అమ్మమ్మ వాళ్ళూరు రెడ్డి గణపవరం ! రెడ్డి గణపవరం ,ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటినీ పదిహెనో శతాబ్ధం లో రెడ్డిరాజులు పరిపాలించారట .రెడ్డిరాజుల కాలం నాడు కట్టించించిన శివాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది.నిత్యం పూజలూ జరుగుతున్నాయి.
అక్కడే వెలసిన" కనకదుర్గమ్మ"కు వంద సంవత్సరాల పూర్వం నుండీ ప్రతీ సంవత్సరం హొలీ పౌర్ణమి నుండీ ఐదు రోజుల పాటు తీర్థం ఘనం గా జరుగుతుంది.
చిన్నప్పుడు తీర్థం ఎప్పుడొస్తుందా అనెదురు చూసేవాళ్ళం . ఎంచక్కా ప్రతీ ఏడూ బడె గ్గొట్టేసి మరీ వెళ్లి ,ఐదు రోజు లూ ఎండ ను కూడా లెక్క చేయకుండా తిరిగేసేవాళ్ళం .
ఈ మధ్య వెళ్లి ఐదారేళ్ళవుతుందేమో ! ఈ సారి సరిగ్గా తీర్థం జరిగే టైం కి అనుకోకుండా సెలవలు కలిసొచ్చి హాస్టల్ నుండి సాయి వచ్చాడు . చెల్లి ,పిల్లలు కూడా రావడం తో అందరం కలసి వెళ్లాం .
దుర్గమ్మ గుడి ! మా చిన్నప్పుడు చిన్న గుడిసె లా ఉండేది .ఇప్పుడిలా ఉంది.
రెడ్డి రాజుల కాలం నాటి శివాలయం . ప్రతీ సంవత్సరం రంగులు వేసి వేసి చుట్టానికి రాతి కట్టడం లా అనిపించదు.
ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న రాతి మండపం .
ఇటువంటి రాతి స్తంభాలు రెండు , తుప్పల్లో గుడి కి కాస్త దూరం లో ఉన్నాయి. దాని మీద డిజైన్ఇప్పటికీ చక్కగా కనిపిస్తుంది . వాటిని చూసిగుడి దగ్గరే కాక వీటి దగ్గర కూడా శుబ్రం చేయించాల్సిందే అనిపించింది .
గుడి కొచ్చే భక్తుల కోసం దుకాణాలు.
అక్క ,అమ్మమ్మ ప్రతీ సంవత్సరం బోల్డన్ని గాజులు కొని పంపుతారు.ఈ సారి మేమే కొనుకున్నాం సంవత్సరానికి సరిపడా :)
ఎండలో తిరిగి అలసిపోయి గోళీ సోడా :)
జీళ్ళు
చిన్నప్పుడు తీర్థం లో బొమ్మలు కొనుకెళ్ళి ... అబ్బ ! వాటిని ఫ్రెండ్స్ కి చూపి వాళ్ళని ఏమేడిపించే వాళ్ళమో :)
అబ్బ నేను మీ మిద ఈర్ష్య పడుతున్నా ... ఒక్క సారి మాత్రం తిండి మానేసి గొడవ చేస్తే కొల్లేటి తిరనాళ్ళ కి పంపారు .. నైట్ ఫొటోస్ సరిగ్గా రాల మీవి ... బట్ మిగిలినవి బాగున్నై ..
రిప్లయితొలగించండిthank you so much ! you bring back so many memories
రిప్లయితొలగించండిthank you so much ! you bring back so many memories :-)
రిప్లయితొలగించండిAwesome pics