=''/>

11, మార్చి 2010, గురువారం

ఏ దివిలో విరిసిన పారిజాతమో...

ఏ దివిలో విరిసిన పారిజాతమో...
1973లో వచ్చిన కన్నెవయిస్సు సినిమాలోది ఈపాట. చిన్నప్పుడు రేడియోలో ఈ పాట వస్తుంటే అలా వింటూ ఉండిపోయేదాన్ని.ఇప్పుడైనా టీ.వీ లోవస్తే పాట అయ్యేవరకూ(అస్తమానూ వినే పాటైనాసరే) ఎవరినీ చానల్ మార్చనివ్వను అంతిష్టమీపాటంటే.

బాలూ పాడిన ఈపాటకి ,
దాశరధిగారు సాహిత్యం సమకూర్చారు .
సంగీతం సత్యం.

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో
నామదిలో నీవై నిండిపోయెనే ..

ఏదివిలో విరిసిన పారిజాతమో.. ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో ...

నీరూపమె దివ్య దీప మై నీనవ్వులె నవ్య తారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో..

పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే ..

నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...

కాలి అందియలు గల్లుగల్లుమన
కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలారావే..

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...నామదిలో నీవై నిండిపోయెనే..
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపినదినీవే..
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపిందినదీవే..
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే..

పదముపదములో మధువులూరగా ... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే...

ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే ..
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...


***********

4 కామెంట్‌లు:

  1. అంతా బావుంది కానీ, "మదువులూరగా" తీసేసి, "మధువులూరగా" అని పెట్టండి.. :)

    రిప్లయితొలగించండి
  2. అందమైన పాట ! నాకూడా చాలా ఇష్టం :) :) ఈ పాటలో రోజారమణి ని చూస్తె ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు :)

    రిప్లయితొలగించండి
  3. ప్రదీప్ గారు,మీసూచనకు ధన్యవాదాలు .
    @వినయ్ ,అవునండి జానికిగారి వెర్షన్ చాలాబాగుంటుంది. @పరిమళధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి