=''/>

3, అక్టోబర్ 2012, బుధవారం

మా ఇంట్లో జీవ వైవిధ్యం



మన సంప్రదాయంలో ముగ్గులు వేయడం వెనక జీవ కారుణ్య సూత్రం దాగి ఉంది.

ఒకప్పుడు వాకిలంతా పెద్ద పెద్ద ముగ్గులు బియ్యం పిండితో వెసేవారు. ముగ్గు వేయడానికి బియ్యం  పిండి నే  వాడేవారు.అది  ఇంటి ముంగిలికి అందాన్నే కాదు,చీమ లకు ,పిచుకలకు ఆహారంగా  కూడా  ఉండేది.

చీమలు ఆహారం కోసం  ఇంట్లోకి  బారలు తీరకుండా ఒకే చొట వాటికి ఆహారం అందించే యుక్తి ఇదన్నమాట. అంత ఆహారం దొరికితే ఇంట్లోకి ఎందుకు దాడి చేస్తాయి?


 అన్నిట్ట్లోనూ మార్పు వచ్చినట్లే దీనిలోనూ మార్పొచ్చింది. పల్లెల్లో కూడా   ఇప్పుడు వాకిళ్లన్ని చాలా వరకూ సిమెంట్ గచ్చులే ముగ్గు సున్నం పిండి,రాతి పిండి తోనే..  అప్పుడప్పుడు  బియ్యం పిండితో పెడున్నాము.






  రోజూ  ఇలా బియ్యం పిండి తో ముగ్గు పెడితే  ....







ధాన్యపు గదిలో వడ్లు ఉన్నన్ని రోజులూ గది  వద్దకు  పిచుకలు సందడిగా వస్తూనే ఉంటాయి..



ఎండిన మొక్కజొన్నలు   ఉడుతల   కోసం  దాచి పెడుతుంటా...పిల్లలు  సరదాగా నేనంటే నేనని
పెడుతుంటారు.కాకులు  రాకుండా కాపలాకాసి  ఉడుతలకే పెడతారు.





అమ్మో! ఉడుతలను ఫోటో  తీయాలంటే చాలా కష్టం.  ఏ కాస్త సడై నా  వెళ్ళిపోతాయి.ఈ ఫొటోలు   తీయడానికి అరగంట కదలకుండా కూర్చున్నాను.ప్చ్ .. అంత కష్టపడినా   ఫోటోలు  బాగా రాలేదు  .





దాన్యపు  గదికి ఉండే  తలుపు సందుల్లో నుండి బయటకి వచ్చే  వడ్లు చాలు వాటి బుల్లి బొజ్జలకి .



  మా ఇంటి చుట్టూ ఉండే  కాకులు,పిచుకలు,ఉడుతలు,గోరింకలు   మంచినీళ్ళ  కి ఇలా వస్తుంటాయి.కానీ  కెమెరాకి  ఇదే చిక్కింది.

 మన హైదరాబాదు లో  జీవ వైవిధ్య సదస్సు జరుగుతుంది కదా .. రోజూ  పేపర్,టీవీల్లో   చదువుతూ ,చూస్తూ  మా ఇంట్లో ని జీవ వైవిధ్యం గురించి  చెప్పాలనుకన్నాఅంతే  ...







20 కామెంట్‌లు:

  1. అద్భుతం ...
    మంచి ఫోటోలు తీసారు...
    కళాసాగర్

    రిప్లయితొలగించండి
  2. చిరు జీవులకి మీ సహాయం చాలా బాగుందండి. ఎంతో పుణ్యం.

    రిప్లయితొలగించండి
  3. పశ్చిమగోదావరిజిల్లాలో గాంధీనగరం ఎక్కడ వుంది ?

    రిప్లయితొలగించండి
  4. మీ ఇల్లు, జీవవైవిధ్యం అన్నీ బాగున్నాయండి.

    రిప్లయితొలగించండి
  5. ఉడుతల ఫోటోలు బాగానే ఉన్నాయికదా!

    రిప్లయితొలగించండి
  6. చాలాబాగుందండీ... వాటిని విసుక్కుని అదిలించకుండా చక్కగా ఇలా ఎంటర్ టైన్ చేయడం గ్రేట్.

    రిప్లయితొలగించండి
  7. ఉడుతలను, పిచ్చికలని చూసి చాలాకాలం అయ్యింది. మీ పోస్ట్ బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. మీ సహ జీవులపట్ల మీరు చూపే ఆదరణ మెచ్చుకోదగినది.-రామకృష్ణ

    రిప్లయితొలగించండి
  9. ఫోటోలు బావున్నాయండీ..

    రిప్లయితొలగించండి
  10. మీ ఇల్లు భూమ్మీదే వుంది, అందుకే హాయిగా వుంటుంది, జీవవైవిద్యం కనిపిస్తుంది :) మా గూడు భూమికి 30-40 అడుగుల ఎత్తు, త్రిశంకు గూడనుకోవచ్చు. :(
    ఎప్పుడైనా భూమి మీద మారు మూల అడవిలో వుండాలని నా కల, ఈ జన్మకిదే ప్రాప్తం, నా ఆశ తీరదేమో.

    రిప్లయితొలగించండి
  11. కాకి ఒకటి నీళ్ళకూ
    కావు కావు మనుచునూ

    అ కాకమ్మ నాకు నచ్చింది, పాపం. ఓ గిన్నెలో నీళ్ళుంచాల్సింది.

    రిప్లయితొలగించండి
  12. @కళాసాగర్,@మధుమోహన్ధ@సుభగారు నా బ్లాగ్ కి స్వాగతమండి.మీ కామెంట్ కి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @anrd,ధన్యవాదాలండి.

    తేజస్వి గారు ,వెలుగు బాగా ఎక్కువగా ఉండి,ఫొటొలు క్లారిటీగా లేవండి. ధన్యవాదాలండి.

    వేణూ శ్రీకాంత్ గారు,నా బ్లాగ్ లో మీ కామెంట్ చూసి చాలా రోజులైందండి.ధన్యావాదాలండి.
    Dantuluri Kishore Varma గారు, ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  14. అజ్ఞాత గారు,రామకృష్ణగారు , తృష్ణగారు ధన్యవాదాలండి.

    అజ్ఞాతగారు మీ ఆశ, మీ కల ఎప్పటికైనా ఈ జన్మలోనే నిజమవ్వాలని కోరుకుంటున్నానండి:).అక్కడ చిన్న గుంట లాగా ఉంటుందండి అందులో నీళ్ళు తాగుతాయి .ధన్యావాదాలండి మీ కామెంట్ కి.

    రిప్లయితొలగించండి
  15. మీరు తీసిన ఫోటోలే ఎక్కువ మాట్లాడేయేమో! చాలా బాగుంది జీవ వైవిధ్యం.

    రిప్లయితొలగించండి
  16. మీ ఇంటికోసారి రావలనుంది రాధిక గారు.

    రిప్లయితొలగించండి
  17. ఫొటోలు, మీ వివరణ రెండూ బాగున్నాయండి..

    రిప్లయితొలగించండి