=''/>

22, నవంబర్ 2009, ఆదివారం

సుబ్రహ్మణ్య స్వామి షష్టి .

ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్టి .మాజిల్లాలో అత్తిలి లోను ,చాగల్లు లోను షష్టి ఉత్సవాలు (నాకు తెలిసినవి .) బాగాజరుగుతాయి .మాచిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో యాదవోలు అనే ఉరు వెళ్ళేవారము. అక్కడ బాగా జరుగుతుంది. మేము ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు చూసుకొని మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .ఫేమస్ వెంకటరమణ కొత్త సంవత్సరపు కేలండర్ లు ముందు షష్టి దుకాణాల లోకే వస్తాయి .ఇప్పుడు మాఊరు శివాలయము లోసుబ్రహ్మణ్యస్వామిని ప్రతిష్టించారు.ఉదయమే వెళ్లి స్వామిని దర్శించుకొని వచ్చాను .
ఆస్వామి అందరికీ ఆయురారోగ్యాలు ,సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నాను.

1 కామెంట్‌:

  1. మంచిపోస్ట్ వ్రాశారు .ఇలా మేఘాలు కదిలే ఇమేజ్ ఎలాపెట్టారు కొద్దిగా మెయిల్ లో తెలుపగలరు.

    రిప్లయితొలగించు