=''/>

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మహేంద్రాడ్యూరో బైక్ తో ..


నేను చదువుకునే రోజులనుండి స్కూటీ నేర్చుకుని ,నడపాలనే నాకోరిక ఇదిగో ఈ "మహేంద్రా డ్యూరో "ద్వారా ఈరోజు తీరింది .

మేము ఈమధ్యనే మా మావయ్యగారకని మహేంద్రా డ్యూరో తీసుకున్నాము . మావయ్యగారు ఎల్.ఎం.ఎల్ వెస్పా వాడేవారు కానీ అవి ఇప్పుడు రావటం లేదని ఇదితీసుకున్నాము. (మా ఊరిలో 55సంవత్సరాలు దాటినవారులో చాలా మంది ఇదే తీసుకుంటున్నారు .)

అసలు ఇదికొన్నప్పుడు నేనే ఎక్కువ సంతోషించాను ఎప్పుడెప్పుడు నేర్చేసుకుందామా అని .నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడలేదులే . మావారు వెనకాల కూర్చుని చెబుతుంటే నడిపేసేను . అలా రెండు మూడు రోజులు చేస్తే వచ్చేసింది .కానీ ఒక్కదాన్ని ఎప్పుడూ నడపలేదు .

ఈరోజు మాబాబు, వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది రమ్మన్నారు అనిచెప్పాడు . స్కూలకి వెళ్ళాలని మావారితో అంటే నాకు అర్జంట్ పని వుంది రావడం కుదరదు ,డ్యూరో నేర్చున్నావు కదా వెళ్ళు అన్నారు.

నేర్చుకున్నాను కానీ ఒక్కదాన్ని ఇప్పటివరకూ వెళ్లలేదు,రోడ్ మీద గేదెలుకానీ ,లారీగానీ వస్తేవెళ్ళాలంటే బయం . . తప్పదింక వెళ్ళలికదా ఎలాగో నెమ్మిదిగా వెళ్లొచ్హాద్దామని బయలుదేరాను .

ఒకవైపునుండి డ్రైవింగ్ చేయాలనే నాకోరిక తీరుతుందని ఆనందం ,మరోవైపు నుండి రోడ్ మీద గేదెలు అవి రాకుండా వుంటే బాగుండును అనుకుంటూ ఎలాగో నెమ్మిదిగా స్కూల్ కి వెళ్లాను . (స్కూల్ మా పక్క ఊరిలో ఉంటుంది .2కిలోమీటర్ల దూరం ఉంటుంది .) మీటింగ్ అయిపోయాక అలాగే నెమ్మిదిగా వచ్చేసాను . మొత్తని కి ఎలాగైతే క్షేమంగా వెళ్లి క్షేమంగా వచ్చేసాను .

ఇదండి మా మహేంద్రా డ్యూరో తో నా మొదటిరోజు ప్రయాణం . రాగానే మీతో పంచేసుకున్నాను .

3 కామెంట్‌లు:

 1. బాగుందండి మీ ఎక్స్పీరియన్స్. కంగ్రాట్స్. కీప్ ఇట్ అప్. అప్పుడప్పుడు కొంచెం నాకు లిఫ్ట్ ఇవ్వాలి మరి. ఓ కే నా!

  రిప్లయితొలగించు
 2. మీ పోస్టులు చాలా ముచ్చట గా ఉన్నాయండీ. అచ్చ తెలుగు లక్షణాలు కనపడుతున్నాయి..కీప్ ఇట్ అప్.

  రిప్లయితొలగించు
 3. జయగారూ,తప్పకుండా లిఫ్టిస్తాను .మరి మాఊరెప్పుడొస్తున్నారు ?దన్యవాదాలు .
  చాలా థాంక్స్ రాం గారు .

  రిప్లయితొలగించు