=''/>

30, మార్చి 2013, శనివారం

పచ్చిక....పచ్చపూలు

పొద్దుపొద్దున్నే కాసేపు అలా మొక్కల్లోకి వెళ్ళా...

పచ్చని పచ్చిక,ఆ పచ్చిక పై  ముత్యాల్లా మెరుస్తూ  మంచు  బిందువులు ,అక్కడక్కడా రాలిపడిన పసుప్పచ్చ  పువ్వులు   ....అంతందమైనదృశ్యాన్ని చూడటానికి రెండుకళ్ళు చాల్లేదంటే నమ్మండి!

వెంటనే ఆ అందాల్ని నా  మూడో కన్నుతో బంధించేసి ఇలా మీక్కూడా  చుపించేస్తున్నా....























7, మార్చి 2013, గురువారం

విద్యుత్ కోతలు ...నా ఫొటోలు

ఈ ఏడు  కురిసిన అంతంత మాత్రపు వర్షాలకు కరెంట్  ఉత్పత్తి తక్కువగా ఉందని అనధికారికంగా  కోతలు మాకు   అక్టోబర్ నుండే  మొదలైపోయాయి.

  ఒక వారం.. ఉదయం ఆరు గంటలకు తీసి  పదకొండు గంటలకు కరెంట్ ఇస్తారు . ఒక వారం  పదకొండు గంటలకు తీసి సాయంత్రం ఆరు గంటలకు ఇస్తారు.ఇది  మా పల్లెల్లో  ఎప్పుడూ ఉండేదే .


ఇప్పుడు  పల్లెలకు పూటంతా కరెంట్  కోత అంటున్నారు. పల్లెల్లో ఉన్న వాళ్ళు  ఏం పాపం చేసుకున్నారో !


  మాకు పొలాలకు, ఊళ్ళకు ఒకటే   లైన్లు ఉండటం వల్ల  పగలు ఏదో  రెండు గంటలుంటుంది లెండి . పొలాలకి   కరెంటు ఇచ్చినప్పుడు  మాకూ ఇస్తారు . ఈనెలా పోతే ఎండలు ఇంకా పెరుగుతాయి  ...కోతలు ఇంకా పెరుగుతాయి.అప్పుడు రాత్రుళ్ళు కూడా నాలుగైదు గంటలు తీసేస్తుంటాడు .  ఏం చేస్తాం !కాసేపు తిట్టుకుని  అలా ఉండటానికి అలవాటు పడిపోతాము .


కరెంట్ ఎప్పుడిస్తాడా అని ఎదురుచూస్తూ , ఏదోక కాలక్షేపం చేస్తూ  మధ్య మధ్య లో ఇలా కెమెరా కి పని కల్పిస్తుంటా !



పాపం గోరింక ! దాని కాళ్ళకున్న వెంట్రుకలు చూసారా ?అస్తమాను వాటిని నోటితో  లాక్కుంటూ ,కుంటుకుంటూ తిరుగుతుంటుంది .









 కాకి ఒకటి నీళ్ళకు కావు కావు మనుచు!
















మా  వీధికుక్కపిల్లలు .పిలిస్తే వచ్చేస్తాయి. సాయంత్రం కాసేపు  వాటితో కాలక్షేపం .

18, ఫిబ్రవరి 2013, సోమవారం

మంచు కురిసే వేళలో...( మా ఊరి అందాలు )



ఈ రోజు ఉదయం మంచు మా ఊరిని ఎంతగా కమ్మేసిందంటే... తొమ్మిదైనా సూర్యుని జాడే లేదు. నిన్న మొన్న వర్షం పడటం వలన అనుకుంటా!

అలా కమ్ముకున్న పొగమంచులో  మా ఊరి పరిసరాలను చూస్తూ ....  మా ఊరు   ఊటీ  కో అరకు కో దగ్గరలో ఉంటే  ఇలా  ఉంటుందా....అనుకుంటూ అలా  ..అలా... కాసేపు ఊహల్లో  తేలిపోయా :) 

 చుట్టూ ఇంతందమైన  ద్రుశ్యాలుంటే ,నిషిగంధ గారి  లాంటి వాళ్ళైతే  చకచకా  కవితలల్లేసి  మనందరికీ  వినిపించేద్దురు .

  ఇంటువంటి  ఉదయాన్ని  చూస్తూ కనీసం    కవితలో క కూడారాయలేను  కానీ    కాసిన్ని చిత్రాలన్నా తీసి తృప్తి  పడదామని ,మేడెక్కుతూ ,దిగుతూ ,మధ్య మధ్యలో  వంటగదిలో  స్టౌ మీద మాడిపోయినవి దించి  అటుతిరిగి...అటుతిరిగి  ఎలాగోలా  తీసేసేను .





















 














8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రాలిన పూల అందాలు

భూమాతకు కృతజ్ఞతగానా అన్నట్టు ,  పూల మొక్కలు రోజూ  పూసిన పువ్వులన్నీ తనకే ఉంచుకోకుండా విరిసిన పూలలో  కొన్ని పువ్వులను  ఇలా రాలుస్తుంటాయా  అనిపిస్తుంది .

  పువ్వులు కొయ్యడానికి   వెళ్ళేటప్పటికి  ఎండిన ఆకులమీద ,నేలమీద ,కొమ్మల్లోను  ఎవరో కోసి పెట్టినట్టు అందంగా రాలి కనపడుతుంటాయి .

ఇలా వాటిని చూస్తుంటే నా చెయ్యి ఎలా కుదురుగా ఉంటుంది?రోజూ  పువ్వుల కోసం బుట్ట ,దానితో పాటు కెమెరా ఉండాల్సిందే!
































4, ఫిబ్రవరి 2013, సోమవారం

ఏనుగు తొండం పువ్వు మొక్క చూసారా?




 ఈ పువ్వు  ఏనుగు తొండం ఆకారం లో ఉంది  కదా! అందుకే ఏనుగు తొండం పువ్వు మొక్క  అంటారేమో!


 దీనిని కత్తి మందాకు అనికూడా  అంటారని  ఈ మధ్యే తెలిసింది. 

పేరులోనే  ఉంది కదా!మందు.ఈ మొక్క ఆకులు నూరి గాయాలకు మందుగా వాడతే  తొందరగా నాయమవుతాయంట .పొలాల్లో  పనులు చేసేటప్పుడు  అయ్యే గాయాలకు  ఇవి చాలా బాగా పని చేస్తాయంట.

 ఈ మొక్క మా పేరడ్లో  లేచింది.ఆకులు  బాగున్నాయని ,కలుపు మొక్కలుతో  పాటు తీసేయలేదు .పువ్వులు పూచాక ఈ మొక్క గురించి తెలిసి....ఇలా నా కంటికి (కెమెరా)చిక్కి మీ ముందుకు  వచ్చింది.