=''/>

28, ఆగస్టు 2013, బుధవారం

మా సేంద్రీయ వ్యవసాయం ....ముడిబియ్యం (బ్రౌన్ రైస్)

ఇప్పుడిప్పుడే (నాలుగేళ్ల నుండి )మా వాళ్ళు సేంద్రీయ పద్దతిలో గోమయం తో , ఎటువంటి ఎరువులూ ,పురుగుమందులూ వాడకుండా వరి వ్యవసాయం చేయడం  అలవాటు చేసుకుంటున్నారు.

మొదట్లో వర్మికంపోస్ట్  ట్రై చేసారు అది కుదరలేదు .సుభాష్ పాలేకర్  ఉపన్యాసాలు,పుస్తకాలు చూసి ఎలాగూ ఆవులు ఉన్నాయి  కదా గోమయంతో చేద్దామనుకుని మొదలు పెట్టారు .  ఆవు మూత్రం ,పేడ ,కొద్దిగా బెల్లం ,ఇసుక అన్నీ ఒక డ్రం లో కలిపి వారం రోజులు మురగ బెట్టి చేలో నీటితో పాటు వదిలేస్తున్నారట. కొత్తలో ఇలా చేయడం కాస్త కష్టంగా అనిపించింది కానీ ఇప్పుడు పరవాలేదు .

అలాగని మొత్తం వరి చేనంతా  కాదు.మాకు తినడానికి సరిపడా చేస్తున్నారు.మిగిలింది  మాములుగానే .అంతా అలానే చేయొచ్చుగా అంటే , ఈ పద్దతికి బాగా అలవాటుపడ్డాక మొత్తం సంగతి చూద్దాం అంటారు.

 సేంద్రియ పద్దితిలో పండించినా ,ఎన్నో ఏళ్ల నుండి ఎరువులు వాడటం వలన వాటితాలుకు ప్రభావం మెదటి రెండేళ్ళు  వచ్చిన ధాన్యంపై ఉంటుంది . తరువాతనుండి ఎటువంటి రసాయనాలు  తగలకుండా  స్వచ్చంగా పొందుతున్నాం ..                        
                                                 పై పొట్టు మాత్రమే ఒలిపించిన  ముడిబియ్యం 

ఇప్పుడు  చాలా మంది ఆరోగ్యానికి మంచిదని ముడిబియ్యాన్ని వాడుతున్నారు.

అసలు మా అందరికీ ముడిబియ్యాన్ని అలవాటు చేసింది మా మావయ్య (అమ్మ తమ్ముడు ) .తను ముందు మొదలు పెట్టాడు.బియ్యం మిల్లుకు వెళ్లి  ఎలా ఆడాలో దగ్గరుండి వాళ్లకు వివరంగా చెప్పి  చేయించుకున్నాడు.మిల్లులో మొదట వడ్లు వేయగానే పైపొర మాత్రమే పోతుందట .అప్పుడే  ఆపేస్తే  ఇలా అచ్చంగా ముడి బియ్యం వస్తుంది.

మామూలు  బియ్యాన్ని చూసిన  కళ్ళతో ముడిబియ్యాన్ని చూస్తే ముతక బియ్యం లా అనిపిస్తుంది.   ఈ బియ్యంతో అన్నం వండటానికి (తినటానికి)తలక్రిందులు పడేవాళ్ళము కొత్తల్లో .. .  తెల్ల బియ్యం కన్నా ఎక్కువ నీళ్ళు పడతాయి .ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది.మామూలు కుక్కర్ల  కన్నా  కరెంట్ రైస్ కుక్కర్లు బాగుంటాయి ముడిబియ్యం వండటానికి. 

ఈ అన్నం తినడానికి పెద్దవాళ్ళం తొందరగానే అలవాటు పడ్డాము కానీ మా సాయి మాత్రం మంచి కూరలు వండినప్పుడు కూడా ఈ అన్నమేనా అని సణుక్కుంటూ తింటాడు .(మంచి కూరలంటే  తెలుసుగా :) )వాడు హాస్టల్ నుండి వచ్చినప్పుడు వాడికి మాత్రమే ఎప్పుడన్నా   తెల్లన్నం వండుతాము .ఎప్పుడూ  ముడిబియ్యమే వాడతాము.దీనికి అలవాటు పడ్డాక తెల్లన్నం  రుచీ పచీ  లేనట్టు అనిపిస్తుంది.29 కామెంట్‌లు:

 1. ఆరోగ్యకరమైన ​మంచి పని చేస్తున్నారండీ.. అభినందనలు.. ​

  రిప్లయితొలగించండి
 2. దిగుబడి ఎలా ఉందండి?
  మేము ఎప్పటి నుండో ముడి బియ్యమే..ఓ పదేళ్ళు అవుతుందేమో మొదలుపెట్టి.

  మా పిల్లలు ముఖ్యంగా మా అబ్బాయి మాకన్నా ఇష్టంగా తింటారు.

  కానీ ఒకటి..ముడి బియ్యపు అన్నంలో కూరల రుచి తెలియదండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దిగుబడి ఎకరాకి పాతిక బస్తాలు వస్తుంది .ఇదివరకటి మీద ఐదు తక్కువ అంతే ...మా అమ్మాయి బాగానే తింటుంది మా వాడి తోనే గొడవ మీరన్నదే కూరలు రుచి ఉండదు అని ముక్యంగా నాన్వెజ్ కి ఇకా తేడా తెలుస్తుంది ..ధన్యవాదాలు ..

   తొలగించండి
 3. మంచి బియ్యం తింటున్నారన్నమాట !అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. నేనైతే ఆరేళ్ల నుండీ దంపుడుబియ్యమే! మేమెప్పుడూ అనుకుంటూ ఉంటాం ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు దంపుడు బియ్యం తెచ్చుకోవాలి అని.. ఈసారైతే మీ ఊరు వస్తాం :)

  రిప్లయితొలగించండి
 6. మేమూ ఏడేళ్ల నుండి ఈ బియ్యమేనండి .మీకు నిజంగా కావాలంటే చెప్పండి పంపిస్తాం:)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్తే రాధిక గారు,

   నేను ఈ మద్యనే ముడి బియ్యం గురించి విన్నను ..నేను కూడా ఇక నుండి ప్రయత్నిద్దాం అని అనుకుంటున్నాను కాని నేను చెన్నై లొ వుండటం వలన ఈ ముడి బియ్యం క్వాలిటి ఎలా చూసి ఎంచుకోవాలొ నాకు తెలియడం లేదు ... మీరు ఎమైనా సహాయం చేయగలరా ?

   ధన్యవాధాలు .
   కిషొర్ బిట్రా..

   తొలగించండి
  2. కిషోర్ గారు నమస్తే అండి,
   నాకు బయట షాప్స్ లో ఎలా ఉంటాయో తెలిదు కానీ వడ్ల గింజకి పైపొర మాత్రమే తీయడం వలన ముడిబియ్యం మెరుస్తూ ఉంటుంది.బియ్యం కడిగినా తెల్లబియ్యం కి వచ్చినట్టు నీళ్ళు తెల్లగా రావు.కొన్ని షాప్స్ లో నాశిరకం ఎర్రబియ్యం ముడిబియ్యంలా అమ్ముతున్నారంటున్నారు .అన్ని చోట్లా అలా ఉండక పోవచ్చు ..మంచి అలవాటుఇది తప్పక ట్రై చేయండి ...ధన్యవాదాలండి

   తొలగించండి
 7. సేంద్రీయ వ్యవసాయ పద్ధతి బాగా వివరంగా రాసారు. బాగుంది. ముడిబియ్యం ఆరోగ్యానికి మంచిదే కానీ, తినడానికి చాలా డిటర్మినేషన్ కావాలి :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొత్తలో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ముడిబియ్యం అన్నం తినడానికి అలవాటు పడితే తెల్ల బియ్యం అన్నం తినలేమండి ...ధన్యవాదాలు

   తొలగించండి
 8. :( asooya vestoandi!

  sanaathana paddhatulu paaTistunnanduku dhanyavaadamulu.

  Narsimha K.

  రిప్లయితొలగించండి
 9. గొప్ప సంగతి చెప్పేరు.అబ్బాయితో ఆవునికొనమని చెప్పేను. కొంటానంటున్నాడు, మరెప్పుడుకొంటాడో! ఆవుతోనే వ్యవసాయం. మీవాళ్ళు అంత వ్యవసాయం అలా చేయడానికి భయపడుతున్నారు. మొదలు పెట్టేరు కనక భయంలేదు, తప్పక విజయం మీదే అని నా మాటగా కూడా చెప్పండి.మంచి మాట విన్నాను.

  రిప్లయితొలగించండి
 10. సత్యప్రియ రాధిక (నాని) గారు నేనండి మీ 'రాఖి' తమ్ముడిని. సేంద్రియ పద్దతులగురించి బాగా వివరణ ఇచ్చారు.
  మాకు కూడా ముడి బియ్యం చిన్నపటినుండి అలవాటులేదు కాకపొతే ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాము. ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసుకుని రెండేళ్ళ నుండి తింటున్నాము. మామూలు కూరలతో తినడం కష్టం కావడం వల్ల బ్రేక్ఫాస్ట్ లో పెరుగుతో తింటాము.

  వీలయితే నా బ్లాగ్ ని కూడా సందర్శించ మనవి

  http://kaavyaanjali.blogspot.in/

  మీ 'రాఖి' తమ్ముడు
  శ్రీధర్ భుక్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ బ్లాగ్ చూసాను బాగుంది .ధన్యవాదాలు శ్రీధర్ భుక్య గారు

   తొలగించండి
 11. మంచి అలవాటు రాధిక గారు. వ్యవసాయ పద్దతులు తెలుసుకోవడం బాగుంది. నేను ముడిబియ్యం కొన్నిరోజులు ప్రయత్నించాను కానీ తినలేకపోయానండీ. మరికాస్త డిటర్మినేషన్ తో మళ్ళీ మొదలుపెట్టాలి.

  రిప్లయితొలగించండి
 12. ముడిబియ్యపు అన్నం కొత్తలో అలవాటయ్యే వరకూ కష్టం గానే ఉంటుంది అలవాటయ్యాక తెల్లబియ్యంఅన్నం తినలేము .మళ్ళి ప్రయత్నించండి ..ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి