=''/>

4, మే 2013, శనివారం

హ్మ్ ...ఎలాగో నూట ఏభై అయ్యాయి !!

ఇప్పటికి నూట యాబై టపాలు రాసి  ఓ రౌండ్ ఫిగర్ కి వచ్చాను :))

2009 ఆగస్ట్ లో సరదాగా బ్లాగ్ మొదలు పెట్టాను.ఐతే మొదలెట్టాకానీ ,ఏమి రాయాలో  ..ఎలా రాయాలో తెలియక మొదటి రెండు నెలలు ఏదేదో రాస్తుండేదానిని.ఆ సంవత్సరం డిసెంబర్ లో పన్నెండు పోస్ట్లు రాసాను .అవే నా బ్లాగ్ లో ఒక నెలలో ఎక్కువ పోస్ట్లు.

2010 డిసెంబర్ కి వంద టపాలయ్యాయి.ఈ వంద  టపాల్లో (ఇప్పటికీ)నా  రాఖీ పోస్ట్  గురించి  పేపర్ లో వచ్చింది అదే కాస్త గుర్తింపు. నేను బ్లాగ్ రాస్తానని మా చుట్టాల్లో ఎవరికీ తెలియదు.ఆ పేపర్ చూపించి బ్లాగ్ అంటే ఏమిటో చెప్పి మరీ చూపెట్టి ఆనందించాను.


బ్లాగ్ మొదలుపెట్టడం నా ఇంట్రస్టే కానీ ,టైపింగ్ అలవాటు లేని నాకు అన్నీ చెప్పి  నాకు బోల్డంత సాయం చేసి ,ఎంకరేజ్ చేసింది  మాత్రం మా వారు . టైపింగ్ అలవాటు లేక  ఒక్కో పోస్ట్  రాయడానికి గంటలు పట్టేది .రాసిన దాంట్లో  చాలా తప్పులు....నెమ్మిది నెమ్మిదిగా తన సహాయం తో  అలవాటు చేసుకున్నా . ఓ దశలో బ్లాగ్ రాయడం మానేస్తానేమో అనుకున్నా కానీ  మళ్ళి రాయడం మొదలుపెట్టి  లైన్లో పడ్డాను.

నా పోస్ట్ ల్లో   ..మా ఉళ్ళోసంక్రాంతి పండుగ హడావిడిఈ నాలుగు నెలలు ,మా పొలంలో వన భోజనాలు ,ఇలా ఓ పది పోస్ట్లు ...నాక్కూడా ఈ బ్లాగ్  ప్రపంచంలో  కాస్త చోటు కల్పించాయనుకుంటున్నాను .

మొదటి పోస్టుకు  అందులో ఏమీ లేకపోయినా ఎవరో అజ్ఞాత ఏకంగా మీ బ్లాగ్ చాలా బాగుందని కామెంట్ రాసారు.నా పోస్ట్ కి మొదటి  కామెంట్ రాసి కామెంట్ రుచి చూపించిన ఆయనకి  చాలా చాలా ధన్యవాదాలు . .

అలాగే  నా పోస్ట్లకు ఎక్కువగా కామెంట్స్  రాసిన   జయ గారు,వేణు శ్రీకాంత్ గారు,మధురవాణి గారు, ఇందు గారు ,కృష్ణ ప్రియ గారు ,తృష్ణ గారు,మాలా కుమార్ గారు,జ్యోతి గారు ఇలా చాలా మంది ...

నన్ను ప్రోత్సాహించిన   ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. అభినందనలండీ.. మీ పుణ్యమా అని పల్లెటూరి అందాలని, మీ చట్టి తోట పుణ్యమా అని బోల్డు రకాల పువ్వుల్నీ చూసే అవకాశం దొరికింది మాకు. ఇలాగే రాస్తూ ఉండండి. :)

    రిప్లయితొలగించండి
  2. కంగ్రాట్స్ రాధిక గారు :)
    మీరు పోస్ట్ చేసే మీ ఊరు, పొలాల ఫోటోలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకు మీకు థాంక్స్ కుడా :)

    రిప్లయితొలగించండి
  3. కంగ్రాట్స్ రాధిక గారు :)
    మీరు పోస్ట్ చేసే మీ ఊరు, పొలాల ఫోటోలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకు మీకు థాంక్స్ కుడా :)

    రిప్లయితొలగించండి
  4. నూటేభై అయ్యాయని రెస్టు తీసేసుకోమాకండి..

    ఈ వేసవి సెలవుల్లో తీరిగ్గా మరిన్ని ఎక్కువ పోస్టులు వ్రాస్తారని ఆశిస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  5. మధురమాటే నాదికూడానండీ.. మీరు చెప్పే కొన్ని కబుర్లు ఎక్కువగా నాకు నా బాల్యాన్ని గుర్తుచేస్తుంటాయి. మీ బ్లాగ్ కి వస్తే ఎపుడో చిన్నపుడు తిరిగిన అమ్మమ్మ వాళ్ళ ఊరికి తిరిగివెళ్ళిన అనుభూతి వస్తుంటుంది.
    మీకు హృదయపూర్వక అభినందనలు మీరిలాగే మరిన్ని పోస్టులు రాయాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  6. శుభాకాంక్షలు. నాకిష్టమైన బ్లాగుల్లో మీ బ్లాగు ఒకటి. Please keep it up!

    రిప్లయితొలగించండి
  7. అభినందనలు! మరిన్ని మంచి మంచి పోస్ట్ లు మీనుంచి రావాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  8. అభినందనలు రాధిక గారూ.. మీ టపాలు బాగుంటాయి.

    రిప్లయితొలగించండి
  9. వావ్...150 పోస్ట్ లా!!! బంపర్.

    మీ పోస్ట్ లన్నీ కూడా మీ ఊరంత అందంగా ఉంటాయ్. అందుకే నాకంత ఇష్టం. చూస్తూ ఉండండి. ఎప్పుడో మీ ఊరికి వచ్చేస్తాను:)

    మీకు నా హృదయపూర్వక అభినందనలు రాధిక గారు. మీరు రోజూ మా కళ్ళబడాల్సిందే....

    రిప్లయితొలగించండి
  10. మీకు శుభాభినందనలు.
    నేను కూడా మీ బ్లాగ్ రెగ్యులర్ గానే చూస్తాను. వ్రాస్తూనే ఉండండి.

    రిప్లయితొలగించండి
  11. మీ ఊరి ఫోటోలు చాలా బావున్నాయి రాధిక గారు

    రిప్లయితొలగించండి
  12. అభినందనలు మీ టపా చూడగావే మీ పిచుకలు పూలుగురుతుకొసాతయ రాస్తూ .ఉండండి .

    రిప్లయితొలగించండి
  13. @మధురవాణి ,@ఫోటాన్ ,@గీతిక,వేణు శ్రీకాంత్ ,@కృష్ణ ప్రియ ధన్యవాదాలు అందరికి :))

    రిప్లయితొలగించండి
  14. @చిన్ని ఆశ,@శిశిర ధన్యవాదాలు.జయ గారు మా ఊరు మిరోస్తానంటే నేనొద్దంటానా?తప్పకుండా రండి ఒక్క మెసేజ్ ఇవ్వండి చాలు ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  15. @బులుసు సుబ్రహ్మణ్యం,@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,@nagarani yerra ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  16. All the best.
    ఇలాగే ఆనందంగా అందరినీ అలరిస్తూ మీ బ్లాగు కొనసాగాలని మన్స్ఫూర్తిగా ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  17. శుభాభినందనలు, రాధిక గారు.. మీరు చూపించే ఫోటోలు, పంచుకునే విశేషాలతో మీ ఊరినే కాదు కోనసీమనంతా దగ్గరుండి చూస్తున్నట్లే ఉంటుందండీ! థాంక్యూ సో మచ్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు నిషిగంధ గారు ...మాది కోనసీమ కదండీ ప.గొ.జిల్లా లో మెట్ట ప్రాంతం

      తొలగించండి
  18. అభినందనలు రాధిక గారు...

    రిప్లయితొలగించండి
  19. inko post comment ikkada padindi sorry, meeru ennenno postulu wraayaalani manasaaraa aasistoo..ennela

    రిప్లయితొలగించండి
  20. Congrats sister,

    keep going... all the very best ....

    Thanks,
    http://techwaves4u.blogspot.in/
    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    రిప్లయితొలగించండి