=''/>

26, నవంబర్ 2012, సోమవారం

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ " అందించిన మన తెలుగు వాడు..


 భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరు నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.చదువుతుంటే ... చిన్నప్పుడు  బడిలో రోజూ చేసిన " ప్రతిజ్ఞ "  గుర్తొస్తుందా? అప్పుడు అర్ధమయ్యీ  అవ్వక పోయినా ,దాని వెనకనున్న  స్పూర్తి ఇప్పటికీ  వెంటాడుతుంది కదూ!

మన మనసులపై  అంతటి మహత్తర  ముద్ర వేసిన ఈ " ప్రతిజ్ఞ " 1962  లో పుట్టింది .అంటే ఈ ఏడాదితో  ఏభై  ఏళ్ళు పుర్తవుతన్నాయన్నమాట .


పాఠశాలల్లో ఏ విద్యార్ధి నోట విన్నా....ఒకిటో తరగతి నుండి పదో తరగతి వరకూ ఏ పుస్తకం తొలి పేజీలో నైనా కనిపించే ఈ "భారత జాతీయ ప్రతిజ్ఞ" రూపకర్త శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు.


దేశానికి  జాతీయ   పతాకాన్ని అందించినట్లే ...జాతీయ ప్రతిజ్ఞను అందించిన ఘనత మన తెలుగువాడిదే!

ప్రతీ భారతీయుడి  బాధ్యతను గుర్తు చేసేలా  సాగిన ఈ రచన మన జాతీయ గీతం,జాతీయ గేయాల తరువాత స్థానం  సంపాదించుకుని మన తెలుగు 'వాడి' కి ప్రతీకగా నిలిచింది.

 నల్లగొండ సమీపంలోని "అన్నెపర్తి" పైడిమర్రి వారి స్వగ్రామం.


ఈయన  గురించిన  పూర్తి  వివరాలు   క్రింది చిత్రం లో ఉన్నాయి....


 సేకరణ  ఈనాడు  రామోజీరావు  తెలుగువెలుగు  పుస్తకం నుండి ...

13 కామెంట్‌లు:

 1. కొత్త సబ్జెక్ట్ ని షేర్ చేసి చక్కగా వివరించారు.

  రిప్లయితొలగించు
 2. ఇప్పటికైనా వారికి తగిన గుర్తింపు లభించాలి.
  పైడిమఱ్ఱి వేంకట సుబ్బారావు గారికి నమస్సులు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నా బ్లాగ్కి స్వాగతమండి లక్ష్మీదేవి గారు.ధన్యవాదాలు మీ కామెంట్ కి

   తొలగించు
 3. మంచి విషయం చెప్పారండి. నాకు ఇప్పటి వరకూ తెలియదు ఈ విషయం.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నాకూ ఈ పుస్తకంలో చదివే వరకూ తెలీదండి .నాలాగా తెలియని వారికి తెలియచేయాలనే ఈ పోస్ట్ అండి.
   ధన్యవాదాలు.

   తొలగించు
 4. ఇప్పటిదాకా తెలియని మంచి విషయం చెప్పారండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 5. చాలా మంచి విషయం చెప్పారండీ..
  అలాగే మంచి పుస్తకాన్ని కూడా పరిచయం చేశారు.

  రిప్లయితొలగించు
 6. ధన్యావాదాలు రాజ్యలక్ష్మి గారు నా బ్లాగ్ లో మీ మొదటి కామెంట్ కి

  రిప్లయితొలగించు
 7. మంచి విషయం పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 8. చాలా మంచి విషయం తెలుసుకున్నాము, దన్యవాదములు

  రిప్లయితొలగించు