ఈ రోజు ఉదయం మంచు మా ఊరిని ఎంతగా కమ్మేసిందంటే... తొమ్మిదైనా సూర్యుని జాడే లేదు. నిన్న మొన్న వర్షం పడటం వలన అనుకుంటా!
అలా కమ్ముకున్న పొగమంచులో మా ఊరి పరిసరాలను చూస్తూ .... మా ఊరు ఊటీ కో అరకు కో దగ్గరలో ఉంటే ఇలా ఉంటుందా....అనుకుంటూ అలా ..అలా... కాసేపు ఊహల్లో తేలిపోయా :)
చుట్టూ ఇంతందమైన ద్రుశ్యాలుంటే ,నిషిగంధ గారి లాంటి వాళ్ళైతే చకచకా కవితలల్లేసి మనందరికీ వినిపించేద్దురు .
ఇంటువంటి ఉదయాన్ని చూస్తూ కనీసం కవితలో క కూడారాయలేను కానీ కాసిన్ని చిత్రాలన్నా తీసి తృప్తి పడదామని ,మేడెక్కుతూ ,దిగుతూ ,మధ్య మధ్యలో వంటగదిలో స్టౌ మీద మాడిపోయినవి దించి అటుతిరిగి...అటుతిరిగి ఎలాగోలా తీసేసేను .