=''/>

29, మార్చి 2014, శనివారం

ఓ సారిలా చూడండి :)


మరేమో ఈ మధ్య నేను వాకింగ్   కి వెళ్ళడం మొదలుపెట్టానా ... మొదట్లో రెండురోజులు చేతిలో కెమేరా లేదే అని ఫీలయ్యి తరువాత నుండీ మర్చిపోకుండా వెంట పెట్టుకెల్తున్నానన్నమాట   !

దారిలో  ఇలాంటివన్నీ కనపడుతూ అప్పుడప్పుడూ   నా నడకకి బ్రేక్ వేస్తూంటాయన్నమాట !

పాపం నాతోపాటు  వాకింగ్ కి వచ్చే పిన్నిలు అత్తలూ,కూడా రోజూ నే వేసే  బ్రేక్ లకి అలవాటుపడిపోయారు    :)

 నానీ, అది చూడు అంటూ ఒకళ్ళు .. ఇదివరకు ఏమీ పట్టించుకునేవాళ్ళం కాదు ఇప్పుడు   చుట్టుపక్కల చూడవే చిన్నమ్మీ అంటూ   వెల్తున్నాం అంటుంటారు .

ఏంటీ ? వాళ్ళక్కూడా పిచ్చి అంటించేస్తున్నా అనుకుంటూన్నారా !

     సరే  మీరూ  చూడండే మరి    !


 మేం వెళ్ళెటప్పటికి బోల్డన్ని చిలుకలు .  చాలా చిలుకలు మా  అలికిడికి వెళ్ళిపోగా ఇవిమిగిలాయి . ఇంకాస్త క్లారిటీ గా ఉంటే  బావుండు :(

బుల్ బుల్ పిట్టలు.  మొదటి సారి గా కాస్త బాగా తీసాననుకున్నా ..
సీమ చింతలు పువ్వు ,పిందే  తో  ...
వాళ్ళ మానాన వాళ్ళు  పిడకలు వేసుకోకుండా టక్కన ఇటు తిరిగారు .


8 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది మీ ఫోటోగ్రఫీ! ఎనిమిదో ఫోటో చాలా బాగుంది ,మోడువారిన చెట్టు ,పొద్దుకుంగుతున్న సూరీడు. సీమచింతల కోసం' జానెడు చిన్న దాని బారెడు ప్రయత్నం ' బాగుంది .ఇంకా చిలకలు వాలిన చెట్టు కూడా బాగుంది .

    రిప్లయితొలగించు
  2. ​అందమైన దృశ్యాలు! ప్రకృతిని ఆరాధించడం అందరికీ నేర్పిస్తూ మంచి పనే చేస్తున్నారులెండి! :-)

    రిప్లయితొలగించు