=''/>

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

గోరుమిఠీ ( మిఠాయి)

గోరుమిఠీ  అసలు పేరు గోరుమిఠాయి అయిఉంటుంది.వాడుక  బాష లో  ఇలా గోరుమిఠీ  అయిపోయిందన్నమాట! మా గోదావరి జిల్లాల్లో సారె లో పెట్టే స్వీట్ల లో ఇదీ ఒకటి.(ఇతర చోట్ల కూడా చేస్తారేమో )

ఇవి చేయడం అందరికీ కుదరదు .మా ఉళ్ళో ముగ్గురో  ,నలుగురో  ఉన్నారు .ఎప్పుడన్నా చెయ్యాలంటే వాళ్లకి కబురంపి వాళ్ళొస్తామంటేనే చేసుకోవాలి .మా అమ్మమ్మ బాగా చేస్తుంది .తను చేసినప్పుడు  నేర్చుకుందామని చేస్తుంటా కానీ తనకి వచ్చినంత పలచగానూ,చక్కగా వెళ్ళు పడేలానూ రాదు . నాకు సరిగ్గా రావడం లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు కాస్త  పిండి కలుపుకుని  ప్రాక్టిస్ చెయ్యి  వచ్చేస్తుంది నేనలాగే చేసేదాన్ని  అంటుంది.

 ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి  ఉన్నట్టే  ఇవి చేయడానికీ అచ్చులు వచ్చేసాయి .ఎవరూ చేసేవాళ్ళు దొరకనప్పుడు దానిమీదే చేస్తాం .


చూపుడువేలు ,బొటనవేలు మధ్యలో పిండి పెట్టి ఇలా నొక్కుతారు .ఎంత పెద్ద  సైజైనా అంతే .

ఇలా చేయడం చూసి వేళ్ళతో చేస్తారు కాబట్టి వేలుమిఠీ అనాలి కానీ గోరుమిఠీ అంటారేంటి? అనడిగేడోసారి  మా సాయి.వేలు మిఠీ  అంటే బాగోలేదని  గోరుమిఠీ అంటున్నారేమో అన్నా :)

                                                       


                                             
 
  నూనెలో వేసేటప్పుడు ఇలా వేళ్ళతో తీసి వేయాలి .అప్పుడే చక్కగా అర్ధచంద్రాకారంలో  వస్తాయి .పంచదార పాకం పడితే గోరుమిఠీ  తయార్ :)  

10 కామెంట్‌లు:

 1. హాయ్ రాధికక్కా , బాగున్నారా ? మాకు ఈ గోరు మిఠాయిలు పరిచయం చేసింది మా పక్కింటి ఆంటి గారు, వాళ్ళది అమలాపురం. వాళ్ళత్తగారికి ఇవి చెయ్యడం బాగా వచ్చు.

  ఆవిడ చేస్తున్నప్పుడు, మా చెల్లి ఎలా చెయ్యాలో కనుక్కుని మరి రెండు రోజుల్లో వేలు ముద్రల మిఠాయిని తయారు చేసేసింది. ఆ మామ్మగారు దానిని గవ్వలు/గోరు మట్టెలు అనేవారు. (బహుశ పద భ్రంశమై అలా మారిందేమో!)

  షుగర్ పాకం లో బాగుంటాయని తెలిసినా మా అమ్మ వాటిని అప్పుడప్పుడు బెల్లం పాకం పట్టి పోస్తారు. మీరు చూపించినంత పొడువుగా కాకున్నా పొట్టి పొట్టి ఆరు ముద్రలు వచ్చేలాగ చేస్తారు.

  మీ బ్లాగ్ మొదలుపెట్టి నాలుగేళ్ళు పూర్తైన సందర్భం లో మీకు లేట్ గా అభినందిస్తున్నందుకు ఏమనుకోకండెం..

  శ్రీధర్ భుక్యా
  http://kaavyaanjali blogspot.in/

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. హాయ్ అండి ,మేమూ బెల్లం పాకం తో కూడా చేస్తామండి .ధన్యవాదాలండి

   తొలగించు
 2. మాక్కూడా తెలుసోచ్! బావుంటాయ్ రాధిక గారూ తీపి తక్కువగా .మా ఊళ్ళో వీటిని బెల్లం పాకం పడుతున్నారీమధ్యన పంచదార బదులుగా .అవీ బాగుంటాయ్ కానీ కాస్త పళ్ళు గట్టిగా ఉండాలి .వాటిలో ఉలవపిండి కూడా వేస్తారు .మీలాగే నేనూ చాలాసార్లు ప్రయత్నించాను .ఫర్వాలేదు.అంత పెద్దగా రాదుకానీ not bad అన్నమాట .

  Typed with Panini Keypad

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పంచదార కన్నా బెల్లం మంచిదంటున్నారని ఈ మధ్య బెల్లం పాకం పడుతున్నాము .కానీ మరీ అంత ముదురుపాకం కాదండి :) ధన్యవాదాలు రాణి గారు

   తొలగించు
 3. చాలా రోజుల తరువాత చూస్తున్నాను ఇది . మీకు కూడా తెలుసా ?.
  మన గోదావరి జిల్లలో తప్ప ఎక్కడా చూడలేదు ఇది. మా అమ్మ చేస్తుంది. ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని అడిగాను హైదరాబాద్ లో, వాళ్ళు కూడా తెలియదు అని చెప్పారు .
  మన దగ్గర తప్ప ఇంకెక్కడా చూడలేదు , స్వీట్ షాప్ లో కుడా అమ్మరు ( గోదావరి జిల్లాల్లో అమ్ముతారేమో ?? ) . కేవలం ఇంట్లో మాత్రమే చేసుకోవాలి . కాని భలే ఉంటాయి .

  రిప్లయితొలగించు
 4. అజ్ఞాత గారూ గోదావరి జిల్లాలోనే కాదండి..మా గుంటూరు జిల్లాలో కూడా చేస్తారు. ఇవి చెయ్యటం మాత్రం రాధిక గారు అన్నట్లు అందరికీ రాదు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సిరిసిరిమువ్వ గారు ఐతే మీక్కూడా తెలుసా ?మా జిల్లాలోనే అనుకున్నా ...ధన్యవాదాలండి

   తొలగించు
 5. మా గుంటూరు జిల్లాలో కూడా గోరుమిఠీ చేస్తారండి. :)

  రిప్లయితొలగించు
 6. తెలిసిందండి మువ్వగారన్నారు కదా :)ధన్యవాదాలండి

  రిప్లయితొలగించు