=''/>

30, ఆగస్టు 2010, సోమవారం

మా సీమ టపాకాయ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఎవరా సీమ టపాకాయ ?అనుకుంటున్నారా .......


ఇంకెవరూ .........మా సిసింద్రీ,చీలి చింతకాయ ,సీమ టపాకాయ అన్నీ మా అమ్మాయి.... " సత్యప్రియ". .

తన" పుట్టినరోజు " ఈ రోజు.

తను  హాస్టల్ లో ఉంటుంది. 

మేముండేది పల్లెటూరు కావడం వలన కొంచెం మంచి స్కూల్ లో చదివించాలంటే హాస్టల్ లో చేర్చక తప్పదు. తనని ఫిఫ్త్ క్లాస్ కొచ్చాక హాస్టల్ లో పెట్టాము.హాస్టల్ లో జేర్చాక చాలా రోజులు తన మీద బెంగగా ఉండేది. రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు ఏడ్చేసే దానిని. కొద్ది రోజులకు అలవాటు పడిపోయాననుకోండి .కొత్తల్లో ఐతే హాస్టల్ కి చూడడానికి వెళితే అదేడుస్తుంటే నాకు కూడా ఏడు పోచ్చేసేది.మా ఇద్దరినీ చూసి అక్కా వాళ్ళు నవ్వేవారు .నన్ను తిట్టేవారు..నువ్వు దానిని చూడడానికి వస్తున్నావా ...ఏడిపించడానికి వస్తున్నావా అని .

దానికి కుడా ఇంటి బెంగ బాగాఎక్కువ . .ఇంటికొచ్చి వెల్లినప్పుడుల్లా కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని వెళ్ళేది. వాళ్ళ హాస్టల్ పక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి .అక్కడికి వచ్చేయండి అంటుంది .అక్కడికి వస్తే ఎలా ఉంటుందో ఉహించుకుని ఆనంద పడుతుంటుంది పాపం .మేము అక్కడికి రామని తెలుసు ఐనా అదో తుత్తి దానికి .ఈ మధ్య ఓరోజు నువ్వు ఇంటర్ లో హాస్టల్ కి వెళ్ళావ్ ,మరి నన్ను ఫిఫ్త్ లోనే ఎందుకేసారు .అని అడిగింది . కాసేపు ఏమి చెప్పాలో తెలియలేదు .తరువాత ఏదో సర్ది చెప్పననుకోండి .. ఈ మధ్య పరవాలేదు కొంచెం తెలుసుకుంది .ఏడవకుండా వెళుతుంది ..ఫోన్ చేసినా బాగా మాట్లాడుతుంది .

ఈ రోజు మా " ప్రియ " పుట్టినరోజు కదా  హాస్టల్ కెళ్ళి  కేక్ కట్ చేయించాలి .సాయంత్రం వరకూ దానితో గడిపి రావాలి .


బంగారం నువ్వు ఇటువంటి వంటి పుట్టినరోజులు జీవితాంతం జరుపుకోవాలని ఆశిస్తూ ...................

ఆ బగవంతుడు నీకు ఆయురారోగ్యా లందించాలని మనఃపూర్వకం గా కోరుకుంటూ ...........


ప్రియమ్మలూ పుట్టినరోజు శుభాకాంక్షలు రా.......................

23 కామెంట్‌లు:

 1. మీ సీమ టపాకాయకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
  -సుధాకర్

  రిప్లయితొలగించండి
 2. సత్యప్రియ బంగారానికి జన్మదిన శుభాకాంక్షలు,నాకన్నా ఓరోజు చిన్నదన్నమాట :)

  రిప్లయితొలగించండి
 3. మీ సత్యప్రియ కు జన్మదిన శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించండి
 4. సత్య ప్రియ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 5. సీమ టపాకాయ( " సత్యప్రియ". .) పుట్టిన రోజు కు నా శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 6. Dear Priya, I wish you a very happy birth day. Have a nice time & enjoy yourself. Jaya Aunty.

  రిప్లయితొలగించండి
 7. సత్య ప్రియ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు :-)

  రిప్లయితొలగించండి
 8. @చెప్పాలంటే,@మంజు ,@సుదాకర్ ,@గీతిక ,@జ్యోతి, ధన్యవాదాలండి మా చిన్నారికి శుభాకాంక్షలు అందజేసినందుకు.
  @విజయ్ మోహన్ గారు ఐతే మీకు లేటుగా చెబుతున్నానండి పుట్టినరోజు శుభాకంక్షలు. క్షమించండి..థాంక్సండి మా బంగారానికి శుభాకాంక్షలుచెప్పినందుకు.

  రిప్లయితొలగించండి
 9. @శ్రీ థాంక్సండి నా బ్లాగ్ మీకు నచ్చినందుకు,అలాగే శుభాకాంక్షలుతెలియపరచినందుకు.
  @మలాకుమార్ ,@దుర్గేశ్వర ,@మహా,@శ్రీకర్ బాబు,@దివ్యవాణి ధన్యవాదాలండిఅప్యాయంగా మా పాపకు ఆశిస్సులు అందించిందుకు.

  రిప్లయితొలగించండి
 10. థాంక్స్ నాగార్జున, జయగారు ,మీ విషెస్ కి ధన్యవాదాలండి.
  @రాణి,@వేణు శ్రీ కాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిజేసినందుకు ధన్యవాదాలండి .
  మీరంతా ఇలా ప్రేమగా శుభాకాంక్షలు అందజేశారని మా పాపకి ఫోన్ లో చెబితే చాలా సంతోషిచింది.తను మీ అందరికీ చాలా...........చాలా............థాంక్స్ అని చెప్పమంది.

  రిప్లయితొలగించండి
 11. "చీలి చింతకాయ" చాన్నాళ్ళైంది ఈ మాట వినపడి ...మీ సిసింద్రీకి కాస్త ఆలస్యంగా Happy birthday!

  రిప్లయితొలగించండి
 12. ii madhya chaalaa rojulu blog lo post lu rayaledu. appudu tana birthday vacchindi anduke ...

  రిప్లయితొలగించండి