=''/>

1, జనవరి 2011, శనివారం

మేమూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుక చేసుకున్నామోచ్!పట్నాలలోనే కాదండోయ్ మా వైపు పల్లెల్లో కూడా" నూతన సంవత్సర స్వాగత వేడుక"లు ఈ మధ్య చేసుకుంటున్నారు. మా ఉళ్ళో కుర్రకారు అబ్బో మందు తో కూడిన విందు తో బాగానే చేసుకుంటారు ప్రతి సంవత్సరం .


ప్రతీ న్యూ ఇయర్కి ముగ్గులేసి రంగులేయడము,ఫోన్లో అందరికీ శుభాకాంక్షలు చెప్పడం ఇదే మా కొత్త సంవత్సరపు వేడుక . ముందురోజు రాత్రే ముగ్గులు వేసేస్తాము.ముగ్గేయడం కాస్త లేటైతే మా సాయి గొడవ భరించలేము..మన వీధిలో అందరూ ముగ్గులేసేరు..మనమే ఇంకా వేయలేదు అంటూ నన్ను తినేసి నాతొ ముగ్గేయించి ...ఒకగంట కస్టపడి రంగులేస్తేనే కానీ వాడికి తృప్తిగా ఉండదు.

మా ఊర్లో "పైవీధిలో" (అంటే మా ఊరి నాలుగు వీధులలోను చివరి వీధన్నమాట ) కోడళ్ళ బాచ్ ( యూత్) పెద్దదే ఉంది . వాళ్ళు ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటారంటారు. ఈ సారి మావీధిలోనే రజని వాళ్ళింటి వద్ద చేస్తున్నామని పిలిస్తే రాత్రి వెళ్లేము .అబ్బ! చాలా రోజుల తరువాత" కొత్త సంవత్సరం " కి స్వాగతం పలకటానికి పన్నెండింటి వరకూ ఉన్నాను. రకరకాల ఆటపాటలతో ఆద్యంతం " ఉల్లాసంగా ఉత్సాహంగా" గడిపేసేము.

బ్లాగ్ మిత్రులందరికీ ,వారి కుటుంబ సభ్యులకి ఈ" నూతన సంవత్సరం" అన్ని వేళలా శుభాలను ,ఆయురారోగ్యఐశ్వర్యాలను అందజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..

"నూతన సంవత్సర శుభాకాంక్షలు".

16 కామెంట్‌లు:

 1. Wish you and your family a Happy & Prosperous New Year.

  రిప్లయితొలగించు
 2. గ్రీటింగ్ కార్డ్ బాగుందండి. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు సుదినం అంటే బాగుండేదేమో.

  రిప్లయితొలగించు
 3. మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించు
 4. బాగుందండి, మీకూ మీకుటుంబానికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

  రిప్లయితొలగించు
 5. మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాధిక గారు.

  :-) కుర్రాళ్ళ మందు విందు చెప్పారు కానీ ...రాత్రి పన్నెండు దాటాక బైక్‌ల మీద తిరుగుతూ చెసే హడావుడి గురించి రాయలేదు.

  రిప్లయితొలగించు
 6. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 7. మీ ఇంటిల్లిపాటికీ
  నూతన సంవత్సర శుభాకాంక్షలు akka ..

  రిప్లయితొలగించు
 8. మీక్కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించు
 9. రాధిక గారు , నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించు
 10. రాధిక గారు! మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ....:)

  రిప్లయితొలగించు
 11. @అబ్బో మందు తో కూడిన విందు తో బాగానే చేసుకుంటారు ప్రతి సంవత్సరం ....mandu sarvaantryaami andee ippudu..

  రిప్లయితొలగించు
 12. pureti,తేజస్వి,జయ ,వేణుశ్రీకాంత్,మాలాకుమార్,మంచు,బులుసు సుబ్రహ్మణ్యం,స్వామి(కేశవ),పరిమళం,సత్య,ఇందు,kvsv,లత గారు ,
  మీ అందరికి నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించు
 13. Raadhika gaaru, meeku , family kee nutana samvatsara shubhaakaankshalandee...greeting baagundi colorful gaa

  రిప్లయితొలగించు
 14. ముందుగా మీకు మీ కుటుంభ శాభ్యులకు నూతన సంవతసర శుభాకాంక్షలు...

  బాగున్నాయండి మీ ఊరి కబుర్లు.. నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.. నేను మా తమ్ముడు కలసి మా అక్క వేసిన ముగ్గుకి రంగులు వేసేవాలం, చాలా బాగుండేది...

  రిప్లయితొలగించు