=''/>

21, డిసెంబర్ 2009, సోమవారం

చెడ్డ సోమవారం .

ఈ రోజు రెండు చెడ్డ విషయాలు జరిగాయి .

ఒకటి , మా చెరుకుతోట కు నిప్పంటుకుని కాలిపోయింది . మా చెరుకుతోట

దగ్గరలో ,వేరే వాళ్ళ పొలములో తుక్కుకి నిప్పు పెడితే అదికాలి అలా అలా

మాతోట కూడా అంటుకుందంట. గాలి కూడా బాగా ఉండటముతో మంటలు

తోందరగా ఎగబాకి కాలిపోయింది . చెరుకు కొట్టే కూలీ లు నాలుగురూజులు
నుండి ఈ రోజు వస్తాము ,రేపోస్తాము .. అని చెప్పి రాలేదు .
లేకపోతె కొట్టడము అయిపోను .రైతు పరిస్తితి ఇంతే కదండీ . ఎలాగో వర్షాలు
లేకపోయినాకష్టపడి పెంచితే ,సరిగ్గా కొట్టే టైంకి కాలిపోయింది .

రెండోది , మాకు తెలిసిన కరెంట్ లైన్మన్ షాక్ కొట్టి చనిపోయాడు .వాళ్ళ నాన్న

మాపొలము వచ్చేవాడు . ఈ అబ్బాయి చాలా కష్టపడి పైకివచ్చాడు
.
మధ్య ఎవరిదో పొలము కౌలుకి తీసుకొని వాళ్ళ నాన్న తో వ్యవసాయం

కూడా చేయిస్తున్నాడు .ఆ కౌలు తీసుకొన్న పొలము లోనే ట్రాన్స్ ఫారం

బాగు చేస్తుంటే ఇదిజరిగింది.విన్న మాకు చాలా భాద కలిగింది .

7 కామెంట్‌లు:

  1. అయ్యో !

    నిజంగా మీరు రెండు బాధాకరమైన విషయాల చెప్పారు.

    రిప్లయితొలగించు
  2. మా బాధను పంచుకొని, సానుభూతిని తెలియజెసిన మీ అందరికీ నా కృతజ్ఞతలండి.

    రిప్లయితొలగించు