=''/>

27, డిసెంబర్ 2010, సోమవారం

తేగల సీజన్ ఐపోతుంది.

తేగలు ఇంక లేవు ,ఈరోజు అన్నీ తీసి కాల్పించి తెచ్చేసేము అంటే ... మా సాయి ని హోంవర్క్ చేసుకోనివ్వకుండా, తేగలో చందమామ ని అలా పట్టుకో ,ఇలా పట్టుకో అని కాసేపు వాడిని విసిగించి తేగల ఫోటో పెట్టమని అడిగిన ఫ్రెండ్ కోసం (అందరికోసం )ఇలా...

7 కామెంట్‌లు:

 1. అబ్బ! చూస్తుంటేనే తినాలనిపిస్తోందండి. ఎన్నాళ్ళయిందో తిని... ఈ హైదరాబాదులో ఈమధ్య ఎక్కడా కనిపించలేదే. వెతకాలి. కానీ మనవైపు టేస్టు ఉంటుందా?

  రిప్లయితొలగించు
 2. చిన్నప్పుడు నాకు తేగలంటే అస్సలు ఇష్టం ఉండేవు కాదు. అప్పుడు మా ఊరు నుండి ఇంటికి తేగలు విరివిగా వచ్చేవి కానీ కాసింత కనరుగా ఉంటాయని తినబుద్దేసేది కాదు. ఇప్పుడిప్పుడు ఇష్టపడుతున్నాను....కానీ ఏవి?....ఈ పెద్ద నగరాల్లో తేగలు ఎక్కడ దొరుకుతాయి :( ఎప్పుడో ఇంటికెళ్ళినప్పుడు తిండమే!

  ఇంతకీ తేగల్లో ఉన్నదాన్ని చందమామ అని ఎందుకంటారు? మీకేమైనా తెలుసా?

  రిప్లయితొలగించు
 3. అన్యాయం,తేగల ఫోటోలు చూపించి ఆశపెట్టి ఊరిస్తున్నారు. తలకొక రెండు తేగలు పంపిచకూడదా అని అడుగుతున్నాను సాదా సీదా గృహిణి గారిని. చందమామ ని విడదీసి విసనకర్ర లాగా, ఆడుకొనేవారం మా చిన్నప్పుడు. వీలైతే అలాంటి ఫోటో కూడా పెట్టండి.

  రిప్లయితొలగించు
 4. ఈ తేగల రుచి డిఫరెంట్ కదా! నాకు మొదట్లో నచ్చేది కాదు.చిరు చేదు తగులుతూ ఉండేది.మా అమ్మకి బోలెడంత ఇష్టం.అందుకే తెగ కొనేది. ఇంట్లో అందరు తినేవాళ్ళు నేను తప్ప.కానీ మెల్లగా నాకు అలవాటయిందిలేండీ....చీరాల ఓడరెవు ఒడ్డులో వనభోజనాలకి వెళ్ళీనప్పుడు....సాయంత్రం స్నాక్స్ గా తేగలు...పిడతకిందపప్పు....ఉడ్కబెట్టిన వెరుసెనక్కాయలు....తినేవాళ్ళం.ఆ రోజులన్నీ గుర్తుచేసరు రాధికగారు.

  రిప్లయితొలగించు
 5. నోరూరుపొతుంది. ఎన్నాళ్ళయిందొ తిని .... చూసి కూడా... నేల గుల్లగా ఉంటే తేగలు బాగా ఊరి మంచి టేస్ట్ వస్తాయనుకుంటా... పొలం వెళ్ళి తేగలు తీయించుకుని, కుండలొ కాల్పించి ఇంటికి తెచ్చుకొవడం మాకు అప్పట్లొ ఫెవరెట్ ఆదివారం కార్యక్రమం....

  తొకమట్ట తింటే తొంబై ఏళ్ళు బతుకుతారు అని తొకమట్టలు వదిలేవాళ్ళం కాదు. చందమామ (చివర సాఫ్ట్‌గా ఉండేది) తింటే చదువురాదు అనేవారు అందుకే చందమామ తినేవాళ్ళం కాదు.... కానీ అది చెవులొ పెట్టుకుని తిప్పితే చల్లగా భలే ఉండేది :-) ముక్కలు చేసి బాగ ఎండబెట్టి దాచుకుని మరీ తినేవాళ్ళం... చెరుకుపానకం లొ నంచుకొవడం స్పెషల్.... టీ తేగలు సూపర్ కాంబినేషన్ ...

  మీకు ప్రత్యేక కృతజ్ఞతలు రాధిక గారు.... many thanks :-)

  రిప్లయితొలగించు
 6. @తేజస్వి,తొందరగా వెతకండి సీజన్ ఐపోతుంది:))..ధన్యవాదాలు.
  @సౌమ్య,చందమామ అని ఎందుకంటారో నాకూ తెలియదండి??..ధన్యవాదాలు.
  @బులుసు సుబ్రహ్మణ్యం,మిరు కొంచెం దగ్గర్లో ఉంటె రెండేన్టండి బోల్డు తేగలు పంపెదాన్ని..విసినికర్ర లా చేసేను కానీ బాగా రాలేదని పెట్టలేదు..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 7. @ఇందు,ధన్యవాదాలు.
  మంచు గారు తోకమట్ట గురించి తెలియదు కానీ చందమామ మేము తినము చదువురాదని:)).అబ్బో చెరుకు పానకంలో ,టి లోను నంజుకోవడం అన్ని రకాలుగా తింటారా మీరు!..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు