=''/>

27, జూన్ 2014, శుక్రవారం

చిన్న పని కి పెద్ద సంతోషం :)


ఈ రెండు రోజుల నుండీ కాస్త చల్ల బడింది కానీ ఈ వేసవి లో  ఎండలు ఎలా మండిపోయాయీ ..

మా ఇంటి చూట్టూ  చెట్లూ  ,పక్కనే పొలం వుండటం వల్ల పక్షులూ ,ఉడుతలూ  ఇంట్లో బాగా తిరుగుతుంటాయి.
అసలే వేసవి పాపం ఆ చిన్ని ప్రాణాలు ఈ వేడిని ఎలా తట్టుకుంటాయా అనిపించేది వాటిని చూస్తుంటే.

వేసవి లో వాటికి ఉదయాన్నే ఓ గిన్నెలో నీళ్ళు పోసి పెట్టడం అలవాటు. అదో   పెద్ద  సంతోషాన్నిచ్చే పని .  అలా పెట్టిన నీళ్ళు అవి తాగుతుంటే  చుట్టానికి  భలే  వుండేది .  వీటిని  ఫోటో తియ్యడానికి నాకు నాలుగు రోజులు పట్టింది .  ఏ  మాత్రం సడైనా  తుర్రు మనేవి . ఎలాగో  సడి   చప్పుడూ  చెయ్యకుండా వాటిని క్యాచ్ చేసేసా :)6 కామెంట్‌లు: