=''/>

11, డిసెంబర్ 2010, శనివారం

సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఈ రోజే !

.

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. ముఖ్యముగాతమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియి కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.

తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి,సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది

.సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు.

మా జిల్లాలో అత్తిలోను,తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు లోనూ షష్టి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

చిన్నప్పుడు మాఊరు లో సుబ్రహ్మణ్య స్వామి గుడి లేక మేమంతా మాకు దగ్గరలో" యాదవోలు" అనే ఊరు వెళ్ళే వాళ్లము. అక్కడ బాగా జరుగుతుంది. మేము,తెలిసినవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు అందరమూ కలిసి ప్రొద్దుటే ట్రాక్టర్ వేయించుకొని వెళ్లి స్వామిని దర్శించుకొని ,దుకాణాలు అవి తిరిగి మద్యాహ్నానికి వచ్చేవాళ్లము .అప్పుడు షష్టి కి స్కూల్ కి సెలవుండేది.(ఇప్పుడు చాలా మంది పిల్లలకి సుబ్రహ్మణ్య స్వామి షష్టి అనే ఓ పండుగ ఉంటుందనే తెలీదేమో ) .


ఇప్పుడైతే మా ఉళ్ళో శివాలయం లోనే సుబ్రహ్మణ్య స్వామి ని ప్రతిష్టించారు. ఇక్కడికే వెళ్తున్నామంతా..మా సాయి , నేను రాను బడుంది అన్నా బలవంతంగా వాడిని తీసుకునే ఉదయం గుడికి వెళ్లొచ్చాను..

5 కామెంట్‌లు:

 1. సుబ్రహ్మణ్య షస్ఠి అత్తిలి లో మా చిన్న తనంలో బాగా జరిగేది ఊరేగింపుల్లో బోగం మేళాలు (అది మంచి సంప్రదాయంకాదనుకోండి) డాన్సు చేసె గుర్రాలు బుట్ట బొమ్మలు బోలెడు బాండ్ మేళం ట్రూపులు వచ్చేవి నెలల రోజులు పాటు పందిళ్ళు అవి ఉండెవి కొన్ని దుకాణాలైతే సంక్రాంతి వరకు ఉండేవని మా పెద్దవాళ్ళు చెబుతారు 70 దశకం తరువాత సమాజం లో వచ్చిన మార్పులువల్ల క్రమేణా ఆ ఉత్సవాల ప్రభ వెలసి పోయింది

  రిప్లయితొలగించు
 2. మా అమ్మమ్మ గారి ఊరు బిక్కవోలికి 8 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. మేము హైదరాబాద్ లో పెరిగినా, చిన్నతనం లో ఒకటి రెండు సార్లు వెళ్ళాము.. ' సుబ్బారాయడి షష్టి ' కి. ఇప్పుడు బిక్కవోలు కి మా కుటుంబం వెళ్ళే 20 యేళ్ళు దాటిపోయింది. కానీ మీ పోస్ట్ చూశాక.. మా అమ్మకి ఫోన్ చేసి గుర్తు చేశాను నిన్న ..

  రిప్లయితొలగించు
 3. నాకు ఈరొజు షస్టి అని గుర్తులేదండి.... అయితే లక్కీగా ఈరొజే గుడికి వెళ్ళాను....

  సుబ్రహమణ్య షస్టి అంటే ముందు గుర్తొచ్చేది గుడిలొ పొడుగు లైన్.... దర్శనం అయి బయటకు రాగానే తీర్థం లొ కొనుక్కునే జీళ్ళు, ఖర్జూరం, ఆడుకునే బొమ్మలు, ..... మా ఊళ్ళొ కూడా బాగానే చేస్తారు కానీ...చిన్నప్పుడు ఎక్కువ అత్తిలి వెళ్ళేవాళ్ళం ......


  భలే గుర్తు చేసారు....థాంక్స్ అండీ

  రిప్లయితొలగించు
 4. నిన్న షష్టి కదా.. మన హడావుడిలో మనం ఉండి (నాలుగు సుబ్రహ్మణ్య షష్టిల్ని చూశాను మరి) బ్లాగులవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడే చూస్తున్నా మీ పోస్ట్. బాగుంది.

  నా PG అయ్యేవరకూ సుబ్రహ్మణ్య షష్టి అనేదొకటుందని తెలీదు నాకు. మొదటిసారి షష్టి ఉత్సవాల్ని కైకరంలో చూశాను. ఇంత బాగా జరుపుకునే పండగొకటుందా అని ఆశ్చర్యం వేసింది.

  ఇప్పుడైతే షష్టి కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టాను. ఆ సందడి కోసమే కాదు... ప్రస్తుతం మన ఫేవరేట్ అయిన జీళ్ళు కోసం కూడా.

  రిప్లయితొలగించు
 5. రాధిక గారూ మీ మాటల్లో ఈ షష్టినీ చూస్తానని ఎదురుచూశాను. ఎలా జరుపుకున్నారు...?

  మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన మీ బ్లాగుకి అభినందనలు

  రిప్లయితొలగించు