వున్నారు చాలా మంది.అడుగడుక్కి తుక్కుబుట్టలు పెట్టారు .కొందరు స్వచ్చందంగా చేస్తున్నారు . ఉదయం ఆరుగంటలకే ఓ పెద్దాయన చక చకా అన్ని ఏరి తుక్కుబుట్టల్లో వెయ్యడం చూస్తే వీళ్ళకి ఏమిచ్చినా తక్కువే అనిపించింది . .
పిండప్రదాన రేవుల్లో బ్రాహ్మలు కూడా కింద వెయ్యకండి అక్కడ బుట్టల్లో వెయ్యండి అని చెప్తున్నారంటే ఏదయినా ఎవరో ఒకరి వల్ల అవ్వదు అందరి సమష్టిగా చెయ్యడం వల్లే కదా అనిపించింది.ఘాట్స్ కూడా రెండు మూడు గంటలకి వాటర్ తో క్లీన్ చేసేస్తున్నారు .
ఇక ఉచిత బోజనాల సంగతి చెప్పక్కర్లేదు . వూళ్ళ పొడవునా ఎక్కడిక్కడ రోడ్ల పక్కన చిన్న చిన్న టెంట్ లు వేసి ఎవరికి తోచినట్టు వాళ్ళు .
ఇవన్నీ నేను వెళ్ళిన రెండు రోజుల్లో వున్నరెండు మూడు గంటల్లో గమనింనవి .వాళ్ళని చూస్తే ఇంట్లో ఏమాత్రం వీలయిన ఒక్కరోజయినా వెళ్లి వాళ్ళలా సేవ చెయ్యగలిగితే బాగుండును అనిపించింది.
మీడియా లో వచ్చినట్టు వాటర్ చేంజ్ అయింది అని రెండో సారి వెళ్ళినప్పుడు అనిపించింది . కానీ గోదావరిలోకి కొత్త నీరు వచ్చి చేరడం తో ఫ్లో బాగా వుండి బాగానే ఉందంటున్నారు ఇప్పుడు.
అందరి సహకారంతో మా గోదారి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి.
ముగింపు దశ చేరుకున్న గోదావరి పుష్కరాలు ఎటువంటి చెడు సంఘటన లు జరక్కుండా అంతా ప్రశాంతం గా జరిగిపోవాలి గోదారి తల్లి !!
నదిలో వదిలే వాటిని తియ్యడం కోసం చూస్తూ ..
సత్యసాయి సేవాసంస్థ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఎప్పుడూ . క్రితం పుష్కరలప్పుడు కూడా చెప్పుకున్నారు . మాడమ్ ! వాటర్ కావాలా ? అని చిన్నతను బుజాన పొలం లో చేలకి మందు పిచికారి చేస్తారు దాన్ని వాటర్ ఇవ్వడానికి అనుకూలం గా మార్చినట్టున్నారు అది వుంది అతని చేతిలో .
గోదావరి మాత !!
మైలు తెప్పలు !
అం త కరెక్ట్ గా తెలీదు . శివరాత్రి అప్పుడు కూడా అంటారు . పెద్దల జ్ఞాపకార్ధం అనుకుంటా నదిలో మైలు తెప్పలు
వదులుతారు .
జంగం దేవరలు !

పుష్కర వైభవం చూపించారు. పుష్కర స్నానంతో పాటు మీకు ఈ పుణ్యం కూడా దక్కింది.
రిప్లయితొలగించండిథాంక్స్ జ్యోతిర్మయి గారు :)
తొలగించండిNice writeup Radhika gaaru.
రిప్లయితొలగించండిథాంక్స్ శ్రావ్య గారు
తొలగించండిమీరు రాసిందీ, ఫోటోలూ చూస్తే పుష్కరానికి వెళ్ళొచ్చినట్లుంది.
రిప్లయితొలగించండిఅవునా అండి ..
తొలగించండిఅద్భుతం!
రిప్లయితొలగించండిమా తాతగారి ఊరు కొవ్వూరే. ఎప్పుడు ఇండియా వచ్చినా అలా గోపాదాల రేవులో ఒక మనక వేయడం నాకు సరదా. ఈ సారి అద్భుతంగా చూపించారు ఫోటోలు. నేనెప్పుడూ పుష్కర స్నానం చేయలేదు (చెప్పడానికి సిగ్గుగా ఉన్నా నేను పుట్టి పెరిగినది తూర్పుగోదావరే. మా - మాతామహుల వారి - తాత గారిది పశ్చిమ గోదావరి. అంటే నా రక్తం అంతా ఆ తల్లిదే).
ఉచిత సలహా నే అనుకోండి ..గోదావరి కి అంత్య పుష్కరాలు కూడా ఉంటాయండి . ఈ సారి ఆ టైం కి వస్తే పుష్కర స్నానం చేసినట్టవుతుంది ..
తొలగించండిథాంక్స్ అండి ..
ఛాయాచిత్రాలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు.
తొలగించండిమరొక ఉబోస అండీ. పుష్కరకాలం గురుడు సింహరాశిలో ఉండే సంవత్సరం కాలం మొత్తం. అందుచేత ఆ కాలంలో ఎప్పుడు గోదావరీస్నానం చేసినా అది పుష్కరస్నానమే. మొదటి-చివరి పన్నెండేసి రోజులు విశేషం ఐతే కావచ్చును అది వేరే సంగతి. మహాపుష్కరం అన్న మాట కేవలం అసందర్భం - హైప్ మాత్రమే
మీ వివరణ, ఫొటోలు చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిథాంక్స్ మాలా కుమార్ గారూ
తొలగించండి