 మాది  వ్యవసాయ ఉమ్మడి కుటుంబం .మా వారు  బి.బి.ఎం.చదివారు కానీ , ఎరువుల కొట్టు ,వ్యవసాయం  చూ స్తూ ఉంటారు.మా అమ్మగారిదీ ,అత్తయ్య గారిదీ  కూడా మాఊరు  గాంధీనగరమే (ఒకే వీధి . మేనత్తే ).నేనూ డిగ్రీ చదివాను. తీరిక సమయాలలో కుట్లు ,అల్లికలూ చేసుకునే  సామాన్య  గృహిణిని.పదేళ్ళ  నుండి  కంప్యుటర్  ఉన్నా లేని  మార్పు  నెట్ వలన ఈ సంవత్సరం  కలిగింది . బ్లాగ్  ద్వారా మంచి  స్నేహితులను అందించింది.
మాది  వ్యవసాయ ఉమ్మడి కుటుంబం .మా వారు  బి.బి.ఎం.చదివారు కానీ , ఎరువుల కొట్టు ,వ్యవసాయం  చూ స్తూ ఉంటారు.మా అమ్మగారిదీ ,అత్తయ్య గారిదీ  కూడా మాఊరు  గాంధీనగరమే (ఒకే వీధి . మేనత్తే ).నేనూ డిగ్రీ చదివాను. తీరిక సమయాలలో కుట్లు ,అల్లికలూ చేసుకునే  సామాన్య  గృహిణిని.పదేళ్ళ  నుండి  కంప్యుటర్  ఉన్నా లేని  మార్పు  నెట్ వలన ఈ సంవత్సరం  కలిగింది . బ్లాగ్  ద్వారా మంచి  స్నేహితులను అందించింది.   
మా ఊరికి  సంవత్సరం క్రితమే బ్రాడ్‌బాండ్ వచ్చింది .బ్రాడ్‌బాండ్ రాకముందూ  నెట్ఉన్నా   కానీ   పాటలు  ,ఫోటోలు డౌన్లోడ్  చేయడం,ఇలాంటి చిన్న చిన్నవి చేసేదానిని.మాకు బ్రాడ్‌బాండ్ రావటం ,  ఈ నాడు లొతెలుగు  బ్లాగ్ల గురించి రావడం ఒకసారే జరిగింది. ఈ నాడు ఆదివారం పుస్తకంలో  కూడలి గురించి తెలుగు బ్లాగ్ల గురించి చదివాక , రోజూ మన తెలుగు బ్లాగ్లు  చదివేదానిని..అవన్నీ చదువుతుంటే   ...అందరూ  బలే రాసేస్తున్నారు    అనిపించేది.నేను   కుడా  రాస్తే  ఎలా ఉంటుంది  అని  ఆలోచించేదానిని   .కానీ ఏదో మామూలు  డిగ్రీ  చదివి ,  పల్లెటూరి  గృహిణినైన  నేను  రాస్తే ఎవరైనా చూస్తారా?లేక పొతే ,కంప్యుటర్  నాలెడ్జ్ పెద్దగా లేదు ,అవన్ని నాకెలా తెలుస్తాయి .. ఇలా  అనుకునేదానిని.మా వారి తో అంటే ,తను చాలా ప్రోత్సాహించారు .
 బ్లాగ్  రాయటం మొదలు పెట్టానుకాని   కానీ ...మన బ్లాగ్ ఎవరు చుస్తారులే అనుకునేదానిని .అందుకే చాలా రోజులు  హిట్ కౌంటర్,అనుచరులు  గాడ్జెట్  ఇటువంటివేవి  ఉండేవి కావు.కొత్తలో అలానే  ఎవరూ పెద్దగా కామెంట్ లు కుడా రాసేవారు కాదు.చాలా నిరుత్సాహంగా ఉండేది :( .నేననుకున్నట్లే అయ్యిందా, లేకపోతే నేను ఇంకా బాగా  రాయాలా అనుకునేదానిని.ఇప్పుడు పరవాలేదనుకుంటున్నాను.(నిజమేనా? మీరే చెప్పాలి.) 
నిజమేనా ?నేనే బ్లాగ్ రాస్తున్నానా?అనిపిస్తుంటుంది అప్పుడప్పుడ్డు.. నేను బ్లాగ్ రాస్తున్నట్టు  ఎవరికీ  చెప్పలేదు కూడా .మా అక్కలకు,చెల్లికే తెలుసు .నా  రాఖీ టపా  గురించి  పేపర్లో  వచ్చినప్పుడు  పేపర్  చూపించి  చెప్పేను.ఆ టపాచూడని వారు http://saisatyapriya.blogspot.com/2010/08/blog-post_25.html ఇక్కడ చూడొచ్చు . .
 ఎలాగో పడుతూ ...లేస్తూ ...బ్లాగ్ రాయడం  మొదలుపెట్టి ఇప్పటికి సంవతత్సరం  పూర్తి చేసాను. ఇంతకీ అసలు విషయమేమిటంటే  ...నా బ్లాగ్  మొదలు పెట్టి  ఏడాది  అయిందని  చూసుకోలేదు .పాత  టపాలు  చూస్తుంటే  తెలిసింది.అప్పుడే  నేను బ్లాగ్ మొదలపెట్టి   సంవత్సరం  ఐపోయిందా  అనిపించింది..
ఈ మద్యే మా పిల్ల ల పుట్టిన  రోజులు చేసుకున్నాము. మరి  నా బ్లాగ్  నేస్తా లైన  మీ అందరి ఆశిస్సులతో నా  కొత్త నేస్తం  నా బ్లాగ్  మొదటి పుట్టినరోజు  కుడా  చేసుకోవాలిగా. 
 
 
బాగుందండి. మీరు బాగా రాస్తారు. శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఅభినందనలు రాధిక గారు.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ దినోత్సవ శుభాకాంక్షలండి. ఇలానే ఇంకా బోలెడన్ని పోస్ట్ లతో ....
రిప్లయితొలగించండిశుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిCongratulations Radhika! Your blog is really inspiring. మీ బ్లాగ్ గురించి నేను మా ఇంట్లో వాళ్ళకి మొన్నీ మధ్యే చెప్తూ ఉంటాను.
రిప్లయితొలగించండిAll the best,..
Krishnapriya/
రాధిక గారు మీ బ్లాగుకి నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..మీరింకా మరెన్నో మంచి టపాలు రాసి మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను
రిప్లయితొలగించండిమీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క...
రిప్లయితొలగించండిరాధిక గారు, శుభాకాంక్షలందుకోండి. మీ బ్లాగ్ చూడక పోవటమేమిటండి. అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా, అనిపిస్తోంది. ఇంకా ఏమేం రాస్తారో రాసేయండి మరి. వైటింగ్ ఈగర్లీ.
రిప్లయితొలగించండిమీ బ్లాగుకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలండీ.
రిప్లయితొలగించండిబ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిమీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు!!
రిప్లయితొలగించండిచాలా సంతోషమండి. వార్షికోత్సవ సందర్భంగా శుభాభినందనలు.
రిప్లయితొలగించండిCongratulations...All the best!
రిప్లయితొలగించండిమీరు రకరకాల postలతో భలే రాస్తారండీ. Congrats and All the best. మీ పెరటిలో పువ్వుల్ని ఫొటో తీసి పెడతారే ఆ పూలన్నీ నాకు భలే ఇష్టం. నాకు కూడా పల్లే జీవితమే నచ్చుతుంది.
రిప్లయితొలగించండిమీకు మీ బ్లాగ్ కు శుభాకాంక్షలు .మీరు చేసిన మీ పరిచయం బాగుంది
రిప్లయితొలగించండి@శిశిర,@వేణు శ్రీకాంత్ ,@బావన ,@చెప్పాలంటే థాంక్స్ అండి మీ శుభాకాంక్షలు కు.
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ గారు ధన్యవాదాలండి.@రామ కృష్ణ గారు థాంక్స్ అండి.
థాంక్స్ నాగార్జున .జయ గారు,మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి@౩జి ,@శ్రీ లలిత ధన్యవాదాలండి
@సునీత,@కొత్తపాళీ @ధరణి రాయ్ చౌదరి గారు చాలా థాంక్స్ అండి శుభాకంక్షలు అందజేసిందుకు .
@ప్రసూన,@బానుధన్యవాదాలుఅండి .
మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలండీ.. మీరిలాగే మంచి మంచి టపాలతో అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను...
రిప్లయితొలగించండి..అన్నట్టు నిన్ననే ఇక్కడ వ్యాఖ్య పోస్ట్ చేశానండీ, కనిపించలేదు ఎందుకో..
మీరు ఇలాగే మంచి మంచి టపాలు రాయాలని మనసారా కోరుకుంటున్నాను రాధిక గారు ....మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు!!
రిప్లయితొలగించండి.మీ వ్యాఖ్య కనపడలేదండి.థాంక్స్ మురళి గారు మళ్లి వ్యాఖ్య రాసినందుకు.
రిప్లయితొలగించండితనస్ దివ్య వాణి గారు..
రాధిక(నాని ) గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు
రిప్లయితొలగించండిహారం
రాధిక గారు...కొంచెం లేటు గా మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను :)మీరు ఇలాగే మంచి మంచి టపాలు రాయాలని ఆశిస్తున్నాను...
రిప్లయితొలగించండిఅక్కోయ్ .. హ్యాపీ బర్త్ డే టు నీ బ్లాగు ..
రిప్లయితొలగించండిరాధిక గారు కొంచం లేట్ గా బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలండి .
రిప్లయితొలగించండి@ఇందు,@ నీ కోసమే నా అన్వేషణ,@ మాలా కుమార్ ,మీ శుభాకంక్షలకి నా ధన్యవాదాలు .
రిప్లయితొలగించండి