=''/>

2, మార్చి 2011, బుధవారం

సువాసనా ఉంది ...తెల్లదనంఉంది ( పువ్వులు)

సర్ఫ్ ఎక్సల్ యాడ్ లో అనుకుంట బట్టలకు "సువాసనా ఉంది ..తెల్లదనమూ" ఉంది అని వస్తుంది .

దానిని మా చెల్లి వాళ్ళబ్బాయి నాలుగేళ్ల "చరణ్" అస్తమానూ అన్నింటికీ ఉపయోగించేస్తాడు. ఉతికి ఇస్త్రీ చేసిన డ్రస్ వేసుకుంటూ వాసన చూసి అబ్బ! "సువాసనా ఉంది ..తెల్లదనమూ" ఉంది అని అచ్చు యాడ్ లో అన్నట్టే అంటాడు.మంచం మీద దుప్పటి మార్చినా, ఎవరైనా మంచి డ్రస్లు వేసుకున్నా అలాగే అంటుంటాడు.

అలా తను పువ్వుల్ని కూడా అంటుంటే ... సువసనిచ్చే పువ్వుల్లో ఎక్కువగా తెల్లపువ్వులే ఉంటాయి అనిపించింది!

నేను తీసిన పువ్వుల చిత్రాలలో" సువాసనా తెల్లదనమూ" కలిగిన కొన్ని పువ్వులు.


చెంగల్వ పువ్వులు .ఇవి సాయంత్రం విడిచి తెల్లవారేటప్పటికి ముడుచుకుపోతాయి.రాత్రంతా మంచి వాసనొస్తుంది..
మనం చిన్నప్పుడు చదువుకున్న కృష్ణుడు పద్యం గుర్తుందా??

చేతవెన్న ముద్ద" చెంగల్వ పూదండ"
బంగారుమొలత్రాడు పట్టుదట్టి
సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు.


మధు మాలతి

ఇది తీగ జాతికి చెందింది. తీగ మొత్తం ఇల్లంతా పాకేసి దాని సువాసనతో ఇంటిని నింపేస్తుంది.

కోడిగుడ్డుసెంపెంగ పువ్వు .

సెంపెంగ పూలలో ఒకరకం ఈ కోడిగుడ్డు సెంపెంగ .ఈ పువ్వు పూర్తిగా విడవదు .ఆఖరి చిత్రం లో వున్నట్లుగానే విచ్చుకుంటుంది .అందుకే దీన్ని కోడిగుడ్డు సెంపెంగ అంటారేమో .వాసన లో మిగతా సెంపెంగపూలకు ఏమాత్రం తీసిపోదు . ఈ పువ్వు చిత్రాలు ఇంకా ఇక్కడ చూడొచ్చు.పూతవెలగ పువ్వులు . ఇవి ఏసీజన్లో ఐనా పూస్తాయి.

సువాసనలో మల్లె,జాజులతో పొటీపడతాయి.


గోవర్ధన పువ్వు .


లిల్లీ పువ్వులు


విరజాజులు

< బొండుమల్లి పువ్వు .


మల్లెపువ్వుల వాసన గురించి నేను చెప్పక్కర్లేదు .వేసవిలో జరిగే పెళ్లిళ్ళు,ఫంక్షన్ లలో మల్లె పూలదండలు జడలో పెట్టని అమ్మయిలుండరు.ఎప్పుడూ పువ్వుల దండలు పెట్టకపోయినా మల్లెపూల దండలు మాత్రం పెట్టుకోవడానికి ఇష్ట పడతారు.

ఇప్పుడు పెళ్లి మండపాలు ఎక్కువగా ఏ వాసనలేని ఇంగ్లీష్ పువ్వులుతో (జర్బరా ,ఆర్కిడ్స్) కట్టేస్త్తేస్తున్నారు కానీ,ఇది వరకు పెళ్లి మండపాలన్ని మల్లె,జాజులు,లిల్లీ ,చేమంతి పూలతోనే కట్టేవారు. పువ్వుల వాసనలన్నీకలగలిపి పెళ్లి పందిళ్ళు ఉండేవి.20 కామెంట్‌లు:

 1. అద్భుతం గా ఉన్నాయి. మీ ఇంట్లోవా? కోడిగుడ్డు సంపెంగ పువ్వు ఇదే చూడటం..

  రిప్లయితొలగించండి
 2. @కృష్ణప్రియ,అన్ని మా ఇంట్లోవి,అమ్మ వాల్లింట్లోవి ..కోడిగుడ్డు సెంపెంగ చూడటం ఇదే మొదటిసార? ఇంకా చిత్రాలు ఇక్కడ చూడండి http://palleturipaduchu.blogspot.com/2010/10/blog-post_31.html..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించండి
 3. నంది వర్థనం పువ్వు ఇలా ఉండదు కదండీ! ముద్దగానే ఉంటుంది కానీ దానికి సువాసన చాలా మైల్డ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు పెట్టిన ఫొటో లో ఉన్న దాన్ని 'సువర్ణ గోవర్ధనం"అంటారనుకుంటున్నాను. మా ఇంట్లో ఉంది. వాసన చాలా బాగుంటుంది. మా ఇంట్లో నంది వర్ధనం కూడా ఉంది లెండి. అందుకే తేడా తెల్సింది

  రిప్లయితొలగించండి
 4. ఇవన్నీ చూసాను కానీ చాలావాటి పేర్లు తెలీదు. ఇప్పుడే వినడం :-)

  రిప్లయితొలగించండి
 5. ’చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ’..అంటే ఆ పూలెలా వుండేవో అనుకునే వాన్ని...

  అన్ని పూలు చాలా బాగా తీకుకొచ్చారు!

  పరమాత్మున్ని ’పుష్పహాస్’ (పువ్వులా నవ్వేవాడు)అంటారు సహస్ర నామంలో...
  పరమాత్మ నవ్వితే ఇలాగే వుంటుందేమో...తెల్లని పూవుల్లాగా!

  ధన్యవాదాలు...నా ఫేవరెట్ బ్లాగుల్లో మీది మొదటిది!

  -satya

  రిప్లయితొలగించండి
 6. రాధికగారూ, ఎంతబాగున్నాయో పూలు. ఆ సంపెంగ నేను చూడటడము ఇదే మొదటిసారి. చిన్న డవుటు, అవి నందివర్ధనం కాదు,నాగమల్లిపూలు అనుకుంటా మంచి సువాసన వస్తుంది,నంది వర్ధనాలు వేరేగాఉంటాయి,పూతవెలగ పువ్వులను నర్సరీలొ ఏమని అడిగితే వానికి అర్ధం అవుతుంది? ఆమొక్క తెచ్చుకోటానికి?

  రిప్లయితొలగించండి
 7. బావున్నాయండీ పువ్వులు అన్నీ
  పూల మొక్కలు ఉంటే మంచి కాలక్షేపం

  రిప్లయితొలగించండి
 8. wow!nice pics!కోడిగుడ్డు సంపెంగ తప్ప మిగిలినవన్ని తెలుసండి. చెంగల్వ నా దగ్గర ఉంది కానీ ఎప్పుడో కాని పుయ్యదు.కుండిలో ఉన్న మూలనేమో. దానికి బాగా స్పేస్ కావాలి.
  నందివర్ధనం అని రాసినదానికి వేరే పేరు ఉండాలి. ప్రస్తుతం గుర్తు రావట్లేదు. ఎండిపోయినా సువాసన భలే ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లోంచి ఈ పూలు రోజూ తెచ్చిస్తూ ఉండేది .

  రిప్లయితొలగించండి
 9. వావ్ చాల బాగున్నాయి.అన్ని మీ ఇంటిలోని చెట్లు అన్ని నాకు ఒకొక్కటి
  పార్సిల్ చెయ్యండి .అంతా బాగా నచ్చేసాయీ ......
  కోడిగుడ్డు సంపెంగ పువ్వు ఇదే చూడడం ...

  రిప్లయితొలగించండి
 10. @సుజాత,మీరన్నది నిజమండి .అది గోవర్ధనమే .నాకు గోవర్ధనము,నందివర్ధనం రెండు కన్ఫూజన్ .నందివర్ధనం మా ఇంట్లోను ఉంది.పేరుమార్చాను.ధన్యవాదాలు.
  @మంచు ,ధన్యవాదాలు.
  సత్య గారు ,చాలా థాంక్స్ అండి.

  రిప్లయితొలగించండి
 11. సునీత గారు,నాగమల్లి పువ్వులు ఇలా ఉండవండి.పైన పడగలా వస్తుంది .సుజాత గారు చెప్పింది నిజమేనండి వీటిని నందివర్ధనం అనే అంటారు.పూతవెలగ మొక్క అంటే ఇస్తారండి.మేము కడియం నర్సరీలో తెచ్చాము.ధన్యవాదాలు.
  @లత ,అవునండి చాలా మంచి కాలక్షేపం.ధన్యవాదాలు.
  @తృష్ణ,చెంగల్వ జూన్ నుండి రెండు నెలలు బాగా పూస్తుందండి.ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. పూవులు చాలా బాగున్నాయి. ఐదారు పూవులు ఎప్పుడు చూడలేదు. కోడి సంపెంగ, పూత వెలగ వినలేదు.
  ఈ పూవులు చూడడానికైనా మీ ఊరు వచ్చేస్తాను. తప్పదు.
  పూవుల గురించి ఈ వేళ బాగానే నేర్చుకున్నాను.

  రిప్లయితొలగించండి
 13. ఈ పూతవెలగ ఎప్పుడూ వినలేదే! పూలు భలే ఉన్నాయ్! తెలుపు ఉంది...సువాసనా ఉంది ;) మీరు ఈ రకంగా పువ్వుల ఫొటోలు పెట్టి ఊరించేస్తే...ఇక మీ ఇంటిమీదకి దాడే! :))

  రిప్లయితొలగించండి
 14. అర్జెంట్ గా మీ ఇంటికి వచ్చెయ్యాలనిపిస్తుంది రాధికా. మీ చరణ్ బాగా స్మార్ట్ లా ఉన్నాడు

  రిప్లయితొలగించండి
 15. భలే బాగున్నాయి..నాకు విరజాజులు ఇష్టం. గబ గబా ఇన్విటేషను ఇచ్చుకోండి..చక చకా వచ్చి ఇవన్నీ చూసి పెట్టి , పాత పోస్టుల్లో చెప్పినవన్నీ తిని పెడతాం.

  రిప్లయితొలగించండి
 16. బులుసు సుబ్రహ్మణ్యంగారు,ఎలాగు మా జిల్లాకి వచ్చేస్తున్నారుగా! మా ఊరువచ్చేద్ధురు గాని:)).ధన్యవాదాలు.
  @ఇందు,పూతవెలగ పువ్వులు వినలేదా ?మీ దాడికి నే ఎదురుచుస్తా!ధన్యవాదాలు
  @రాణి ,చాలా రోజులకి కనిపించారు స్వాగతం :)ఇటు వైపుకి వస్తే మా ఇంటికి వచ్చేయండి.అవునండి మా చరణ్ చాలా స్మార్ట్..ధన్యవాదాలు. @ఎన్నెల మీరెప్పుడు మా జిల్లాకి వచ్చినా తప్పకుండా మా ఊరు రావాలి .ఇదే నాఇన్విటేషను:))ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. ఇంత చక్కటి పూలు మహిళా దినోత్సవానికి బహుచక్కగా సరిపోయాయి కదు. మీకు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 18. రాధిక గారూ ! మీ పూల తోరణాల నా మనో కలర్టీవీకి బాగా నచ్చేశాయండీ! అలాగే నాగమల్లి పూల చిత్రాలు సేకరించండి.అవి శివునికి యెంతొ....యెంతో...ప్రీతికరం తెలుసాండీ?ఇంక ఆ పనిలో ఉండండి మరి......అవి మాకు దొరకవు.నా భార్య ఆ రంగులో ఉండే ఒకరకం మందారాలనే నగమల్లిపూలు అంటుంది...అందుకైనా సాక్ష్యం కావాలి...

  రిప్లయితొలగించండి
 19. chengalva poodanda ani vinadame...first time chusa...thank you :)mee poola thota chaala baagundi

  రిప్లయితొలగించండి
 20. ఎంత అదృష్టవంతులండీ మీరు? ఫువ్వులతో సహవాసం ఛేస్తున్నారూ? మహా భాగ్యవంతుల్లో మీరూ ఒకరే !!! కొంచం కుళ్ళుగాఉంది...ప్రకృతికి ఇంత దగ్గరగా నేను లేనే అని(సరదాకే స్మీ) !! మీ రోజా పూలూ, వనభోజనాలూ చూస్తూంటే కళ్ళు చెమర్చి ఒకలాంటి సంతొషంతో గుండె నిండిపోయింది. మీ తోటలోంచి మా ముంగిట్లోకి పూల పరీమళాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు. మీ తొట సదా పరిమళాలు వెజల్లాలని, ఆ పరిమళపు గాలులు ఇలా మీరు మాతో పంచుకోవాలని ఆశిస్తూ ....ఎదురుచూస్తూ...

  రిప్లయితొలగించండి