నాకు బాగా గా గా చెయ్యడం వచ్చిన ,నేర్చుకున్న మొదటి స్వీట్ "పాలకోవా" !
బాగా చెయ్యడం రావడం వల్లేమో ఇంట్లో పాలుండాలే పిల్లలు ఎప్పుడడిగినా చిటెకలో అంటే ఓ గంటలో చేసేస్తా :) . మరి పాలకోవా చెయ్యాలంటే కనీసం గంట పడుతుంది. ఒక లీటరైతే గంట కి కాస్త తక్కువ టైం పడుతుంది కానీ ,ఎక్కువ పాలతో ఐతే చెయ్యడానికి ఎక్కువ సమయమే పడుతుంది .
పాలకోవా ఇత్తడి పళ్ళాల్లో చేస్తే బావుంటుంది . ఒక లీటర్ పాలతో ఐతే అడుగు దళసరి గా ఉన్న గిన్నె వాడొచ్చు కానీ ఇంకా ఎక్కువైతే ఇత్తడి పళ్ళెం కానీ ఇత్తడి మూకుడు కానీ మంచిది .
పళ్ళెం లో ఐతే అడుగంట కుండా తిప్పడానికి తేలికగా వుంటుంది .పాలు తొందరగా ఆవిరవుతాయి .
ఆవు పాలు పలచగా ఉంటాయి కాబట్టి గేదె పాలతో చేసుకుంటే మంచిది.
లీటర్ పాలకి సోల డు పంచదార (పావుకేజీ పంచదార )పడుతుంది .
పళ్ళెం లో పాలు పోసి పాలు సగానికి పైగా ఆవిరయ్యేవరకు తిప్పుకోవాలి .
పాలు ఆవిరై చిక్కబడ్డాక పంచదార పోసి ,ఈ సారి జాగర్త గా తిప్పాలి. లేకపోతే అడుగంటుకుని ఎరుపు రంగులోకి మారిపోతుంది . అలా ఉంటే రుచి మారక పోయినా మా పిల్లలు రంగు చుసి మాకొద్దంటే మాకొద్దంటారు .
ఇలా దగ్గర పడ్డాక ,చిన్న ప్లేట్ లో కాస్త వేసి ఉండ చేసి చూసుకుని ఉండైపోతే ,కొద్ది కొద్ది గా తీసుకుని చిన్న గరిటి తో బాగా పాముకుని చేతికి నెయ్యి రాసుకుని పాలకోవాలు చేసుకోవడమే . ఈజీ గా చెప్పేసా కానీ ,ఒక్కోసారి పంచదార పోయ్యగానే పాలు ఇరిగి పోతాయి . అటువంటప్పుడు అడుగు సమానంగా ఉన్న గిన్నెకి నెయ్యి రాసి ,విరిగి తొరకల్లా ఉన్న దాన్ని గట్టిగా పామితే బాగానే ఉంటుంది .కాని,పాలు విరక్కుండా ఉంటే చూట్టానికి ,తినడానికి బావుంటాయి :))
పాలకోవాలు నొక్కడానికి అచ్చులున్నాయి కానీ, నాకైతే ఇలా వేళ్ళతో చేస్తేనే నచ్చుతాయి .
chaala chaala bagunnayandi. ila chudatam kakunda tinadam aite inka baguntundi.....
రిప్లయితొలగించండిthanks andi
తొలగించండిRingulu tippi flashback lo ki tesokonivelaru priyagaru.
రిప్లయితొలగించండిLovely pics and mouthwatering kovas.
చూస్తుంటేనే నోరూరిపోతోంది. మేము రాజమండ్రీ లో చుట్టుపక్కల తిరగటానికి వెళ్ళినప్పుడు తెగ కొనుక్కొని తిన్నాము :) దారంతా రోడ్డు పక్కనే చేస్తుండేవారు. వేడి వేడిగా చాలా బాగుండేది :)
రిప్లయితొలగించండి:))
తొలగించండిచేయడం పరమ ఈజీ,
రిప్లయితొలగించండితినడం భలే రుచి, కానీ.,
తోమడం పరమ కష్టం :)
హ్హ హ్హ హ్హ కాప్షన్ సూపర్ గా ఉంది :)) అవునవును తోమడం పరమ కష్టమే :)
రిప్లయితొలగించండి