=''/>

23, అక్టోబర్ 2011, ఆదివారం

ఆరునెలలవిరామం తరువాత

హాయ్!ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?

చాలా రోజుల తరువాత నా బ్లాగ్ మిత్రులందరినీ కలుస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది :)))).

మీ అందరి బ్లాగ్లూ చదువుతూ ....నేనూ బ్లాగ్ రాయడం ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టాను .నెలకి కనీసం ఆరేడు టపాలైనా రాస్తూ.... మీ కామెంట్ల ప్రొత్సాహంతో ,ఇంకా బాగా రాయాలనుకుంటూ ఉండేదాన్ని.

ఈ అక్టోబర్ కి నా బ్లాగ్ మొదలపెట్టి రెండేళ్ళైంది.

ఈలోపే నా బ్లాగ్ పోస్ట్లుకి మరీ ఇంత పెద్ద విరామం వస్తుందని అస్సలు అనుకోలేదు.ఏప్రియల్ నెలలో పిల్లల పరిక్షలు, మే నెలలో పెళ్ళిళ్ళు, సెలవల హడావిడి .... పిల్లల బళ్ళు తెరిచారు ఇక బద్దకించకుండా రాయాలి అనుకొన్నాను ... ఓ అనుకోని సంఘటన! ఇన్ని రోజులూ బ్లాగ్ ప్రపంచానికి దూరంగా ఉండేలా చెసింది.

నా బ్లాగ్ ప్రపంచంతో,మీ అందరితో... మరిన్ని రోజుల విరామం తప్పదు:(((( ...

బై బై ఫ్రెండ్స్ .

13 కామెంట్‌లు:

 1. స్వాగతం. వెల్కమ్ బాక్.

  మీ బ్లాగు రెండవ పుట్టిన రోజుకు శుభాభినందనలు

  రిప్లయితొలగించు
 2. ఈ మద్యనే అనుకున్నాను మీరు కనిపించటం లేదని . ఎలావున్నారు ?
  మీ బ్లాగ్ రెండో జన్మదిన శుభాకాంక్షలు .

  రిప్లయితొలగించు
 3. సుస్వాగతం! మీ బ్లాగు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు . మీ లాంటి వారి స్ఫూర్తి తో నేను కూడా సరదాగా వ్రాస్తున్నా.బ్లాగు URL :http://phani-flyingbirds.blogspot.com/
  వీలైతే చూడండి.

  రిప్లయితొలగించు
 4. Congrats!eamaindi mee blog kanipinchaDamlaedu anukunnaanu!welcome back!

  రిప్లయితొలగించు
 5. మీ బ్లాగు రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంధర్భంగా అభినందనలు రాధిక గారు...
  వేసవి సాయంత్రం కురిసే చిరుజల్లులు అందించే మట్టివాసనని.. ఙ్ఞాపకాల పూల పరిమళాలనీ మిస్ అవుతున్నాం.. సాధ్యమైనంత త్వరలో తిరిగి వస్తారని ఆశిస్తూ..

  రిప్లయితొలగించు
 6. హృదయ పూర్వక శుభాకాంక్షలండి. మిమ్మల్ని నిజంగానే చాలా మిస్ అవుతున్నానండి. తొందరగా బోలెడు కబుర్లతో వచ్చేస్తారుగా.

  రిప్లయితొలగించు
 7. మీ బ్లాగు రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంధర్భంగా అభినందనలు !

  హాయిగా బ్లాగ్ లేని లోకం లొ ఉండక ఇలా మరి ఊడిపడ్డారెమిటండీ? ఇది ఒక పెద్ద వ్యసనం ! ఎంత దూరం గా ఉంటె అంత మంచిది ! చూడండి, పైన బులుసు గారు వెంటనే వెల్కం అనేసారు. ( మైకం లో ఉన్నదిలే మజా అంటార ఐతే నొ ప్రాబ్లెం ! వెల్కం అగైన్ అండ్ అగైన్ !)

  రిప్లయితొలగించు
 8. రాధికగారూఊఊ....ముందుగా కంగ్రాట్స్...మీ బ్లాగుకి రెండేళ్ళు నిండినందుకు :) మీరు మళ్ళీ వచ్చేసారని ఏంతో ఆనందంగా మీ బ్లాగ్ తెరిస్తే...ఇంకా కొన్నాళ్ళు విరామం అంటారా?? :(((((...సరేలెండీ.... ఈ విరామానికి తొందరగా విరామిచ్చేయండి మరి. వేణూ చెప్పినట్టు మీ అచ్చమైన,స్వచ్చమైన పోస్ట్లు మిస్ అవుతున్నాం!! వీలు చూసుకుని వచ్చయండేం!! :)

  రిప్లయితొలగించు
 9. రాధిక గారూ!మీ బ్లాగు రెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు శుభాకాంక్షలు.కానీ మరీ తోటకూర విత్తనమై పోయారు సుమా!పుట్టిన రోజు కదా అని ఊడి పడ్డారా!ఇది న్యాయమా?ధర్మమా?అని నేను ప్రశ్నిస్తున్నాను.
  మరొక్క సారి శుభాభినందనలతో మరిన్ని మంచి విషయాలు బ్లాగర్లకి అందించాలని కోరుకునే మీ,
  సోమార్క

  రిప్లయితొలగించు
 10. మీ బ్లాగుకు రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు రాధిక గారూ. చాలా ఆలశ్యమైంది... ఇప్పుడే చూశాను.
  మీ విరామానికి కారణమైన అనుకోని సంఘటన కాలంలో కలిసి రూపుమాసిపోవాలని కోరుకుంటున్నాను.

  మీరు మళ్ళీ మీ పోస్టుల్తో ఇదివరలా స్వచ్ఛమైన పల్లెగాలిని, పల్లె వాతావరణాన్ని మాకు పంచాలని ఆశిస్తూ..

  గీతిక

  రిప్లయితొలగించు