=''/>

19, జనవరి 2010, మంగళవారం

సంక్రాంతిపండుగ -అరిసెలు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా పల్లెటూర్లలో రకరకాల పిండివంటలు చేస్తారనీ , అరిసెలు వండని ఇల్లు ఉండదనీ అందరికీ తెలిసిన విషయమే .
మా ఊళ్ళోనూ అంతే .సంక్రాంతి పండుగకు వారం ముందుగానే ప్రతీ ఇంటిలోనూ అరిసెలు వండే హడావిడి మొదలవుతుంది . రోజూ ఎవరో ఒకరి ఇంటినుండి రోకళ్ళతో పిండి దంచుతున్న చప్పుళ్ళు వినపడుతూ ఉంటాయి .పిండి ఆడే మిల్లు ఉన్నా కానీ రోట్లో దంచిన పిండి తోనే అరిసె లు బాగా వస్తాయని, చాలా మంది ఇలానే చేస్తారు .మేముకూడా అలాగే చేసాము . ఉదయము ఐదింటికి పిండికొట్టించడముతో మొదలైన మా అరిసెల వండే పని సాయంత్రం నాలుగింటికి అయ్యింది .కొన్ని నేతి తోను, కొన్ని నూని తోనూ వేసాము .అత్తయ్య వేస్తే నేను తీసేను. మద్యలో ఫోన్ వస్తే మాత్రం చాలా విసుగొచ్చేది .ఈ ఫోన్ కనిపెట్టిన వాడిమీద చాలా కోపమొచ్చింది .పండుగ నాలుగురోజులూ ఇంటికి ఎవరు వచ్చినా అరిసెలే పెట్టడము.

2 కామెంట్‌లు:

  1. mi post chala bavundandi..nenu sankranthi mida post rasanu na blog lo..kani mi post chaduthunte...na chinanati vishaylu gurthosthunnai...pindi kottatam..ammamma vallu jallinchatam..rokali sounds..hmmm bavundandi

    రిప్లయితొలగించు
  2. రెండేళ్ళ క్రితం వరకూ నేనూ చేసానండి అరిసెలు చక్కిలాలు . ఈ రండేళ్ళ నుండి పిండి కొట్టే వాళ్ళు లేక చేయటము లేదు . ఇప్పుడు బజార్లో తెచ్చుకోవటమే .

    రిప్లయితొలగించు