=''/>

19, మార్చి 2010, శుక్రవారం

కోకిలమ్మ కుహూ కుహూ రాగాలు

వసంతకాలం వచ్చింది కదా ,రొజూ మా ఇంట్లో చెట్ల మీదకి కోయిలలు చేరి చక్కగా మాకు వాటి రాగాలను వినిపిస్తున్నాయి .వాటికి జతగా మా బాబుకూడా తన గొంతు కలుపుతూ ఉంటాడు .

ఆ కుహు కుహు రాగాలను రొజూ వింటుంటే ..... నేను కూడా కవితలు రాయగలిగితే బాగుండును అనిపిస్తూ ఉంటుంది .నేనా ..కవితలా అని ఒకనిమిషం అనిపించింది కానీ , కవిత కాకపోయినా కనీసం ఓ తవికైనా రాయలేనా అని కవితో ..తవికో రాసేసి నేను కూడా ఓ కవయిత్రిననిపించుకుందామనిఒక "శుబోదయం"లో గట్టి నిర్ణయం తీసేసుకున్నాను . ఎలాగో ఒకపూటంతా అలోచించీ... చించీ రాసేసాను .

మరీ మరువం ,నిషిగంద బ్లాగు లలో కవితలలా కాకపోయినా ఒక మోస్తరు " తవికలా" అయినా రాయగాలిగేనని తుత్తిపడ్డాను . మరి చదివి మీరే చెప్పండి ఎలాగుందో .


వసంతఋతువాగమనంతో

ఆకులు రాల్చి బోసిపోయిన

చెట్లన్నీ చిగురించగా ..

తూరుపున పసిడివెలుగుల

లేతభానుని నులివెచ్చని

కిరిణాలు మాఊరిపై ప్రసరించగా ...

ఆనందంతో వినిపించెను

కుహు..కుహూ..రాగాలను

మాపెరటి గున్నమావి చెట్టుపై నున్న కోకిలమ్మ .

దాని తియ్యని రాగాలే...

మాకు ప్రతీదినమూ .. ..

సుప్రభాతపు మేలుకొలుపులు .
మా కోయిలమ్మ రాగాలు కూడా వినండి .చివరలో కాకి కూడా
Record003
Record003.amr
Hosted by eSnips

నాకు ప్లేయర్ లో ఎలా పెట్టాలో తెలియలేదు .కాస్తచెప్పండి.

5 కామెంట్‌లు:

 1. కవులందరికి ప్రకృతి మంచి కేటలిస్ట్.
  ప్రకృతి సోయగాలకు పులకించని హృదయం హృదయమా?
  చక్కగా రాసారు. మెదడుకి సాన పెడుతూ ఉంటే మరింత మంచి కవిత్వం వస్తుంది. ఎక్కువ పుస్తకాలు చదవండి. అభినందనలతో.

  రిప్లయితొలగించు
 2. సింపుల్ గా చక్కగా ఉందండి మీ కవిత..
  అన్నట్టు సూచనలు, సలహాలు అని అడిగారు...అంత పెద్ద పెద్ద పదాలు నాకు అంతగా సూటవ్వవండి...:-)

  రిప్లయితొలగించు
 3. KAVITHA BAAGUNDI... ANNINTIKI MINCHI MEE BLOG TEMPLATE BAAGUNDI..

  VEEKSHISTHUNNA SNEHITHULU ANI KAADU.. VEEKSHINCHINA SNEHITHULU ANAALEMOO??

  NENU RAJAMUNDRY NUNDE...

  WWW.INNERVOICE.CO.CC

  రిప్లయితొలగించు
 4. మొదటి ప్రయత్నమైనా ....చక్కగా రాశారు కవితని ! తవిక కాదు :)

  రిప్లయితొలగించు
 5. @శ్రీనిక మీసూచనకు ధన్యవాదాలు.
  శేఖర్ గారూ ధన్యవాదాలు.
  శివగారు,మీరు చెప్పింది నిజమేనండి .నేను దానిని మార్చేను.మాఊరు రాజమండ్రికి దగ్గరే .
  @పరిమళ, మీలాంటి సీనియర్లు మెచ్చుకున్నందుకు చాలా ఆనందంగాఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు