=''/>

24, జనవరి 2011, సోమవారం

యంత్రం సహాయంతో వరిచేలో ఊడ్పు( నాట్లు)

వ్యవసాయం చేయడం అంటే ఈ రోజులలో ఎంత కష్టమైన పనో అందరికీ తెలిసిందే....

వ్యవసాయ పనులకు వచ్చే కూలీల రేట్లు పెరిగాయి. ఎరువులు ,పురుగుమందుల రేట్లు పెరిగిపోయాయి. ఇవన్నీ చాలవన్నట్టు అడపా దడపా ప్రకృతి వైపరిత్యాలు పలకరిస్తుంటాయి. ఐనా ఎంతో శ్రమ పడి అన్నింటినీ తట్టుకుని పంట పండిస్తే గిట్టుబాటు ధర రాదు. కష్టమైనా నష్టమైనా రైతు వ్యవసాయం చేయక మానడు..

మా వైపు ఇప్పుడిప్పుడే యంత్రాల సహాయంతోవ్యవసాయం చేయడానికి అలవాటుపడుతున్నారు.

నాలుగేళ్ల నుండి వరిచేను కోతలకు చాలామంది కోత మిషన్ ను ఉపయోగిస్తున్నారు.

మాకు ఇప్పుడు దాళ్వా పంటకి వరి నాటే యంత్రం ఉపయోగించి వరిచేలు ఊడుస్తున్నారు(వరి నాటడాన్ని ఉడ్పుఅంటారు ).

పన్నెండు మంది కూలీలు రోజుకి ఒక ఎకరం ఊడుస్తారు.వాళ్ళు సరిగ్గా టైం కి వచ్చి బాగా చేస్తే ఇంకో అరెకరం ఎక్కువ అవుతుంది అంతే .పైగా వాళ్ళని ట్రాక్టర్ పై తీసుకెళ్ళడం ,తీసుకురావడం ఓ పని .

వరి నాటే యంత్రమైతే రోజుకి నాలుగెకరాలు ఊడుస్తుంది.ఎప్పుడూ కట్టేలాగా నారుమళ్ళు కట్టక్కర్లేదు .వాళ్ళే ట్రే లలో మట్టి నింపి విత్తనాలు వేసి కొంచెం మొలకలోచ్చేక మనకి అందజేస్తారు.. అవి పెరిగేక వాళ్ళే మిషన్తో వచ్చి ఉడ్చేస్తారు..వాళ్ళ మనుషులు ముగ్గురుంటారు .అంతా వాళ్ళే చూసుకుంటారు.మాములుగా కూలీలతో ఐతే కూలీలతో పాటు ,రైతు,పాలేళ్ళు అందరూ అక్కడే ఉండి హడావిడి పడాలి.

పుగాకు తోటలు వేయడానికి కూడా ఇలా మిషన్లు వస్తే బాగుంటుంది.పుగాకైతే అన్ని పనులకీమిషన్లు ఉంటే మా వాళ్లకు చాలా శ్రమ తగ్గుతుంది.

ట్రే లలో సిద్దంగా ఉన్న నారు.


పై చిత్రాలకి ,ఈ చిత్రానికి తేడా చూసారా??చేనంతా ఎలా హడావిడిగా ఉందొ!

ఇలా వ్యవసాయ పనులకు యంత్రాలు వాడటం వలన కొంతవరకూ ఖర్చు కలిసొస్తుంది .అలానే శారీరక శ్రమా తగ్గుతుంది.

9 కామెంట్‌లు:

 1. యంత్రాలతో పని చేయిస్తే చాలా కలిసొస్తుంది సమయమూ ఖర్చూ కూడా.
  కానీ ఆ (కూలోళ్ళతో చేయించే) సందడి వేరు కదా...

  ఫొటోస్ చాలా బాగా వచ్చాయి రాధిక గారూ.

  రిప్లయితొలగించు
 2. రాధిక గారూ, ఏం చెప్పమంటారు.. ఇంటరెస్టింగ్ పోస్ట్.. ఒక చిన్న సలహా/రెక్వెస్ట్ .. ఒక చిన్న చెక్క లో పొలం దున్నటం నుండి, పంట కోయటం దాకా.. బ్లాగు లో మీ తీరిక ని పట్టి డెవెలప్ మెంట్లు ( సాధక బాధకాలూ, ఇబ్బందులూ,చిన్న చిన్న విజయాలూ, ఇంటరెస్టింగ్ విషయాలూ గట్రా.. ) వేస్తే. మా లాంటివాళ్ళు.. ఎంతో నేర్చుకుంటాం.. ఆలోచించండి?

  రిప్లయితొలగించు
 3. అబ్బా.. భలే రాసారు :-) ఫొటొస్ సూపర్..
  మరి ఊడ్చేటపుడు కూలీల పాటలు ఉంటాయి కదా...ఈ యంత్రాల వల్ల అవి మిస్ అయిపొమూ...:-)

  రిప్లయితొలగించు
 4. టపా బాగుంది. ఫోటోలు బాగున్నాయి. కానీ ఎక్కడో చివుక్కుమంది. ఒక వ్యవస్థ కూలిపోతోందేమో నన్న అనుమానం. వ్యవసాయం అంటే ఓ కామందు, ఒక పెద్ద పాలేరు, వెనక 50-60 కూలీలు, అన్నీ మాయమయైపోతాయా. అంతో ఇంతో పల్లెల్లో ఇంకా పాత వాసనలు ఉన్నాయనుకున్నాను. విస్తరిస్తున్న కార్పొరేటు కల్చరు.ఏం చేస్తాం.

  రిప్లయితొలగించు
 5. @గీతిక ,కూలోళ్ళతో చేయిస్తే సందడిగానే ఉంటుంది కానీ,వాళ్ళతో పడలేక ఇలా మిషన్స్ పై ఆధారపడటం..ధన్యవాదాలు.
  @కృష్ణప్రియ,ట్రై చేస్తానండి.ధన్యవాదాలు.
  @మంచు,ఇప్పుటి కూలీలకి పాటలు కూడా వచ్చా? సినిమాలలో చూపిస్తారు కానీ,ఎప్పుడో మానేసారండి.

  రిప్లయితొలగించు
 6. బులుసు సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మాకు వ్యవసాయానికి కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంటుంది.వాళ్ళ అంతో ఇంతో చదువుకుంటున్నారు . ఏ ఫ్యాక్టరీ లోనో పనిచేయడం,ఆటో నడుపుకోవడం ఇలా ఇతర పనులకు పోతున్నారు.మరి సమయానికి కూలీలు లేకపోతె ఏమి చేయాలండి? మిషన్లు తో ఐతే పనులు సమయానికి జరుగుతాయి.కూలీల కొరత వలన పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతడిగితే అంతా ఇవ్వాల్సిందే.
  ఇప్పుడింకా పరవాలేదండి,ఇంకా పదేళ్లు పొతే అప్పుడు అచ్చంగా కార్పోరేట్ వ్యవసాయమే..ధన్యవాదాలు.
  .

  రిప్లయితొలగించు
 7. ఓ పది పదిహేనేళ్ళ క్రితం "మన దగ్గర ఇలా జరిగే అవకాశం ఎప్పటికైనా ఉందా?" అనుకున్నాను.. జరిగిందని మీరు చూపించేశారు.. మార్పు సహజమే కదండీ..

  రిప్లయితొలగించు
 8. ఫొటోలు బాగున్నాయి....

  కూలీలెక్కడికీ పోరు...వారు పని చేసే ప్రాంతం మారు తుంది...
  పొలాల్లో పనిచేయాల్సిన కూలీల అవసరం తగ్గిపోతే ...
  అక్కడ ఆ నాట్లువేసే యంత్రాల తయారీ కీ కూలీల అవసరం పెరుగుతుంది....
  బులుసుగారన్నట్లు ,
  ఆ వ్యవస్థ వాసన పోతుంది,
  కూలిలతో తగువు తగ్గుతుంది,
  ఊళ్ళు ఇంకాస్త ఖాళీ అవుతాయ్..
  పైరు-పాటలు మాయమౌతాయ్...
  సందడి , హోరు గా మారుతుంది...
  పని, జోరు గా మారుతుంది...

  -satya

  రిప్లయితొలగించు
 9. nice RADHIKA!
  i wish to share with u.I show u some financial indipendency thru global way.which I am getting handsome income.contact me....
  jyothimanasa708@gmail.com

  రిప్లయితొలగించు